క్లారిటీ కోసమేగా?

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు శీతాకాల సమావేశాల్లో ఒకరినొరకు ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. గత మూడు [more]

Update: 2019-12-09 00:30 GMT

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు శీతాకాల సమావేశాల్లో ఒకరినొరకు ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. గత మూడు నెలలుగా టీడీపీ, జనసేన పార్టీలు వైసీపీ సర్కార్ పై విరుచుకుపడుతున్నాయి. ప్రజా సమస్యలపై ఆందోళనకు దిగుతున్నాయి. ఇసుక, ఇంగ్లీష్ మీడియం, టీటీడీలో అన్యమత ప్రచారం, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల వంటి వాటిపై విపక్షాలు ప్రజల సమక్షంలో విమర్శలకు దిగుతున్నాయి.

పెదవి విప్పక పోవడంతో…..

అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత జగన్ ఇప్పటి వరకూ వేటిపై స్పందించలేదు. అప్పుడప్పుడు బహిరంగసభల్లో కొంత తన మనసులో మాట చెబుతున్నారు తప్పించి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వలేదు. ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో జగన్ ఏం చేయబోతుందీ పార్టీలోనే ఎవరికీ తెలియదంటారు. ఈ నేపథ్యంలో జగన్ నుంచి అమరావతిపై స్పష్టత తీసుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఖచ్చితంగా ప్రయత్నిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇటీవలే అమరావతిపైన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ను నిర్వహించిన చంద్రబాబు దీనిపై ఆందోళన కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

కీలక అంశాలపై…..

మరోవైపు ముఖ్యమంత్రి జగన్ కూడా టీడీపీకి ధీటుగా చెప్పేందుకు సిద్ధమయ్యారు. అమరావతి, పోలవరం వంటి కీలక అంశాలపై జగన్ నేరుగా స్పష్టత ఇచ్చే అవకాశముందంటున్నాయి పార్టీ వర్గాలు. మిగిలిన అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలను ఇప్పటికే ఖరారు చేశారు. వారు మాట్లాడాల్సిన అంశాలను కూడా జగన్ వివరించారు. ఎట్టిపరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీ చేస్తున్న బురద జల్లే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని జగన్ ఎమ్మెల్యేలను, మంత్రులను కోరారు. అంతేకాదు అంశాల వారీగా వారిని టీం లు గా డివైడ్ చేసి మరీ అసెంబ్లీలో టీడీపీపైకి వదలబోతున్నారు.

గైర్హాజరయితే…..

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో జగన్ పార్టీ అందరు ఎమ్మెల్యేలకు ఆదేశాలను జారీ చేసింది. ఏ ఒక్క ఎమ్మెల్యే శీతాకాల సమావేశాలకు గైర్హాజరు కాకూడదని, అర్జంట్ పని ఉంటేనే అనుమతి తీసుకుని వెళ్లాలని వైసీపీ ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో సభ్యుల హాజరీ తక్కువ కాకుండా చూడాలని ఇప్పటికే చీఫ్ విప్ ను జగన్ ఆదేశించినట్లు చెబుతున్నారు. ఈ సమావేశాలను జగన్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. నేడు బీఏసీ సమావేశంలో చర్చించే అంశాలపై క్లారిటీ రానుంది. మొత్తం 20 అంశాలపై ప్రభుత్వం చర్చిచేందుకు సిద్ధంగా ఉందని చెబుతున్నారు. సీఎం ఇంటి ఖర్చు, ఆర్టీసీ ఛార్జీల పెంపుదలపై టీడీపీ ప్రధానంగా చర్చకు పట్టుబట్టే అవకాశముంద.

Tags:    

Similar News