జ‌గ‌న్ మ‌రిచిపోయారు.. కానీ బాబు బ్యాచే..!

అవును! సీఎం జ‌గ‌న్‌.. తాను న్యాయ‌వ్యవ‌స్థలో చోటు చేసుకున్న లోపాలు.. సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తి జోక్యం పెరిగిపోయింద‌నే ఆవేద‌న‌తో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ‌మూర్తికి రాసిన లేఖ‌.. [more]

Update: 2020-10-27 14:30 GMT

అవును! సీఎం జ‌గ‌న్‌.. తాను న్యాయ‌వ్యవ‌స్థలో చోటు చేసుకున్న లోపాలు.. సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తి జోక్యం పెరిగిపోయింద‌నే ఆవేద‌న‌తో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ‌మూర్తికి రాసిన లేఖ‌.. దీనికి సంబంధించి జ‌త చేసిన ఇత‌ర ఆధారాల‌ను కూడా ఆయ‌న ఎప్పుడో మ‌రిచిపోయారు. ఏం జ‌రిగితే.. అది జ‌రుగుతుంది ? ఏది జ‌రిగినా.. వెంట‌నే ప్రజ‌ల్లోకి వెళ్ల‌డ‌మే ముందున్న క‌ర్తవ్యం అని జ‌గ‌న్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న ఈ విష‌యంలోపై స‌ర్వత్రా వ్యతిరేక దాడి జ‌రుగుతున్నా.. టీడీపీ అనుకూల‌, సానుకూల వ‌ర్గాలు.. ముఖ్యంగా ఓ సామాజిక వ‌ర్గం నుంచి జ‌రుగుతున్న దాడిని ఆయ‌న అస్సలు ప‌ట్టించుకోవ‌డం మానేశారు.

లైట్ తీసుకుంటూ…..

అంతేకాదు, వైసీపీ నాయ‌కుల‌ను కూడా ఈ విష‌యంపై ఎవ‌రూ మాట్లాడ‌వ‌ద్దని ఆదేశాలు జారీ చేశారు. న‌ర్మగ‌ర్భంగా కూడా ఎవ‌రూ ఈ విష‌యంలో వేలు పెట్టవ‌ద్ద‌ని, పెంచ‌వ‌ద్దని.. కూడా జ‌గ‌న్ సూచించిన‌ట్టు తెలుస్తోంది. ఇక్, త‌న సొంత మీడియాలో మాత్రం అనుకూల సానుకూల మేధావుల నుంచి అభిప్రాయాల‌ను వెల్లడిస్తున్నారు. అంటే.. దాదాపు ఇది ఇంత వివాదం అయిన‌ప్పటికీ.. జ‌గ‌న్ మాత్రం లైట్ తీసుకున్నారు. ఏం జ‌రిగినా.. త‌న మంచికే అనుకుంటున్నారు.కానీ, ఇదే విష‌యంలో చంద్రబాబు మాత్రం కుమిలిపోతున్నార‌ని అంటున్నారు పార్టీ త‌మ్ముళ్లు. ఆయ‌న నిత్యం ఇదే విష‌యంపై ఆలోచిస్తున్నార‌ని వారు చెబుతున్నారు.

మౌనంగా ఉండటమే బెటరని….

“మా నాయ‌కుడికి ఆలోచ‌న‌తోపాటు భ‌యం కూడా ఉంది. గ‌తంలో ఓటుకు నోటు కేసులో త‌న పేరు రాగానే వెంట‌నే మీడియా మీటింగ్ పెట్టి.. వ్యూహాత్మకంగా ఎదురుదాడికి దిగారు. కానీ, ఇప్పుడు ఆఛాన్స్ లేక‌పోవ‌డం.. పైగా నేరుగా త‌న‌కు సంబంధించిన వ్యక్తుల‌తో ఈ విష‌యంపై మాట్లాడితే.. ఇంటిలిజెన్స్ నిఘా వ‌ర్గాలు ప‌సిగ‌డ‌తాయేమోన‌ని కూడా చంద్రబాబు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది“ ఇదీ టీడీపీలో ఓ సీనియ‌ర్ మాట‌. ఇప్పుడు మా బాబైనా.. మేమైనా చేయ‌గ‌లిగింది ఏమీ లేదు. జ‌ర‌గాల్సింది జ‌రుగుతుంది. మేం ప‌నిగ‌ట్టుకుని మాట్లాడినా.. బాబును వెనుకేసుకువ‌చ్చినా.. లాభం లేదు.. సో.. ఇప్పుడు బాబు దీనిపై మౌనంగా ఉండ‌డం బెట‌ర్ అనే సూచ‌న‌లు వ‌స్తున్నారు. మ‌రి బాబు ఎలా తీసుకుంటారో ? చూడాలి.

కక్కలేక…మింగలేక….

ఇదిలావుంటే.. చంద్రబాబుపై సానుభూతి వున్న ఆయ‌న సామాజిక వ‌ర్గం నేత‌లు, కొన్ని మీడియా సంస్థలు కూడా జ‌గ‌న్ విష‌యాన్ని మ‌రిచిపోకుండా.. ఇంకా చంద్రబాబును వెనుకేసుకు వ‌చ్చేందుకు ఉన్న మార్గాల‌ను అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే.. జ‌గ‌న్‌ను విల‌న్‌ను చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నాయ‌ట‌. దీనికి కొంద‌రు బీజేపీలోకి వెళ్లిన టీడీపీ మాజీ నేత‌లు కూడా స‌హ‌క‌రిస్తున్నార‌ని ప్రచారం జ‌రుగుతోంది. ఏదేమైనా.. జ‌గ‌న్ మ‌రిచిపోయినా.. చంద్రబాబు, ఆయ‌న బ్యాచ్ మాత్రం ఈ విష‌యాన్ని మ‌రిచిపోలేక‌.. అలాగ‌ని ఆక్రోశం క‌క్కలేక త‌ర్జన భ‌ర్జన ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News