బరువూ బాధ్యతలను దించుకోవాలనే చూస్తున్నారా?

అదేంటి అలా అంటున్నాడా యువ సీఎం అని ఆశ్చర్యపోనవసరం లేదు. పార్టీ బాధ్యతలు తనకు ఇపుడు వద్దు అని మాత్రమే అంటున్నారుట. ఇదంతా ఎందుకంటే జగన్ కి [more]

Update: 2020-09-16 13:30 GMT

అదేంటి అలా అంటున్నాడా యువ సీఎం అని ఆశ్చర్యపోనవసరం లేదు. పార్టీ బాధ్యతలు తనకు ఇపుడు వద్దు అని మాత్రమే అంటున్నారుట. ఇదంతా ఎందుకంటే జగన్ కి ముఖ్యమంత్రి అనే ముళ్ల కిరీటం నెత్తిన ఉంది. ఆడుతూ పాడుతూ సీఎం జాబ్ చేయడానికి అన్నీ అమర్చిన విస్తరాకు కాదు, ఏమీ లేని ఆంధ్రప్రదేశ్. అప్పుల రాష్ట్రం, కరోనాతో కుదేలయిన రాష్ట్రం. ఒక గాడిన పెట్టాలంటే మొత్తం టైం పాలనకు ఇచ్చేసినా సరిపోదు. దాంతో జగన్ తనకు పార్టీ బాద్యతలు అవసరం లేదని అంటున్నారని టాక్. అయితే అధ్యక్ష బాధ్యతలు అంటే పూర్తిగా తలదూర్చి పరిష్కరించడం, ఏ పంచాయతీలు, తలనొప్పులూ వద్దు అని మాత్రమే జగన్ అంటున్నారు. దాని కోసం పార్టీకి చెందిని వారికే బాధ్యతలు కట్టబెడతారు అంటున్నారు.

బాబు రూట్లోనేనా :

చంద్రబాబు సీఎంగా ఉంటూ పార్టీలో తనకు తాను సృష్టించుకున్న జాతీయ అధ్యక్షుడిగా ఉండేవారు. ఆయన పార్టీ కూడా నిఖార్సుగా ఉన్నది ఒక్క ఆంధ్రాలోనే అయితే కొంతమంది తెలంగాణా నేతలను ఏర్చి కూర్చి అక్కడ రాష్ట్ర కమిటీ పేరిట ఒకటి పెట్టి రెండు రాష్ట్రాల పార్టీ కాబట్టి తాను జాతీయ నేత అని బాబు ఫీల్ అవుతూంటారు. ఇక తన తనయుడిని జాతీయ కార్యదర్శిని చేసి చక్రం ఒకటి చేతికి ఇచ్చారు. ఇక బాబు మాదిరిగా తెలంగాణా సంగతి ఎలా ఉన్నా ఏపీకి మాత్రం ఒక ప్రెసిడెంట్ ని నియమించి తాను జాతీయ అధ్యక్షుడి అవతారం ఎత్తాలని జగన్ భావిస్తున్నారుట.

ఆ మిత్రుడికే …..

పెద్దిరెడ్డి కుటుంబం అంటే జగన్ కి చాలా సన్నిహితం. ఆ కుటుంబం నుంచి మూడు పదవులు జగన్ ఇచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మంత్రిని చేశారు. ఆయన సోదరుడిని ఎమ్మెల్యే చేశారు. ఇక కుమారుడు మిధున్ రెడ్డిని లోక్ సభలో పార్టీ లీడర్ ని చేశారు. ఇపుడు మిధున్ రెడ్డికే ఏపీ వైసీపీ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇస్తున్నారని టాక్. మిధున్ అయితే తనకు అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటాడని, పార్టీ క్షేమంగా ఉంటుందని కూడా జగన్ భావిస్తున్నారుట.

వారంతా ఫెయిల్……

నిజానికి జగన్ పార్టీ బరువు బాధ్యతలు దించుకోవడానికే చాలాకాలంగా చూస్తున్నారు. ఆయన సీఎం అయ్యాక పార్టీని పెద్దగా పర్యవేక్షించినది కూడా లేదు. పార్టీ పదవులు ఎందరికి ఇచ్చారో, వారు ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియదు. ఇక నాలుగేసి జిల్లాల వంతున ముగ్గురు సీనియర్ నేతలకు అప్పగించి పార్టీ బాధ్యతలు చూడమన్నారు. సజ్జల రామక్రిష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలకు పార్టీ బాగోగులు చూడమంటున్నా ఎవరూ కూడా జగన్ కి పార్టీ తలకాయ నొప్పులు తగ్గించలేకపోతున్నారుట. తన దాకా రాకుండా సమస్యలు పరిష్కరించే సత్తా ఉన్న నేత ఎవరా అని ఆలోచించి మరీ జగన్ మిధున్ రెడ్డికి ఓవరాల్ గా ఏపీ బాధ్యతలు అప్పగించబోతున్నారు అంటున్నారుట‌. మరి ఆయనైనా జగన్ కి పార్టీ కష్టాలు లేకుండా చూస్తారా.?

Tags:    

Similar News