బాబు కంటే జగన్ కు సమస్యలు తక్కువేనా?

గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు తలెత్తిన సమస్యలు ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి లేవు. కేవలం అమరావతి రాజధాని, ఆలయాలపై దాడులు, దళితులపై దాడులు వంటివి మాత్రమే జగన్ కు [more]

Update: 2020-10-09 02:00 GMT

గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు తలెత్తిన సమస్యలు ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి లేవు. కేవలం అమరావతి రాజధాని, ఆలయాలపై దాడులు, దళితులపై దాడులు వంటివి మాత్రమే జగన్ కు సమస్యగా మారాయి. ఇవి తాత్కాలిక సమస్యలే. అమరావతి రాజధాని అంశం ఒక ప్రాంతానికే పరిమితమయిన అంశంగా జగన్ భావిస్తున్నారు. మూడు రాజధానుల అంశం తనకు కలసి వస్తుందని భావిస్తున్నారు.

రైతుల సమస్య……

ఇక రైతుల సమస్యలపై కూడా పెద్దగా విపక్షాలు క్లిక్ కాలేదు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే అంశం, కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టంపై కేవలం కమ్యునిస్టులు మాత్రమే పోరాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేక వైఖరిని అవలంబించలేక టీడీపీ ఈ అంశంపై చప్పుడు చేయలేదు. ఇక శాంతిభద్రతల సమస్య, తమ పార్టీ నేతలపై అక్రమ కేసులపై మాత్రమే టీడీపీ వైసీపీపై పోరాడాల్సి వస్తోంది. కానీ ఇది ప్రజలకు సంబంధంలేని అంశం.

కాపు రిజర్వేషన్లపై…..

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాపు రిజర్వేషన్ల సమస్య తీవ్రంగా ఉండేది. ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో కాపు రిజర్వేషన్ల ఉద్యమం ఒక రేంజిలో ఉండేది. నిత్యం ఈ సమస్య చంద్రబాబుకు తలనొప్పిగా మారేది. తుని సంఘటన కూడా చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లలో కొంత కాపులకు ఇస్తున్నట్లు ప్రకటించి చంద్రబాబు చేతులు దులుపుకున్నారు.

కుండ బద్దలు కొట్టడంతో…

అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ల సమస్య లేదు. ఎందుకంటే జగన్ ముందుగానే కాపు రిజర్వేషన్ల అంశం తన పరిధిలో లేదని చెప్పేశారు. ఎన్నికల ప్రచారంలోనే జగన్ చెప్పడంతో ఇక ఆ విషయంలో ఉద్యమం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పైగా బీసీలకు, కాపులకు పెద్దయెత్తున పదవులను కట్టబెడుతున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అందుకే ముద్రగడ పద్మనాభం సయితం జగన్ పాలనలో ఈ సమన్యపై ఉద్యమం చేయడం వేస్ట్ అని కాడి వదిలేశారంటారు. మొత్తం మీద చంద్రబాబుకు ఉన్న ప్రధాన సమస్యలు జగన్ కు లేవనే చెప్పాలి.

Tags:    

Similar News