జ‌గ‌న్ టీం సమూల ప్రక్షాళన..?

ఏపీ సీఎం జ‌గ‌న్ త‌న టీంను మొత్తంగా ప్రక్షాళ‌న చేయాల‌ని భావిస్తున్నారా ? ఇప్పుడున్న కేబినెట్‌లో స‌మూల మార్పుల దిశ‌గా జ‌గ‌న్ అడుగులు వేస్తున్నారా ? అంటే.. [more]

Update: 2020-10-18 15:30 GMT

ఏపీ సీఎం జ‌గ‌న్ త‌న టీంను మొత్తంగా ప్రక్షాళ‌న చేయాల‌ని భావిస్తున్నారా ? ఇప్పుడున్న కేబినెట్‌లో స‌మూల మార్పుల దిశ‌గా జ‌గ‌న్ అడుగులు వేస్తున్నారా ? అంటే.. ఔన‌నే అంటున్నాయి వైసీపీ వ‌ర్గాలు. త‌న కేబినెట్‌ను ఏర్పాటు చేసుకునే స‌మ‌యంలోనే ప్రస్తుతం మంత్రులుగా ప‌ద‌వులు పొందుతున్నవారు రెండున్నరేళ్ల త‌ర్వాత మార్పున‌కు రెడీగా ఉండాల‌ని అప్పట్లోనే స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏడాదిన్నర స‌మ‌యం అయిపోయింది. సో.. మ‌రో ఏడాదిలో ఇప్పుడున్న మంత్రుల‌ను మార్పు చేయ‌డం ఖాయం. ఈ నేప‌థ్యంలో ఎవ‌రి స్థానాలు క‌ద‌ల‌నున్నాయి ? ఏనాయ‌కులు ఇంటి ముఖం ప‌ట్టనున్నారు ? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

ఈ ఇద్దరిపైనా…..

ప్రస్తుతం ఉన్న వాతావ‌ర‌ణంలో ముగ్గురు మ‌హిళా మంత్రుల్లో హోం శాఖ మంత్రి సుచ‌రిత త‌ప్ప మిగిలిన ఇద్దరూ ఇంటి ముఖం ప‌ట్టే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి దూకుడు లేక‌పోగా.. సొంత ఇంటి నుంచి జ‌గ‌న్‌పై విమ‌ర్శలు వ‌చ్చినా మిన్న‌కున్నారు. తానేటి వ‌నిత‌.. టీడీపీకి కౌంట‌ర్లు ఇవ్వలేక‌పోతున్నారు. అసలు ఆమె మంత్రిగా ఉన్నారా ? అని సొంత పార్టీ నేత‌లే సందేహాలు వ్యక్తం చేస్తోన్న ప‌రిస్థితి. దీంతో ఈ ఇద్దరూ ఇంటి ముఖం ప‌ట్టడం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక‌, పురుష మంత్రుల విష‌యానికి వ‌స్తే.. ప్రస్తుతం తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న గుమ్మనూరు జ‌య‌రాం, మంత్రి నారాయ‌ణ స్వామిలకు ఉద్వాసన తప్పదని తెలుస్తోంది.

మార్పులు తథ్యమంటూ….

ఇక‌, మ‌రో వృద్ధ మంత్రి, ప‌శ్చిమ‌కు చెందిన శ్రీరంగ నాథ‌రాజుకు కూడా శ్రీముఖం త‌ప్పేలా లేద‌ని అంటున్నారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. జిల్లాల ప్రాతిప‌దికన కూడా మార్పులు త‌థ్యమ‌ని అంటున్నారు. ఈ క్రమంలో క‌డ‌ప జిల్లాలో వివాద ర‌హితుడే అయినా.. అంజాద్‌కు జిల్లా ప్రాతిప‌దిక‌న ప‌క్కన పెడ‌తారని అంటున్నారు. రెడ్డి సామాజిక వ‌ర్గంలో మ‌రో నేత‌కు అవ‌కాశం ఇవ్వాలి కాబ‌ట్టి.. నెల్లూరులో మేక‌పాటి గౌతం రెడ్డిని మార్చడం ఖాయంగా క‌నిపిస్తోంది. యాద‌వ సామాజిక వ‌ర్గంలోనూ మార్పు త‌ప్పద‌ని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న అనిల్‌కుమార్ యాద‌వ్ ప్లేస్‌లో పెన‌మ‌లూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థసార‌థి యాద‌వ్‌కు అవ‌కాశం ఇస్తార‌ని తెలుస్తోంది.

నాని విషయంలో…..

ఇక‌, కొడాలి నానిని మారుస్తారా? లేక కొన‌సాగిస్తారా? అనేది త‌ర్జన భ‌ర్జనగా ఉంద‌ని అంటున్నారు. ఇక‌, ప‌శ్చిమ గోదావ‌రి నుంచి శ్రీకాకుళం వ‌ర‌కు ఉన్న మంత్రుల్లో ఒక్క బొత్స‌కుమాత్రం ఛాన్స్ ఇచ్చి మిగిలిన వారిని మార్చడం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. శ్రీకాకుళం నుంచి స్పీక‌ర్ త‌మ్మినేనికి ఛాన్స్ ఉంటుంద‌నే వార్తలు వ‌స్తున్నాయి. ఇక‌, మ‌హిళ‌ల్లో శింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే ప‌ద్మకు అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. ఎస్సీ మంత్రుల విష‌యానికి వ‌స్తే.. కోరుముట్లకు అవ‌కాశం ఉంటుంద‌ని, ఆయ‌నను ఆదిమూల‌పు సురేష్ ప్లేస్‌లో మార్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. జ‌గ‌న్ కేబినెట్ పూర్తిగా ప్రక్షాళ‌న అయ్యే అవ‌కాశం మెండుగానే ఉంద‌ని చెబుతున్నారు మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

Tags:    

Similar News