తుఫాన్ ముందు నిశ్శబ్దం… ఏం జరగనుంది.. ?

ఇపుడు ఏపీలో చోటు చేసుకున్న కొన్ని అసాధారణ పరిణామాల మీద అన్ని పార్టీలో అంతర్గత చర్చ సాగుతోంది. ఇక న్యాయ వర్గాల్లో అయితే ఇదే రకమైన పరిస్థితి [more]

Update: 2020-10-15 05:00 GMT

ఇపుడు ఏపీలో చోటు చేసుకున్న కొన్ని అసాధారణ పరిణామాల మీద అన్ని పార్టీలో అంతర్గత చర్చ సాగుతోంది. ఇక న్యాయ వర్గాల్లో అయితే ఇదే రకమైన పరిస్థితి ఉంది. మరో వైపు జాతీయ స్థాయిలో ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. న్యాయవాదులు అయితే దీన్ని గట్టిగా ఖండిస్తున్నారు. కొంతమంది జగన్ కి అనుకూలంగా మాట్లాడుతూంటే మరికొంత మంది కోర్టుల్లో పిటిషన్లు వేసి మరీ జగన్ మీద చర్యలకు డిమాండ్లు చేస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరగనుంది. ఇదే అందరిలోనూ చర్చ.

జగన్ కి యాంటీగా…?

జగన్ ఒక సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తికి వ్యతిరేకంగా లేఖ రాయడాన్ని న్యాయ వ్యవస్థ మీద దాడిగా ఢిల్లీ బార్ అసోసియేషన్ అభివర్ణిస్తోంది. దీన్ని తేలికగా వదిలేయవద్దు అంటోంది. జగన్ మీద కచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. మరో వైపు మొన్న నోయిడాకు చెందిన ఒక లాయర్ జగన్ మీద చర్యలు కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇపుడు మరో ఇద్దరు న్యాయవాదులు ఏకంగా జగన్ని సీఎం పదవి నుంచి దించేసి ఆయన మీద న్యాయ విచారణ చేపట్టాలని పిటిషన్లు దాఖలు చేశారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని కూడా కోరుతున్నారు. మరో వైపు ప్రశాంత్ భూషణ్ లాంటి వారు అయితే జగన్ కి అనుకూలంగా మాట్లాడుతున్నారు. న్యాయ సంస్కరణలకు మేధావులు కొందరు డిమాండ్ చేస్తున్నారు.

గుంభనంగా …?

ఇదిలా ఉంటే ఇంతటి సీరియస్ విషయం మీద రాజకీయ వర్గాల్లో మాత్రం పెద్దగా చర్చ బయట సాగడంలేదు. వైసీపీలో అయితే అంతా గుంభనంగా ఉంటున్నారు. వైసీపీ నేతలు ఎవరూ జగన్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కి రాసిన లేఖ మీద మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఏమీ జరగనట్లుగానే వైసీపీలో అంతా ఎవరి పని వారు చేసుకుంటున్నా మునుపటి జోష్ మాత్రం సీనియర్ నేతల్లో కూడా కనిపించడంలేదు. ట్వీట్లతో టీడీపీ అధినేత మీద నిత్యం రెచ్చిపోయే విజయసాయిరెడ్డి వంటి వారు కూడా కొంత తగ్గినట్లుగానే కనిపిస్తున్నారు. అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. అసలు ఏం జరుగుతుంది అన్నదే ఎవరికీ అంతు పట్టడంలేదులా ఉంది.

సంచలనాలేనా…?

ఇపుడు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ వద్ద ఏపీ సీఎం హోదాలో జగన్ రాసిన లేఖ ఉంది. దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సంచలనం అవుతుందనే అంటున్నారు. ఈ విషయంలో ఎవరూ బయటకు మాట్లాడకపోయినా రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్యన ఘర్షణగానే భావిస్తున్నారు. మరి దీనికి సరైన రీతిలో పరిష్కారం ఉంటుందా. మేధావులు మాత్రం ప్రజాస్వామ్య దేశంలో అవాంఛ‌నీయ పరిణామాలను తాము కోరుకోవడంలేదని అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News