ఆ జిల్లాపై జగన్ నజర్…పట్టుకోల్పోతున్నామని గ్రహించి?

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలను చేపట్టారు. కడప జిల్లా జగన్ సొంత జిల్లా. కడప జిల్లా తర్వాత ప్రకాశం జిల్లాను సొంత జిల్లాగా భావించవచ్చు. ఎందుకంటే అక్కడ [more]

Update: 2020-09-20 06:30 GMT

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలను చేపట్టారు. కడప జిల్లా జగన్ సొంత జిల్లా. కడప జిల్లా తర్వాత ప్రకాశం జిల్లాను సొంత జిల్లాగా భావించవచ్చు. ఎందుకంటే అక్కడ జగన్ రక్తసంబంధీకులు అక్కడ పెత్తనం చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ జగన్ సమీప బంధువులు కావడంతో వైసీపీలో సహజంగా వారి ఆధిపత్యమే కొనసాగుతుంది. కానీ ఇద్దరి మధ్య విభేదాలతో పార్టీ జిల్లాలో భ్రష్టుపట్టిపోతోంది. దీనికి చెక్ పెట్టేందుకు జగన్ సిద్ధమయినట్లు తెలుస్తోంది.

ఇంటలిజెన్స్ నివేదిక ద్వారా…..

జిల్లాలో నియోజకవర్గాల వారీగా జగన్ ఇంటలిజెన్స్ నివేదికలను తెప్పించుకున్నట్లు సమాచారం. త్వరలోనే జగన్ స్వయంగా ప్రకాశం పంచాయతీని చేయాలని నిర్ణయించారట. ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ ఎనిమిది నియోజకవర్గాల్లో విజయం సాధించింది. నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించింది. ఇందులో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీ సానుభూతిపరుడిగా మారిపోయారు. ఇక మూడు నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు.

బలమైన నాయకత్వం కోసం….

చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ కు, కరణం బలరాంకు పొసగడం లేదు. వీరిద్దరి మధ్య వివాదాన్ని తెగ్గొట్టేందుకు జగన్ స్వయంగా పూనుకున్నట్లు తెలుస్తోంది. అలాగే అద్దంకి నియోజవర్గంలో బలమైన నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారు. గొట్టిపాటి రవికుమార్ ను ఢీకొట్టే నేతను ఇక్కడ దించనున్నారు. కరణం వెంకటేష‌ కు పూర్తి స్థాయిలో పార్టీ పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నారు. ఇక పర్చూరులోనూ ఏలూరి సాంబశివరావు ను ఎదుర్కొనేందుకు బలమైన నేత కోసం అన్వేషిస్తున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో రావి రామనాధంను నియమించారు. అయినా పార్టీ ఇక్కడ పుంజుకునే పరిస్థితి లేదని ఇంటలిజెన్స్ నివేదిక ద్వారా తెలిసింది.

క్యాడర్ ను విస్మరిస్తూ…..

ఇక జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ క్యాడర్ ను పక్కన పెట్టేసి నట్లు జగన్ కు తెలిసింది. క్యాడర్ తో పాటు సోషల్ మీడియా కార్యకర్తలను కూడా వీరు బేఖాతరు చేస్తుననారన్న సమచారంతో జిల్లా ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్ పీకేందుకు సిద్ధమయినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రకాశం జిల్లాలో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారని చెబుతున్నారు. త్వరలోనే ప్రకాశం జిల్లా వైసీపీలో పెనుమార్పులు జరిగే అవకాశముందని తెలుస్తోంది.

Tags:    

Similar News