భయం, భక్తీ రెండూ పోయినట్లుందే?

ప్రాంతీయ పార్టీ అంటేనే ఏక నాయకత్వం. నాయకుడు ఏది చెబితే అది కిందిస్థాయిలో అమలు కావాలి. నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ శిరసావహించాలి. అయితే వైసీపీలో మాత్రం [more]

Update: 2020-09-17 05:00 GMT

ప్రాంతీయ పార్టీ అంటేనే ఏక నాయకత్వం. నాయకుడు ఏది చెబితే అది కిందిస్థాయిలో అమలు కావాలి. నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ శిరసావహించాలి. అయితే వైసీపీలో మాత్రం అది జరగడం లేదు. జగన్ అంటే భయం లేదు. భక్తీ లేకుండా పోయింది. జగన్ దృష్టికి వెళితే తమ భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుందన్న ఫియర్ కూడా ఎవరికీ లేకుండా పోయింది. వైసీపీతో పోల్చుకుంటే టీడీపీ ఈ విషయంలో ఎన్నోరెట్టు బెస్ట్ అన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

ముగ్గురినే తీసుకున్నా…..

చంద్రబాబు నాడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. నేడు ముగ్గురిని తన వద్దకు చేర్చుకుని జగన్ ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు. మూడు నియోజకవర్గాల్లో నేతలు జగన్ మాట వినే పరిస్థితి కన్పించడం లేదు. వైసీపీ గెలిచిన చోట అంతర్గత విభేదాలను పక్కన పెడితే, టీడీపీ నుంచి తెచ్చుకున్న మూడు నియజకవర్గాల్లో కూడా నేతలు గీతలను దాటేస్తున్నారు. సవాళ్లు విసురుకుంటున్నారు. దీన్ని బట్టి జగన్ అంటే లెక్కలేని తనమేనని భావించాల్సి వస్తుంది.

సవాళ్లు… ఛాలెంజ్ లు…..

గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ ఇబ్బంది పడుతున్నారు. వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు సవాళ్లు మీద సవాళ్లు విసరుతున్నారు. తాను చెప్పినట్లే నియోజకవర్గంలో నడవాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. జగన్ ఇష్టపడితే వల్లభనేని వంశీ పార్టీ కి మద్దతు ఇస్తున్నారు. టీడీపీతో తెగదెంపులు చేసుకున్నారు. ఈ విషయం తెలిసి కూడా దుట్టా వర్గీయులు లైట్ గా తీసుకున్నారు. ఇక చీరాల సంగతి సరేసరి. మొన్న పార్టీలోకి వచ్చిన కరణం వెంకటేష్ ఆమంచి కృష్ణమోహన్ కు ఛాలెంజ్ లు విసురుతున్నారు. జగన్ వద్ద పంచాయతీ అవుతుందన్న టెన్షన్ వీరికి ఏమాత్రం లేదు.

జగన్ దృష్టి పెట్టకపోవడమే….

చంద్రబాబు వైసీపీ నుంచి తమ పార్టీలో చేర్చుకున్న 23 మంది విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించేవారు. అక్కడ ఇబ్బందులు ఎదురైతే నేరుగా టీడీపీ నేతలతో మాట్లాడే వారు. సీనియర్ నేతలతోనైనా చర్చించి అక్కడ ఇబ్బందులు లేకుండా చేసేవారు. కానీ జగన్ మాత్రం అసలు అక్కడ ఏం జరుగుతుందన్న ఆరా తీసిన పాపాన పోలేదు. సీనియర్ నేతలకు ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. మొత్తం మీద జగన్ అంటే నేతలకు భయం, భక్తీ లేకుండా పోయాయని పార్టీ వర్గాల్లోనే విస్తృత చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News