జనంలోనే తేల్చుకుంటారా ?

ఏపీలో జగన్ తీసుకున్న నిర్ణయం అసాధారణమైనది అని అంతా అంటున్నారు. ఆయన దూకుడు కి హద్దులు లేవా అని కూడా విమర్శలు వచ్చాయి. ఏకంగా కొండను ఢీ [more]

Update: 2020-10-22 13:30 GMT

ఏపీలో జగన్ తీసుకున్న నిర్ణయం అసాధారణమైనది అని అంతా అంటున్నారు. ఆయన దూకుడు కి హద్దులు లేవా అని కూడా విమర్శలు వచ్చాయి. ఏకంగా కొండను ఢీ కొట్టినట్లుగా న్యాయ వ్యవస్థనే జగన్ సవాల్ చేస్తున్నారు అని కూడా విశ్లేషణలు ఉన్నాయి. అయితే జగన్ దూకుడుగా నిర్ణయం తీసుకున్నట్లుగా పైకి కనిపిస్తున్నా దీని వెనక చాలా పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు. అందుకే జగన్ ఇలా డేరింగ్ స్టెప్ వేశారని కూడా చర్చ సాగుతోంది. ఇంతకీ జగన్ మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే ప్రత్యర్ధులకు చెక్ పెట్టడమేనట.

అందుకేనా అలా…?

జగన్ ఆస్తుల కేసులో రోజు వారీ విచారణ ఇపుడు మొదలైంది. ఇది జోరుగానే సాగుతుంది. ఏడాదిలోగా ఈ తరహా కేసులను ముగించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయి. అంటే కచ్చితంగా ఏడాది సమయం మాత్రమే జగన్ కి ఉందన్న మాట. ఈ కేసుల్లో జగన్ కడిగిన ముత్యంలా బయటపడారు అని ఆయన పార్టీ వారు నమ్ముతున్నారు. కానీ ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరిగినా కూడా జగన్ కి ఇబ్బందులు తప్పవు. అంటే ఆయన మీద దోషి ముద్ర పడుతుంది. అపుడు ఆయన కచ్చితంగా అరెస్ట్ అవుతారు. అంటే సీఎం నుంచి మాజీకు మారుతారు అన్న మాట.

పై ఎత్తుతో ….

ఇపుడు జగన్ ఒక సీనియర్ మోస్ట్ న్యాయమూర్తినే సవాల్ చేశారు. దీని మీద కోర్టు ధిక్కరణ కేసు కనుక జగన్ మీద ఫైల్ చేస్తే అపుడు కూడా ఆయన చిక్కుల్లో పడుతారు. ఆయన అరెస్ట్ కి ఆ విధంగానూ చాన్స్ ఉంది. అదే సమయంలో పదవీగండమూ పొంచి ఉంటుంది. అంటే ఎలా చూసుకున్నా జగన్ కి కొత్త ఏడాదిలో సరికొత్త చిక్కులు తప్పవని అంటున్నారు. దాంతో జగన్ ఇపుడు ఏకంగా కొండకే వెంట్రుకను పెట్టి లాగే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. అంటే న్యాయ మూర్తుల నిష్పాక్షికత మీదనే ఆయన సందేహాలు లేవనెత్తుతున్నారు. ఎంత ఆయన మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నా కూడా ఆయన లేవనెత్తిన అంశాల మీద కూడా చర్చ అంతే జోరుగా సాగుతోంది. దాంతో అనుకోని మలుపులు తిరిగితే జగన్ మరో వైపు హీరో కూడా అయ్యే చాన్స్ ఉంది. దాంతోనే ఆయన చాలా రిస్క్ చేశారని అంటున్నారు.

అదే మేలు అంటూ …..

జగన్ సర్కార్ కి విధానపరమైన నిర్ణయాల అమలు విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకుని మరీ ఏపీలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలనుకుంటే వాటి మీద టీడీపీ నేతలు స్టేలు తెచ్చి అడ్డుకుంటున్నారు. దాంతో ఇలా చేతగాని పాలన చేస్తూ మిగిలిపోయే కంటే ఎదిరించి మొనగాడు కావాలని జగన్ భావిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు వ్యవస్థలను ఎలా మ్యానేజ్ చేస్తారో కూడా జనాలకు కళ్ళకు కట్టినట్లుగా చెప్పాలన్నది కూడా జగన్ తాపత్రయం. ఈ ప్రయత్నంలో అనుకోని పరిణామలు సంభవించి తాను మాజీ అయినా కూడా మళ్ళీ జనంలో నిలిచి గెలిచేలా జగన్ బలాన్ని సమకూర్చుకుంటున్నారు అంటున్నారు. మొత్తానికి జగన్ ఆడుతున్న ఈ రాజకీయ జూదం అంతా జనాన్ని నమ్ముకునే సాగుతోంది. మరి జగన్ ఈ ఇబ్బందులు దాటుకుని అయిదేళ్ళ సీఎంగా ఉంటారా లేక మధ్యలో ఎన్నికలు వస్తే మళ్లీ గెలిచి తొడగొడతారా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News