సంతకం పెడతారా? లేదా? వివాదానికి ఎలా తెరదించుతారో?

ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి జగన్ తిరుమల వెళ్లనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సుందరకాండ పారాయణంలోనూ జగన్ పాల్గొననున్నారు. అయితే జగన్ [more]

Update: 2020-09-22 08:00 GMT

ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి జగన్ తిరుమల వెళ్లనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సుందరకాండ పారాయణంలోనూ జగన్ పాల్గొననున్నారు. అయితే జగన్ తిరుమలలో డిక్లరేషన్ ఇస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. మంత్రి కొడాలి నాని వంటి వారు అయితే ఒక అడుగు ముందుకేసి డిక్లరేషన్ పై చర్చ జరగాలన్నారు.

హిందూయేతరులు ఎవరు….

తిరుమల శ్రీవారిని అన్యమతస్థులు ఎవరు దర్శించినా డిక్లరేషన్ ఇవ్వడం సంప్రదాయంగా వస్తుంది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తిరుమలను సందర్శించినప్పుడు డిక్లరేషన్ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా విపక్షాలు గుర్తు చేస్తున్నాయి. వైసీపీ నేతలు మాత్రం గతంలో సోనియా గాంధీ, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు డిక్లరేషన్ లు ఇవ్వలేదన్న విషయాన్ని పదే పదే చెబుతున్నాయి. గత ఏడాది స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు కూడా జగన్ డిక్లరేషన్ ఇవ్వలేదు.

గతంలో జగన్ పర్యటించినప్పుడు….

ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు కూడా వైఎస్ జగన్ తిరుమల సందర్శించారు. తిరునామం కూడా పెట్టుకున్నారు. అప్పుడు కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు. కానీ విపక్షాలకు జగన్ తిరుమల పర్యటన రాజకీయంగా కలసి వచ్చింది. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న హిందూ దేవాలయాలపై జరుగుతున్న సంఘటనలకు కూడా దీనికి తోడయ్యాయి. జగన్ క్రిస్టియన్ మతం తీసుకోవడంతో ఆయనను అన్యమతస్థుడిగానే భావించాల్సి ఉంటుందన్నారు.

మత రాజకీయాలు చేస్తున్నారంటూ….

గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే జగన్ తిరుమలను సందర్శించినప్పుడు పట్టించుకోని ఆ పార్టీ ఇప్పుడు మాత్రం దీనిని రాజకీయం చేస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ ఒక మతానికి చెందిన వాడిగా ముద్రవేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందంటున్నారు. బీజేపీ కూడా డిక్లరేషన్ ను జగన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తుంది. మొత్తం మీద జగన్ తిరుమల పర్యటన వివాదంగా మారింది. మరి ఈ వివాదం నుంచి జగన్ ఎలా బయటపడతారో చూడాలి.

Tags:    

Similar News