జగన్ జాతకం మీద ప్రచారం ?

జగన్ వ్యక్తిగతంగా క్రైస్తవ మతాన్ని నమ్ముతారు. కానీ రాజకీయాల్లోకి వచ్చాక ఆయనకూ నమ్మకాలు పెరిగాయి. ఆయన ఎక్కువగా విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వామిని విశ్వసిస్తారు. ఆయన ఎలా [more]

Update: 2020-10-13 08:00 GMT

జగన్ వ్యక్తిగతంగా క్రైస్తవ మతాన్ని నమ్ముతారు. కానీ రాజకీయాల్లోకి వచ్చాక ఆయనకూ నమ్మకాలు పెరిగాయి. ఆయన ఎక్కువగా విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వామిని విశ్వసిస్తారు. ఆయన ఎలా చెబితే ఆలా చేస్తారు. స్వామి హిందూ ధార్మికుడు. ఆయన జాతకాలు చూసే అన్నీ చెబుతారు, కానీ ఇక్కడ చిత్రమేంటంటే జగన్ ఆయన్ని అంతకంటే గట్టిగా నమ్ముతారు. కాబట్టి ఇండైరెక్ట్ గా జగన్ కూడా జాతకాలను విశ్వసిస్తున్నట్లుగానే భావించాలి. ఇదంతా ఎందుకంటే ఒక ప్రచారం అయితే ఇపుడు జోరుగా సాగుతోంది. అదేంటి అంటే జాతకరిత్యా జగన్ కి ఇపుడు కొంచెం గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయని.

ముఖ్యమంత్రిగా అయ్యాక…?

జగన్ గత ఏడాది మంచి మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత తొలి ఆరు నెలలూ ఆయన పాలనారధానికి అడ్డు లేకుండా పోయింది. ఎపుడైతే మూడు రాజధానుల ప్రతిపాదనను ఆయన చేశారో నాటి నుంచే కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఆ నేపధ్యంలో ఆయన శాసన మండలి రద్దు దాకా వెళ్ళారు. ఇక ఇపుడు కోర్టులతోనూ ఢీ కొంటున్నారు. ఓ వైపు జగన్ రాజకీయంగా విపక్షాలను ఎదుర్కుంటున్నారు. మరో వైపు కరోనా లాంటి అంతర్జాతీయ సమస్య ముంగిట ఉండనే ఉంది. అది తగ్గినా దాని ప్రభావంతో ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పేసింది. నిజానికి ఏపీ తీవ్ర ఆర్ధిక సంక్షోభం మధ్యన చిక్కుకున్న త‌రువాత కరోనా వచ్చి మొత్తాన్ని ఇంకా తల్లకిందులు చేసిందని అంటారు.

అనూహ్యంగానా….?

ఇక జగన్ అయితే ఎక్కడా తగ్గడమే లేదు. అలా తన దూకుడు కొనసాగిస్తూ ముందుకుపోతున్నారు. ఆయన తన మూడు రాజధానుల పంతం నెరవేర్చుకోవడానికి ఆఖరుకు కోర్టుల మీద కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా సీనియర్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి మీద ఆరోపణలు చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు, తేడా వస్తే జగన్ పరిస్థితి ఏంటి అన్నది కూడా ఒక చర్చగా ఉంది. జగన్ అంటే ఇష్టపడే న్యాయవాదులు సైతం ఆయన ఎందుకిలా చేశారని చర్చించుకుంటున్నారు అంటే జగన్ తీసుకున్న మొండి నిర్ణయం ఏంటన్నది అర్ధమవుతుంది. ఇపుడు జగన్ పెద్ద చిక్కుల్లోనే పడుతున్నారా అన్న అనుమానాలూ ఆయన అభిమానులతో పాటు, పార్టీలో ఉన్న వారిలోనూ ఒక్కసారిగా పెరిగిపోతున్నాయట.

కొత్త ఏడాదిలోనే …?

ఇక జగన్ కి మరో నాలుగు నెలల పాటు జాతకపరంగా ఇబ్బందులు ఉంటాయని అంటున్నారు. అవి ఏ వైపు నుంచి అయినా రావచ్చు అని అంటున్నారు. వాటిని కనుక తట్టుకుని ఆయన ముందుకు సాగితే కొత్త ఏడాదిలో ఉపశమనం కలుగుతుంది అంటున్నారు. మరి జగన్ ఈ విషయంలో ఇపుడే దూకుడు ఎక్కువగా చూపిస్తున్నారు. మరి జాతకపరంగా చూస్తే నిదానంగా ఉండాల్సిన చోట ఆయన ఎందుకు ఇలా వేగం పెంచుతున్నారు అన్నది ఎవరికీ అర్ధం కావడం లేదుట. మొత్తానికి జగన్ కొండను ఢీ కొట్టేశారు. జాతకరిత్యా ఆయన పెను సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉందని కూడా అంటున్నారు. మరి ఆయన కనుక విజేతగా నిలిస్తే ఇక తిరుగు ఉండదని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News