ఎవరిది వినాలి? ఎవరిని నమ్మాలి?

ఏ స‌ర్కారుకైనా.. ప్రజ‌ల నుంచి ఆమోదం ఖ‌చ్చితంగా రావాల్సిన కీల‌క‌మైన అంశం. ఏ విష‌యంలో అయినా కూడా ప్రజ‌ల ఆమోదం త‌ప్పనిస‌రి. అదే స‌మ‌యంలో విప‌క్షాలు చేసే [more]

Update: 2020-09-19 05:00 GMT

ఏ స‌ర్కారుకైనా.. ప్రజ‌ల నుంచి ఆమోదం ఖ‌చ్చితంగా రావాల్సిన కీల‌క‌మైన అంశం. ఏ విష‌యంలో అయినా కూడా ప్రజ‌ల ఆమోదం త‌ప్పనిస‌రి. అదే స‌మ‌యంలో విప‌క్షాలు చేసే రాద్ధాంతాల‌ను తిప్పికొట్టాల్సిన ప్రయ‌త్నం కూడా ప్రభుత్వాలు స‌హ‌జంగానే చేస్తాయి. ప్రభుత్వ నిర్ణయాల‌పై, కార్యక్ర‌మాలపై స‌హ‌జంగానే ప్రతిప‌క్షాలు విమ‌ర్శలు చేస్తాయి. కానీ.. ఈ సంద‌ర్భంలో ఏది ప్రామాణికం.? ప్రభుత్వం చేస్తున్న ప‌నిని ఖ‌చ్చితంగా స‌మ‌ర్ధించుకుంటుంది. కాబ‌ట్టి.. ప్రభుత్వ వాద‌న బాగానే ఉంద‌ని అనిపిస్తుంది.

సొంత పార్టీలోనే….

ఇక‌, ప్రతి ప‌క్షంగా ఉన్న పార్టీ ప్రతి ప‌నినీ విమ‌ర్శిస్తుంది. సో.. అది కూడా క‌రెక్టే అనిపిస్తుంది. మ‌రి ఈ సంద‌ర్భంలో ఎవ‌రు చెప్పేది వినాలి ? ఎవ‌రు చెప్పేది న‌మ్మాలి ? అనేది ఎప్పుడూ త‌ర్జన భ‌ర్జన సాగే విష‌య‌మే. తాజాగా జ‌గ‌న్ స‌ర్కారు రైతులు వాడే విద్యుత్‌కు మీట‌ర్లు పెట్టాల‌నే విష‌యాన్ని తెర‌మీదికి తెచ్చింది. దీనిని చంద్రబాబు ప్రభుత్వం త‌ప్పుప‌డుతోంది. ఇది రైతుల పాలిట ఉరితాడేన‌ని, మీట‌ర్లు ఎందుక‌ని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈ విష‌యంలో ఆయ‌న‌కు ఎవ‌రు క‌లిసి వ‌చ్చారు ? ఎవ‌రు క‌లిసి రాలేదు ? అనే విష‌యాన్ని పక్కన పెడితే.. సొంత పార్టీలోనే ఈ విష‌యంపై తేడాలు స్పష్టంగా క‌నిపించాయి.

మీటర్లు మంచిదేనంటూ….

దీనికి కార‌ణం.. మీట‌ర్లు మంచిదేన‌ని కొంద‌రు మేధావులు చెప్పడ‌మే…! నిజానికి ఈ విష‌యంలో ప్రభుత్వం చెబుతున్నదేంటి ? రైతులు ఎంత క‌రెంటు వాడినా.. వారి త‌ర‌ఫున బిల్లులు మొత్తంగా తాము చెల్లిస్తామ‌ని, ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి సందేహాలు అవ‌స‌రం లేద‌ని తెలుపుతోంది.సో.. ఈ విష‌యంలో రైతులు ప్రభుత్వంపై భ‌రోసా ఉంచారు. కాబ‌ట్టి. వారి సైడు ఓకే! మ‌రి ప్రతిప‌క్షాల మాట విష‌యానికి వ‌స్తే.. ఇక్కడే మేధావులు చెబుతున్న దానిని బ‌ట్టి.. ఎన‌ర్జీ ఆడిటింగ్ కోసం ఈ విధానం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అంటున్నారు.

రైతుల మీద భారం పడితే…?

అంటే.. ఎక్కడ ఎక్కువ‌గా విద్యుత్ వినియోగం అవుతోంది. ఎక్కడ వృథా అవుతోందనే విష‌యాలు స్పష్టంగా తెలుస్తాయ‌ని అంటున్నారు. మొత్తానికి బాబు విష‌యాన్ని ప‌క్కన పెడితే.. జ‌గ‌న్ వ్యూహానికి.. మేధావుల నుంచి మంచి మార్కులు ప‌డుతున్నాయ‌నేది వాస్తవం. అయితే ఇక్కడే జ‌గ‌న్ ముందు కొన్ని స‌వాళ్లు కూడా ఎదురు కానున్నాయి. చాలా మంది రైతుల్లో ఒక‌సారి మీట‌ర్ పెడితే త‌ర్వాత అయినా ప్రభుత్వం త‌ప్పించుకుంటే ఆ భారం త‌మ‌మీదే ప‌డుతుంద‌ని ఆందోళ‌న‌తో ఉన్నారు. అదే జ‌రిగితే 2003 – 04 కాలంలో చంద్రబాబు రైతుల‌పై భారీగా మోపిన విద్యుత్ చార్జీల‌తో తీవ్రమైన వ్యతిరేక‌త రావ‌డంతో పాటు ఘోరంగా ఓడిపోయారు. జ‌గ‌న్ అలాంటి ప్రమాదం కొని తెచ్చుకోకుండా రైతుల‌కు ఇచ్చిన మాట‌పై నిల‌బ‌డాలి.

Tags:    

Similar News