జగన్ గుండెల నిండా అదేనట.. అందుకే?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఒక ధైర్యం ఉంది. విపక్షాలు తనపై ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు నమ్మరని. అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబును సయితం విశ్వసించరని. [more]

Update: 2020-09-20 15:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఒక ధైర్యం ఉంది. విపక్షాలు తనపై ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు నమ్మరని. అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబును సయితం విశ్వసించరని. అందుకు కారణాలు కూడా జగన్ అత్యంత సన్నిహితుల వద్ద చెబుతున్నారట. రాజధాని అమరావతి అంశం పెద్దగా పనిచేయదు. కేవలం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలకే అది పరిమితమవుతుంది. సుమారు ఐదు నుంచి పది నియోజకవర్గాల్లోనే రాజధాని అమరావతి అంశం ప్రభావం చూపుతుందని జగన్ గట్టిగా నమ్ముతున్నారు.

కేవలం కొన్ని నియోజకవర్గాల్లోనే…..

ఆ నియోజవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జగన్ త్వరలోనే ఎమ్మెల్యేలతో చెప్పనున్నట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతి అంశంలో వెనక్కు తగ్గే ప్రసక్తి లేదని కూడా జగన్ అంటున్నారు. ఇక ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రాజధాని అమరావతి అంశం తమకే పూర్తి అనుకూలంగా ఉంటుందని కూడా చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మొన్నటి ఎన్నికల్లో కంటే ఆ రెండు ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు వస్తాయని కూడా జగన్ నమ్మకంగా తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారట.

బాబును విశ్వసించబోరని…..

ఇక టీడీపీ అధినేత చంద్రబాబును కూడా ప్రజలు విశ్వసించబోరట. అందుకు ఆయన గతంలో తీసుకున్న నిర్ణయాలే కారణమట. జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాది సమయంలోనే ఇచ్చిన హామీలన్నీ అమలు పర్చారు. దాదాపు మూడున్నర కోట్ల మందికి వివిధ పథకాల ద్వారా లబ్ది చేకూరింది. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాలు కూడా ప్రజల్లోకి బాగా వెళ్లాయని తన వద్దకు వచ్చిన నివేదికలను జగన్ చూపుతున్నారట. అందువల్ల భయమేదీ లేదని గోఅహెడ్ అని నేతలకు జగన్ చెబుతున్నారని సమాచారం.

కేసులపై నో సింపతీ…..

దీంతో పాటు టీడీపీ నేతలపై పెడుతున్న కేసుల విషయంలోనూ కలవర పడాల్సిన అవసరం లేదని జగన్ అభిప్రాయపడుతున్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, జేసీ ప్రభాకర్ రెడ్డిల అరెస్ట్ ల విషయంలో ఆ సామాజిక వర్గం ప్రజలు కూడా సానుభూతి చూపడం లేదని ఇంటలిజెన్స్ నివేదిక ద్వారా తెలియడంతో ఆ విషయాన్ని కూడా జగన్ సన్నిహితుల వద్ద పంచుకున్నారట. ఇప్పుడు వైసీపీలో ఇదే హాట్ టాపిక్ అయింది. మరి నాలుగేళ్ల సమయం ముందే జగన్ అన్ని రకాలుగా నివేదికలు తెప్పించుకోవడం చర్చనీయాంశమైంది. మొత్తం మీద చంద్రబాబుతో ఒరిగేది లేదని, భయపడాల్సిందేమీ లేదని జగన్ నొక్కి మరీ చెబుతుండటం విశేషం.

Tags:    

Similar News