బాబును జగన్ కట్టడి చేయగలిగారా?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్షాన్ని ఒకే అంశానికి పరిమితం చేయాలనుకుంటున్నారా? జగన్ ఆలోచనలు అలాగే ఉన్నాయా? తన పదిహేను నెలల కాలంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలను [more]

Update: 2020-09-16 02:00 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్షాన్ని ఒకే అంశానికి పరిమితం చేయాలనుకుంటున్నారా? జగన్ ఆలోచనలు అలాగే ఉన్నాయా? తన పదిహేను నెలల కాలంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు చేరకుండా అడ్డుపడుతున్న విపక్షాన్ని మైండ్ గేమ్ తో కట్టడి చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు దాటుతోంది. ఈ పదిహేను నెలల్లో అందరికీ సంక్షేమ పథకాలను జగన్ అందించగలిగారు.

పరిమితం చేయాలని….

వాటిని విపక్షం తప్పుపట్టేందుకు వీలులేదు. కొన్ని విషయాల్లోనూ, లబ్దిదారుల ఎంపికలోనూ విపక్షం వాయిస్ కొంత విన్పించినా అంత సౌండ్ లేదన్నది వాస్తవం. చంద్రబాబుకు ఇప్పుడు రాజధాని అమరావతి మాత్రమే సమస్య అయింది. జగన్ కూడా అమరావతి రాజధాని కే చంద్రబాబును పరిమితం చేయాలని భావిస్తున్నట్లుంది. అందుకే రోజుకొక ఫిల్లర్ వదులుతూ రాజధాని అమరావతి విషయంలో కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తున్నారు.

పెద్దగా సమస్యలు లేక…..

నిజానికి చంద్రబాబుకు కూడా ఈ పదిహేను నెలల కాలంలో రాజధాని అమరావతి తప్ప పెద్దగా ప్రభుత్వంపై పోరాడాల్సిన అంశం చిక్కలేదు. ఇసుక సమస్య పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇంగ్లీష్ మీడియం అంశం కూడా బూమ్ రాంగ్ అయ్యే అవకాశం ఉందని భావించి చంద్రబాబు వెనక్కు తగ్గారు. ఇక సొంత పార్టీ నేతలపై అక్రమ కేసులంటూ కొంత ఆందోళనలు చేసినా అది ప్రజలకు సంబంధం లేదు. దీంతో ఇప్పుడు చంద్రబాబుకు అమరావతి ఒక్కటే సమస్యగా మారింది. ఇది తనకు అనుకూలంగా మారుతుందని జగన్ భావిస్తున్నారు.

దాని నుంచి పక్కకు పోకుండా…?

అమరావతి నుంచి పక్కకు పోకుండా జగన్ చంద్రబాబును కట్టిపడేశారన్న కామెంట్స్ పొలిటికల్ సర్కిళ్లలో విన్పిస్తున్నాయి. దీంతో ఆయన ఆ ప్రాంతానికే పరిమితమవుతారని, రానున్న రోజుల్లో మిగిలిన ప్రాంతాలు చంద్రబాబు కు మరింత దూరమవుతాయన్నది జగన్ ఆలోచనగా ఉంది. ఈ మేరకు కొంత సక్సెస్ అయినట్లే కన్పిస్తున్నారు. అయితే చంద్రబాబు అనుభవమున్న నాయకుడు కావడంతో ఆయన రాజధాని అమరావతికే పరిమితం చేయడం కల్ల అన్నది తెలుగుతమ్ముళ్ల మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News