వైఎస్ టచ్ చేయలేక పోయారు కానీ….. జగన్ ?

టీడీపీ అంటేనే అందరికీ గుర్తుకువచ్చేది బీసీల పార్టీ అని. నిజానికి ఆ సైకిల్ ఎక్కిన బీసీలు ఎంతో మంది అసెంబ్లీ గేటు దాటి లోపలికి వెళ్ళి అధికార [more]

Update: 2020-09-27 02:00 GMT

టీడీపీ అంటేనే అందరికీ గుర్తుకువచ్చేది బీసీల పార్టీ అని. నిజానికి ఆ సైకిల్ ఎక్కిన బీసీలు ఎంతో మంది అసెంబ్లీ గేటు దాటి లోపలికి వెళ్ళి అధికార దర్జా చూపించారు. వెనకబడిన వారిని ఎమ్మెల్యేలను చేసిన ఘనతను ఎన్టీయార్ దక్కించుకున్నారు. అంతే కాదు, మంత్రులుగా, స్పీకర్లుగా ఇతర ముఖ్య బాధ్యతలు చేపట్టి టీడీపీని తమ సొంత పార్టీగా మార్చుకున్నారు. టీడీపీని బీసీలను వేరు చేసే సాహసం ఇంతదాకా ఎవరూ చేయలేకపోయారు. వైఎస్సార్ మంచి రాజకీయ వ్యూహకర్త అని అంటారు. ఆయన కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని దగ్గర చేసుకుని రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు తప్ప టీడీపీ బీసీ కోటను కనీసం టచ్ చేయలేకపోయారు.

అది అద్భుతమే……..?

ఇక జగన్ రాజకీయాల్లోకి వచ్చాక కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని ఆసాంతం పట్టేశారు. అంతే కాదు, తెలుగుదేశం పార్టీకి కూడా కన్నం పెట్టి బీసీలను టోకు మొత్తంగా తన వెనకకు తెచ్చేసుకున్నారు. దాంతోనే ఆయనకు అద్భుతమైన విజయం 2019 ఎన్నికల్లో దక్కింది. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ నుంచి బీసీ ఓట్లు షిఫ్టింగ్ అంతా తాత్కాలికం అని చంద్రబాబు చేసిన పొరపాట్లకు గుస్సా అయి వారంతా ఒకసారి జగన్ కి ఓటేశారని కూడా రాజకీయ విశ్లేషణలు వినిపించాయి. అయితే అధికారంలోకివ్ వచ్చిన జగన్ తెలివిగా బీసీల ఓట్లను మొత్తం సాలిడ్ చేసుకుని వైసీపీని పటిష్టం చేయడానికి ఎన్నో రకాలైన పధకాలను అమలుచేస్తూ వచ్చారు. వాటి ఫలితాలు ఇపుడు వస్తున్నాయి.

బీసీ ఎమ్మెల్యే అలా….

జగన్ పార్టీకి ఇప్పటిదాకా మద్దతు ఇచ్చిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అగ్ర వర్ణాల వారే. వంశీ, కరణం బలరాం కమ్మ సామాజికవర్గానికి చెందినవారు కాగా గుంటూరు జిల్లా నుంచి గెలిచిన మద్దాల గిరి వైశ్య సామాజిక వర్గం. అయితే బాబుకు దీని వల్ల కొంత ఇబ్బంది అయినా బీసీలు తన వెంట ఉన్నారు అన్న సంతృప్తి ఉండేది. కానీ దాన్ని రివర్స్ చేస్తూ బలమైన బీసీ ఎమ్మెల్యే ఒక్కసారిగా వైసీపీలోకి జంప్ చేయడం మాత్రం టీడీపీకే కాదు, బాబుకు కూడా షాకింగ్ పరిణామమే. బీసీలకు పెట్టని కోటలా ఉన్న ఉత్తరాంధ్ర నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ బీసీల్లో పట్టున్న నేత. ఆయన్ని రాష్ట్ర స్థాయిలో బీసీ నేతగా ప్రమోట్ చేయాలని బాబు గట్టిగా డిసైడ్ అయిన వేళ వాసుపల్లి ఇలా గోడ దూకేయడం ద్వారా బీసీలు ఎటో చెప్పకనే చెప్పేశారు అంటున్నారు.

ఆ ట్యాగ్ పోయిందిగా….

ఇక టీడీపీ అంటే బీసీల పార్టీ అన్న ట్యాగ్ ఆ పార్టీకి పోయినట్లేనని అంటున్నారు. బీసీలు మా ఆస్తి అని చెప్పుకునే సాహసం ఇకపైన చంద్రబాబు చేసినా అది కుదిరే వ్యవహారం కాదని వాసుపల్లి ఎపిసోడ్ తేల్చేసింది. ఇక వాసుపల్లి వంటి వారు జగన్ వైపు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. బాబు బీసీలను వాడుకునే రకమని, పదవులు మాత్రం తన వారికి ఇచ్చుకుంటారని బీసీలు మనోవేదన చెందుతున్నారు. ఇక జగ‌న్ తొలిసారి గెలిచిన బీసీ ఎమ్మెల్యే, వాసుపల్లి సామాజికవర్గానికి చెందిన సీదరి అప్పలరాజుకు మంత్రి పదవి ఇచ్చారు. మరి రెండు సార్లు గెలిచి టీడీపీలో సీనియర్ గా ఉన్నా కూడా వాసుపల్లికి దక్కిందేంటి అన్న చర్చ కూడా ఉంది. ఇదే ఆవేదన మరింతమంది బీసీ నేతల్లో కూడా ఉంది. మొత్తానికి బాబు బీసీల కోటను కూల్చేందుకు జగన్ పక్కా ప్లాన్ తో రెడీ అయిపోయారని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి.

Tags:    

Similar News