శత్రువు ఎవరో జగన్ కి తెలిసిందా?

ఏపీ రాజకీయాల్లో ఇపుడు ఉన్న పొలిటికల్ సీన్ బట్టి చూస్తే జగన్ కి కచ్చితంగా చంద్రబాబే ప్రత్యర్ధి. అందులో మరో డౌట్ లేదు. ఎందుకంటే 40 శాతం [more]

Update: 2019-12-14 02:00 GMT

ఏపీ రాజకీయాల్లో ఇపుడు ఉన్న పొలిటికల్ సీన్ బట్టి చూస్తే జగన్ కి కచ్చితంగా చంద్రబాబే ప్రత్యర్ధి. అందులో మరో డౌట్ లేదు. ఎందుకంటే 40 శాతం ఓట్ల వాటా, 23 సీట్లతో పాటు పెద్దల సభల్లో కూడా ప్రాతినిధ్యం కలిగిన టీడీపీ ఆరు నెలల క్రితం వరకూ అధికారంలో ఉంది. పైగా చంద్రబాబు రాజకీయ ఘనాపాఠి. అయితే రాజకీయాల్లో ఇవాళ ఉన్నట్లుగా రేపు ఉండదు, పైగా రాజకీయ నేతలకు ముందు చూపు ఎక్కువని కూడా అంటారు. మరో నాలుగున్నరేళ్ళకు జరిగే ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచే పోటీ పడుతున్నాయంటేనే వారి దూరద్రుష్టిని అర్ధం చేసుకోవాలి. మరి ఏపీలో బంపర్ మెజారిటీతో గెలిచిన జగన్ కి వచ్చే ఎన్నికల్లో తన అసలైన ప్రత్యర్ధి ఎవరో తెలుసునా అంటే. జరుగుతున్న పరిణామాలు, ఆ పార్టీ నేతలు చేస్తున్న కామెంట్స్ బట్టి చూస్తే అవును అన్న జవాబే వస్తుంది.

బీజేపీతో అలెర్ట్…..

ఏపీ రాజకీయాల్లో ఇపుడు బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ఫిరాయించిన ఎంపీలు తప్ప సొంతంగా గెలిచిన వారూ లేరు. అయితే కేంద్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షా పొలిటికల్ మ్యాజిక్ తెలిసిన వారు ఎవరైనా ఏపీలో బీజేపీ బలపడడానికి ఏమైనా చేస్తుందని చెబుతున్నారు. ఇపుడు బీజేపీ కూడా ఆ విధంగా పావులు కదుపుతోంది కూడా. రెండు చోట్ల ఓటమి పాలు అయినా కూడా పవన్ ఇంతలా చెలరేగిపోవడం వెనక బీజేపీ పెద్దల మద్దతు ఉందని జగన్ లాంటి నాయకులు గ్రహించకుండా ఉండలేరు కదా. అందుకే పవన్ కి బలం లేకపోయినా ఆయన మీదనే వైసీపీ బాణాలు ఎక్కుపెడుతోంది. అదే సమయంలో అసెంబ్లీలో తనకు ఎదురుగా కూర్చున్న టీడీపీని పెద్దగా లెక్కచేయడంలేదు. అసలు సీన్ లోనే లేని బీజేపీ ఎత్తులను ఎప్పటికపుడు తిప్పికొట్టడమే కాదు జగన్ బాగానే అలెర్ట్ అవుతూ తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారని కూడా అంటున్నారు.

కీలెరిగి వాత…..

ఇక బీజేపీతో జగన్ ఇప్పటికైతే స్నేహపూర్వకంగానే ఉంటున్నారు. కేంద్రంలో ఆ పార్టీ పార్లమెంట్ లో పెడుతున్న వివాదాస్పద బిల్లులకు కూడా కళ్ళు మూసుకుని మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే ఏపీలో రాజకీయ అవసరం కంటే ఆర్ధిక అవసరం జగన్ ది. కేంద్రంతో పేచీ పెట్టుకుంటే ఇంకా నాలుగున్నరేళ్ళ పాటు సుడిగండాలు దాటాలి. అందుకే వ్యూహాత్మకంగా జగన్ కేంద్రంతో దోస్తీ చేస్తున్నారు. వారు పట్టించుకున్నా లేకపోయినా కూడా తన వైపు నుంచి సానుకూలంగానే ఉంటున్నారు. అయితే జగన్ ప్రత్యేక హోదా విషయంలో వెనక్కి తగ్గారని, విభజన హామీలపైన గట్టిగా నిగ్గదీయలేకపోతున్నారని విపక్ష నేతలు అంటున్నారు. కానీ ఆ వైసీపీ నేతల మాటలను బట్టి చూస్తే సమయం వచ్చినపుడు జగన్ నిలదీస్తారని అంటున్నారు.

Tags:    

Similar News