స్టామినాకు పరీక్ష….మెప్పించగలిగారా?

వైఎస్ జగన్ తాను గత పదిహేను నెలల నుంచి చేస్తున్న సంక్షేమ కార్యక్రమలపైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో ఉప ఎన్నికను ఎవరూ ఊహించలేదు. [more]

Update: 2020-09-25 02:00 GMT

వైఎస్ జగన్ తాను గత పదిహేను నెలల నుంచి చేస్తున్న సంక్షేమ కార్యక్రమలపైనే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో ఉప ఎన్నికను ఎవరూ ఊహించలేదు. జగన్ కూడా తాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షేమ కార్యక్రమాలపైనే దృష్టి పెట్టారు. ప్రజలకు తాను ఎన్నికల మ్యానిఫేస్టో ఇచ్చిన హామీలను అమలుపర్చేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. దాదాపు 90 శాతం మ్యానిఫేస్టోలో ఉన్న హామీలను జగన్ నెరవేర్చగలిగారు.

మాట తప్పనని….

తాను ఇచ్చిన మాటను తప్పనని జగన్ పదిహేను నెలల్లో నిరూపించుకోగలిగారు. జనాలను మెప్పించగలిగారు. దాదాపు పదుల సంఖ్యలో పథకాలను గ్రౌండ్ చేయగలిగారు. పథకాలన్నీ పాతవేనని, పేర్లు మార్చి అమలు చేస్తున్నారని విపక్ష నేతలు విమర్శించినా ప్రజలు పట్టించుకోరు. ఎందుకంటే వారికి ఏదో ఒక పథకం రూపంలో తమకు లబ్ది చేకూరుతుంది. ముఖ్యంగా కరోనా సమయంలోనూ ఏమాత్రం వెనకడుగు వేయకుండా పథకాలను అమలు చేయడం జగన్ కు ప్లస్ అయిందనే చెప్పాలి. జనాల్లో జగన్ ఇమేజ్ మరింత పెరిగిందని చెప్పక తప్పదు.

కోట్ల మందికి లబ్ది….

దాదాపు 3.56 కోట్ల మందికి సుమారు 65 వేల కోట్ల రూపాయల నిధులను ఈ పదిహేను నెలల్లో వివిధ పథకాల ద్వారా జగన్ అందించగలిగారు. ఇది ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయగలిగారు. ఇక కరోనా వైరస్ ను కూడా ఆరోగ్య శ్రీ లో చేర్చడంతో వేల సంఖ్యలో ప్రజలు లబ్దిపొందారు. ఇలా జగన్ జనం మెచ్చే కార్యక్రమాలను ఈ పదిహేను నెలల్లో చేపట్టడంతో ఉప ఎన్నికలో విజయం ఖాయమన్న ధీమాలో ఉన్నారు.

ఫలితాలను బట్టి……

నిజానికి ఉప ఎన్నిక రావాలని ఎవరూ కోరుకోకున్నా, జగన్ అందించిన సంక్షేమ పథకాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ వివిధ సంక్షేమ పథకాలను పొందిన వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారంతా ఇప్పుడు జగన్ కు జై కొడతారా? స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఉప ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి జగన్ సంక్షేమ పథకాల స్టామినా ఏంటో తెలిసిపోతుంది.

Tags:    

Similar News