జగన్ మళ్లీ జై అంటున్నారే?

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీకి అండదండగా ఉంటున్నారు. ప్రతి విషయంలోనూ ఎన్డీఏను జగన్ సమర్థిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే [more]

Update: 2020-09-13 03:30 GMT

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీకి అండదండగా ఉంటున్నారు. ప్రతి విషయంలోనూ ఎన్డీఏను జగన్ సమర్థిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము ఎన్డీఏకు మద్దతిస్తున్నామని జగన్ చెబుతున్నప్పటికీ, ప్రస్తుతం తనకు రాష్ట్రంలోఉన్న అవసరాలు కూడా ఆయనను మోదీకి జై కొట్టేలా చేస్తున్నాయి. మూడు రాజధానులు, శాసనమండలి రద్దు వంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం మద్దతు అవసరం.

సహకారం కావాలంటే…?

అలాగే పోలవరం పూర్తి కావాలన్నా, రాయలసీమ ఎత్తిపోతల పథకం వంటివి సాకారం కావాలన్నా కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం అందుకే జగన్ తొలి నుంచి బీజేపీకి మద్దతిస్తూ వస్తున్నారు. గతంలో రాష్ట్ర పతి రామ్ నాధ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎన్నిక విషయంలో బేషరతుగా జగన్ మద్దతిచ్చారు. ఇక రాజ్యసభలో పెట్టే ప్రతి బిల్లుకూ జగన్ బహిరంగంగానే మద్దతు ప్రకటిస్తున్నారు.

నితీష్ ఫోన్ తో…..

తాజాగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరగబోతుంది. ఎన్డీఏ అభ్యర్థిగా జేడీయూ నేత హరివంశ్ నారాయణసింగ్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. దీంతో బీహార్ సీఎం నితీష్ కుమార్ నేరుగా జగన్ కు ఫోన్ చేసి మద్దతు కోరారు. అయితే దీనిపట్ల జగన్ సానుకూలంగా స్పందించారంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి జగన్ మద్దతిచ్చే అవకాశాలే లేవు. అందుకే జేడీయూ అభ్యర్థికే మద్దతివ్వాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

వేరే ఆప్షన్ లేదు…..

ఈ నెల 14వ తేదీన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో జగన్ కు వేరే ఆప్షన్ లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అన్ని విషయాల్లో అందాలంటే సానుకూలంగా వెళ్లడమే జగన్ ముందున్న మార్గం. రాజ్యసభలో ప్రస్తుతం వైసీపీకి ఆరుగురు సభ్యుల బలం ఉంది. దీంతో జగన్ నిర్ణయం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ఏమీ అవసరం లేదు. ఆయన బీజేపీ వైపే మొగ్గు చూపుతారు.

Tags:    

Similar News