ఇక మర్చిపోయినట్లేనా? జరిగే పని కాదని తెలిసిందా?

పార్లమెంటు సమావేశాలు ముగిసినట్లే. ఈ సమావేశాల్లోనూ శాసనమండలి గురించి ప్రస్తావన రాలేదు. దీంతో శాసనమండలి కొనసాగుతున్నట్లే అనుకోవాల్సి ఉంటుంది. ఈ పార్లమెంటు సమావేశాల్లో శాసనమండలిపై ఒక నిర్ణయం [more]

Update: 2020-09-30 02:00 GMT

పార్లమెంటు సమావేశాలు ముగిసినట్లే. ఈ సమావేశాల్లోనూ శాసనమండలి గురించి ప్రస్తావన రాలేదు. దీంతో శాసనమండలి కొనసాగుతున్నట్లే అనుకోవాల్సి ఉంటుంది. ఈ పార్లమెంటు సమావేశాల్లో శాసనమండలిపై ఒక నిర్ణయం తీసుకుంటారని భావించారు. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే పార్లమెంటు సమావేశాలు ముగిశాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన కూడా సమావేశాలు ముగిసే సమయంలో చేయడంతో శాసనమండలి విషయాన్ని ఢిల్లీ పెద్దల వద్ద చర్చించలేదని తెలిసింది.

ఢిల్లీ పర్యటనలోనూ…..

ముఖ్మమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో అమిత్ షాను కలిశారు. అమిత్ షాను కలిస్తే దాదాపు మోదీతో మంతనాలు జరిపినట్లే. అయితే జగన్ ఈ పర్యటనలో శాసనమండలి విషయాన్ని అసలు ప్రస్తావించలేదని అంటున్నారు. శాసనమండలి విషయాన్ని జగన్ పూర్తిగా వదిలేసినట్లే కనపుడుతుందని వైసీపీ నేతలే చెబుతున్నారు. భవిష్యత్ లో శాసనమండలిలోనూ వైసీపీకే మెజారిటీ వస్తుండటంతో కేంద్రంపై వత్తిడి చేయవద్దని జగన్ నిర్ణయించుకున్నట్లు కనపడుతుంది.

రెండుసార్లు సమావేశాల్లో…..

నిజానికి జగన్ శాసనమండలి రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తుంది. శాసనమండలిని రద్దు చేసి కేంద్రానికి తీర్మానం పంపిన తర్వాత ఇప్పటికి పార్లమెంటు సమావేశాలు రెండు సార్లు జరిగాయి. ఈ రెండు సమావేశాల్లోనూ కేంద్రం శాసనమండలి విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దేశ వ్యాప్తంగా మండలి రద్దు, కొనసాగింపులపై డిమాండ్లు ఉండటంతో అన్ని ఒక్కసారి పరిశీలించాలని, దీనిపై కమిటీని నియమించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.

కొనసాగింపునకే…..

కేంద్రం నుంచి శాసనమండలి రద్దు ఇప్పట్లో జరిగే అవకాశం లేదని జగన్ కు సంకేతాలు అందాయంటున్నారు. అందుకే ఆయన వరసగా ఖాళీ అవుతున్న స్థానాలను భర్తీ చేస్తూ పోతున్నారు. ఇప్పటికి ముగ్గురు ఎమ్మెల్సీలకు జగన్ బీ ఫారం లు ఇచ్చారు. ఇక శాసనమండలి రద్దు అంశం ముగిసినట్లేనని జగన్ ఢిల్లీ పర్యటనతో మరింత స్పష్టత వచ్చిందని తెలుస్తోంది. మొత్తం మీద తమ బిల్లులు ఆమోదానికి అడ్డుకట్ట వేసిన శాసన మండలిని రద్దు చేసిన జగన్ దాని కొనసాగింపునకే మొగ్గు చూపుతున్నారు.

Tags:    

Similar News