మింగుడు పడని జగన్.. కాలిపోతుందిక్కడ?

వైఎస్ జగన్ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారు? హామీలను వరసగా అమలు పరుస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఊబిలోకి నెడుతుందని [more]

Update: 2020-10-05 03:30 GMT

వైఎస్ జగన్ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారు? హామీలను వరసగా అమలు పరుస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఊబిలోకి నెడుతుందని విపక్షాలు చేస్తున్న విమర్శలను సయితం జగన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆయన మీడియాతో మాట్లాడరు. జరుగుతున్న విషయాలపై పెదవి విప్పరు. కానీ సంక్షేమ పథకాలను మాత్రం అమలు చేస్తూనే పోతున్నారు. ఇది విపక్షాలకు సయితం మింగుడు పడటం లేదు.

సంక్షేమ పథకాలను…..

ఒక పక్క సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటం, మరోవైపు తమ విమర్శలకు జగన్ నేరుగా స్పందించకపోవడం విపక్షాలకు తలనొప్పిగా మారాయనే చెప్పాలి. నిత్యం చంద్రబాబు జగన్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఒక అంశం కాదు అంతర్వేది నుంచి అమరావతి వరకూ ఆయన విమర్శిస్తూనే ఉన్నారు. లేఖలు కూడా రాస్తున్నారు. ఇక వామపక్ష పార్టీ నేత రామకృష్ణ అయితే రోజు కొక లేఖ రాస్తున్నారు. కానీ వేటికీ జగన్ నేరుగా స్పందించడం లేదు.

విపక్ష విమర్శలకు…..

గతంలో జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన విమర్శలన్నింటికీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నేరుగా సమాధానమిచ్చేవారు. కానీ జగన్ మాత్రం ఇప్పుడు మీడియా సమావేశం పెట్టే మూడు నెలలు దాటిపోయింది. అదీ కోవిడ్ సమయంలో మీడియా మీట్ పెట్టి మాట్లాడారు. తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో నేరుగానే జగన్ స్పందించారు. కానీ ఆ తర్వాత విపక్షాలు నిత్యం ఆరోపణలు చేస్తున్నా పెద్దగా పట్టించుకోనట్లే వ్యవహరిస్తున్నారు.

సమాధానం చెప్పకుండా….

విపక్షాలు చేస్తున్న విమర్శలు ఆయన చెవికి సోకడం లేదని కాదు. ప్రతి పత్రికను ఆయన ఉదయాన్నే క్షుణ్ణంగా చదువుతారు. కానీ వాటికి సమాధానం చెప్పే అవసరం లేదన్నది జగన్ అభిప్రాయంగా ఉంది. తిరుమల పర్యటనలో డిక్లరేషన్ విషయంలో గాని, దళితులపై దాడులు, ఆలయాలపై దాడులు జరిగినా జగన్ స్పందించలేదు. తన పని తాను చేసుకుని పోవడమే తప్ప దేనిపైనా రెస్పాండ్ కాకపోవడం విపక్షాలకు కాలుతుంది. జగన్ వరసగా ఒక్కొక్క హామీని అమలుపర్చుకుని పోతున్నారు.

Tags:    

Similar News