జగన్ ఓపెన్ ఆఫర్…సోనియా ఖుషీయేనా..?

జగన్.. ఈ మూడు అక్షరాల పేరు వినడానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పదేళ్ల క్రితం అసలు ఇష్టపడేవారు కాదంటారు. ఆమెకు జగన్ మీద అంతలా వ్యతిరేకత పెంచిన [more]

Update: 2020-09-11 15:30 GMT

జగన్.. ఈ మూడు అక్షరాల పేరు వినడానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పదేళ్ల క్రితం అసలు ఇష్టపడేవారు కాదంటారు. ఆమెకు జగన్ మీద అంతలా వ్యతిరేకత పెంచిన కాంగ్రెస్ నాయకులు ఇపుడు ఏపీ, తెలంగాణాలో నామరూపాలు లేకుండా ఉన్నారు. అది వేరే సంగతి కానీ జగన్ భవిష్యత్తును ఊహించడంలో సోనియా తప్పులో కాలు వేశారన్నది నిజం. ఇక సోనియా కూడా బేసికల్ గా పొలీటిషియన్ కాకపోవడం వల్లనే ఇగోలతో ఇంతదాకా కధను తెచ్చుకున్నారని అంటారు. సరే కాంగ్రెస్ కి జగన్ ఆమడ దూరం అన్నది ఇప్పటిదాకా అంతా అనుకుంటున్న విషయం. అయితే జగన్ మనసులో కాంగ్రెస్ మీద ఏ రకమైన అభిప్రాయం ఉంది అంటే అది అతి కొద్ది సందర్భాల్లో చూచాయగా బయటపడింది.

అప్పట్లో అలా….

జగన్ పాదయత్రలో ఉండగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కాంగ్రెస్ ని ద్వేషించినట్లుగా ఎక్కడా బయటపడలేదు. అయితే ఆయన తనకు తానుగా కాంగ్రెస్ విషయం ప్రస్తావించలేదన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ కేంద్రంలో అతి పెద్ద పార్టీగా వస్తే మీరు మద్దతు ఇస్తారా అని మీడియా అడిగిన దానికి జగన్ బదులిస్తూ తనకు ఏ పార్టీ అన్నది సంబంధం లేదని, ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని నాడు చేప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే తాము మద్దతు ఇస్తామని ఇండైరెక్ట్ గానే జవాబు ఇచ్చారు, ఇపుడు దాన్ని మరో మారు జగన్ కంటిన్యూ చేశారు.

ఇందులో నిజముందా …?

ఇపుడు జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రత్యేక హోదాని ఇవ్వలేదు, ఇస్తుందన్న ఆశ కూడా లేదు, కానీ జగన్ మాత్రం తాను అడుగుతూనే ఉన్నారు. ఆయన మోడీకి 2019 ఎన్నికల్లో పూర్తి మెజారిటీ రాదనుకున్నారు, ఇపుడు 2024 ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు లోపు వస్తాయని అనుకుంటున్నారులా ఉంది. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ కాంగ్రెస్, బీజేపీల మీద మరో మారు తన భావాలను పంచుకున్నారు. అయితే ఆయన ఈసారి కూడా కాంగ్రెస్ పేరు ఎత్తకపోవడం గమనార్హం. కానీ తనకు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇబ్బందేమీ లేదని జగన్ క్లారిటీగా చెప్పేశారు. అప్పటి పరిస్థితుల బట్టి తన మద్దతు ఎవరికైనా ఉంటుందని జగన్ కాంగ్రెస్ లో మళ్ళీ ఆశలు పెంచారు.

అంత సీన్ ఉందా …?

నిజానికి జగన్ కి మనసులో కాంగ్రెస్ లో ఎప్పటికీ కేంద్రంలో అధికారంలోకి రావాలని ఉన్నట్లుగా తోచదు. ఎందుకంటే తన పార్టీ ఓటు బ్యాంకే కాంగ్రెస్ ది. ఒకసారి కేంద్రంలో కాంగ్రెస్ వస్తే తన ఓటు బ్యాంక్ కి ఏపీలో చిల్లు పడుతుంది. పైగా పాతకాపులు అంతా జంప్ చేసే సీన్ ఉంటుంది. ఇక కాంగ్రెస్ కప్పదాట్లు అలవాటు చేసిన పార్టీ. వైసీపీ ఎంపీలను కాసుకోవడమే జగన్ కి కష్టమైన పనే. దాంతో ఆయనకు మోడీయే మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రావాలి. అది కూడా మెజారిటీకి దూరంగా ఎన్డీయే కూటమి ఉంటే తాను మద్దతు ఇచ్చి నిలబెట్టి తన డిమాండ్లు నెరవేర్చుకోవాలి. ఈ సంగతి అంత సూటిగా జగన్ ఎపుడూ చెప్పరు, ఎందుకంటే బీజేపీ వైపు నేరుగా తాను మళ్ళితే అది కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ గా మారుతుంది. ఏపీలో మైనారిటీ రాజకీయానికి దెబ్బ పడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పేరు చెప్పకుండా ఎవరికైనా మద్దతు అంటున్నారు. అయితే ఇక్కడ మరో విషయం కూడా ఉంది. కాంగ్రెస్ ఇకనైనా తన తప్పు తెలుసుకుని జగన్ తో రాయబారాలు నడిపి కేవలం కేంద్ర రాజకీయాలకే పరిమితం అయి ఏపీ జోలికి రాకపోతే జగన్ హస్తం వైపు చూసే వీలుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ ఆద్వర్యంలోకి యూపీయే కూటమి 200 సీట్ల మార్క్ కి చేరినప్పటి మాట కదా అది.

Tags:    

Similar News