వామ్మో ఏపీకి కొత్త సీఎం ని తెచ్చేస్తున్నారే…?

ఎంత సంబరమైనా మరీ ఇంత అతిగా ఉంటుందా. జగన్ ఇంతలా బాధలు పెట్టేశాడా. ఆయన వచ్చి గట్టిగా ఏడాదిన్నర కూడా కాలేదే. కానీ ఆయన దిగిపోవాలని కోటి [more]

Update: 2020-10-24 02:00 GMT

ఎంత సంబరమైనా మరీ ఇంత అతిగా ఉంటుందా. జగన్ ఇంతలా బాధలు పెట్టేశాడా. ఆయన వచ్చి గట్టిగా ఏడాదిన్నర కూడా కాలేదే. కానీ ఆయన దిగిపోవాలని కోటి దేవుళ్లకు తెలుగుదేశం పార్టీ మొదటి రోజు నుంచి మొక్కుతుంది. ఇపుడు జగన్ తీసుకున్న ఒక అసాధారణ నిర్ణయానికి ముడి పెడుతూ ఎల్లో ఛానల్స్, ఎల్లో బ్యాచ్ అంతా కలిపి పండుగే చేసుకుంటున్నారు. నిజంగా ఎన్నికలు జరిగి ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చేయని తెలిస్తే కలిగే ఆనందంగా ఇది కనిపిస్తోంది. జగన్ సీఎం పోస్ట్ ఊస్ట్ అని తమ్ముళ్ళు బాహాటంగానే అనేస్తున్నారు. ఇక టీడీపీ అనుకూల మీడియా ఛానల్స్ లో డిబేట్స్ పెట్టి మరీ జగన్ మాజీ సీఎం అని తమ్ముళ్ల చేత ఒకటికి పదిసార్లు అనిపిస్తూ తాను ఆత్మానందం పొందుతున్నాయి.

జగన్ ఇంటికేనట…

జగన్ చాలా పెద్ద నేరం చేశారు కాబట్టి ఆయన ఇక ఇంటికే అని మాజీ ఎంపీ సబ్బం హరి అంటున్నారు. ఆయన ఒక టీడీపీ అనుకూల ఛానల్ లో మాట్లాడుతూ జగన్ తప్పుడు సలహాలతో చేసిన తప్పుడు పని ఇది అంటున్నారు. ఆయన అలా చేసి ఉండకూడదు అని కూడా చెబుతున్నారు. జగన్ సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి మీద ఫిర్యాదు చేస్తూ లేఖ రాయడం ముమ్మాటికీ ఆయన కుర్చీకి ఎసరు పెట్టేదే అని కూడా తేల్చేస్తున్నారు. ఇక జగన్ మాజీ అవుతారు. ఆయన ప్లేస్ లో సతీమణి భారతి కానీ, తల్లి విజయమ్మ కానీ కొత్త సీఎం అవుతారని కూడా జోస్యం చెబుతున్నారు.

ఈయనదీ అదే పాట…..

ఇక మరో ఎంపీ ఉన్నారు. ఈయన వైసీపీ రెబెల్ ఎంపీ. ఈయన మాటలూ, పాటలూ అన్నీ కూడా టీడీపీ గొంతులో నుంచే వస్తాయని అంటారు. ఈయన అయితే జగన్ కచ్చితంగా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, అందువల్ల ఆయన దిగిపోతారని చెప్పేస్తున్నారు. జగన్ దిగిపోయాక ఆయన కుటుంబం నుంచే కొత్త సీఎం వస్తారని కూడా ఆయన అంటున్నారు. జగన్ కోర్టుల మీద దాడి చేయడం ద్వారా తన రాజకీయ భవితవ్యానికి తలుపులు మూసుకున్నారని కూడా ఆయన విశ్లేషిస్తున్నారు. తాను ఇప్పటికీ జగన్ అభిమానిని అంటూనే ఆయన పతనాన్ని కోరుతున్నారు ఈ ఎంపీ రాజుగారు.

లుకలుకలుట …..

ఇక వైసీపీలో లుకలుకలు స్టార్ట్ అయిపోయాయని కూడా అనుకూల మీడియా హోరేత్తించేస్తోంది. సీఎం పదవిని కుటుంబ సభ్యులకు ఇస్తే పార్టీలో ముసలం వస్తుందని అంటోంది. సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రేసులో ఉన్నారని కూడా ప్రచారం చేస్తోంది. మొత్తానికి ఏపీలో ఏదో జరిగిపోతోందని, ఎవరు సీఎం అయినా ఎక్కువ రోజులు వైసీపె అధికారంలో ఉండలేరని కూడా అంటోంది. మరి ఇవన్నీ వారి ఆత్మానందం కోసం అల్లుతున్న కధలా నిజంగా ఏపీలో పొలిటికల్ సీన్ అంత సీరియస్ గా ఉందా అన్నది చూడాలి మరి.

Tags:    

Similar News