కోవ‌ర్టుల లెక్క తేల్చిన జ‌గ‌న్‌.. ఇక‌, ఆప‌రేష‌నే నెక్ట్స్..!

ఏపీ అధికార పార్టీ వైసీపీలో కొన్నాళ్లుగా చ‌ర్చనీయాంశంగా ఉన్న కోవ‌ర్టుల లెక్క తేలిందా ? జ‌గ‌న్ చేతికి నివేదిక వెళ్లిందా ? అంటే.. ఔన‌నే అంటున్నారు సీనియ‌ర్ [more]

Update: 2020-10-24 06:30 GMT

ఏపీ అధికార పార్టీ వైసీపీలో కొన్నాళ్లుగా చ‌ర్చనీయాంశంగా ఉన్న కోవ‌ర్టుల లెక్క తేలిందా ? జ‌గ‌న్ చేతికి నివేదిక వెళ్లిందా ? అంటే.. ఔన‌నే అంటున్నారు సీనియ‌ర్ నాయ‌కులు. కొంద‌రు మంత్రులు కూడా ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించారు. ఇటీవ‌ల కాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అత్యంత కీల‌క‌మైన విష‌యాలు బ‌హిర్గతం అయిపోతున్నాయి. మ‌రీ ముఖ్యంగా చంద్రబాబు అనుకూల మీడియాకు ఇవి వాయు వేగ మ‌నోవేగాల‌తో చేరిపోతున్నాయి. అంతేకాదు, ఏకంగా కేబినెట్ నిర్ణయాలు కూడా విశ్వస‌నీయ వ‌ర్గాల పేరుతో లీక్ అయిపోతున్నాయి.

ఎన్ని వార్నింగ్ లు ఇచ్చినా…..

ఈ విష‌యంపై కొన్నాళ్లు చూసీ చూడ‌న‌ట్టు సీఎం జ‌గ‌న్ వ్యవ‌హ‌రించారు. త‌ర్వాత నేరుగా కొంద‌రు మంత్రుల‌ను ఆయ‌న హెచ్చరించిన‌ట్టు వార్తలు వ‌చ్చాయి. అదే స‌మ‌యంలో ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు కూడా వాట్సాప్ ‌గ్రూపుల్లో ఈ మెసేజ్ పెట్టారు. ఎవ‌రూ కూడా ప్రభుత్వ నిర్ణ‌యాల‌ను లీక్ చేయొద్దని, టీడీపీ అనుకూల మీడియాతో దూరంగా ఉండాల‌ని హెచ్చరించారు. అయిన‌ప్పటికీ.. నిర్ణయాలు మాత్రం య‌థాత‌థంగా అంద‌రికంటే ముందుగా స‌ద‌రు మీడియాకు చేరిపోతున్నాయి. ఈ విష‌యం సీఎం జ‌గ‌న్‌కు తీవ్రమైన త‌ల‌నొప్పిగా ప‌రిణ‌మించింది.

వైసీపీలోని అసంతృప్త నేతలు……

మ‌రీ ముఖ్యంగా ఇటీవ‌ల ఆయ‌న ఢిల్లీ ప‌ర్యట‌న చేసిన విష‌యాలు, ప్రధాని న‌రేంద్రమోదీతో చ‌ర్చించిన అంశాలు కూడా బ‌హిర్గతం కావడంపై ఆయ‌న ఒకింత సీరియ‌స్ అయి.. 45 గంట‌ల్లో లీకు వీరుల‌ను క‌నిపెట్టే బాధ్యత‌ల‌ను ఇంటిలిజెన్స్‌కు అప్పగించార‌ని తెలిసింది. ఈ క్రమంలో నివేదిక తాజాగా ఆయ‌న చేతికి చేరిపోయింద‌ని అంటున్నారు. వైసీపీలోకి వ‌చ్చిన టీడీపీ నాయ‌కులే కాకుండా వైసీపీలో ఉంటూ.. అసంతృప్తితో ర‌గిలిపోతున్న న‌లుగురు కీల‌క నేత‌లు కూడా ఈ జాబితాలో ఉన్నార‌ని తెలిసింది.

పది మంది వరకూ…..

ఇక మంత్రి ప‌ద‌వులు రాని వారు, సీనియ‌ర్లుగా ఉన్న వారు కూడా లిస్టులో ఉన్నారు. నెల్లూరు, సీమ జిల్లాల‌కు చెందిన వారే కాకుండా జ‌గ‌న్ సామాజిక వ‌ర్గ ఎమ్మెల్యేలు ( సీనియ‌ర్లు ) కూడా ఈ లిస్టులో ఉన్నార‌ట‌. మొత్తంగా ప‌ది మంది వ‌ర‌కు కోవ‌ర్టుల జాబితా రెడీ అయింద‌ని అంటున్నారు. వీరిపై చ‌ర్య‌లు తీసుకోవ‌డ‌మే త‌రువాయి అని అంటున్నారు. చిత్రం ఏంటంటే.. ఒక మంత్రి పేరు కూడా ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

Tags:    

Similar News