ఆ ఒక్కటీ సాధ్యం కాదా?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు రానున్నది గడ్డు కాలమే. ప్రస్తుతమున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో జగన్ అభివృద్ధి పనులు రాష్ట్రంలో చేయడం కష్టంగా మారింది. ఇప్పటికే నియోజకవర్గ [more]

Update: 2020-09-10 03:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు రానున్నది గడ్డు కాలమే. ప్రస్తుతమున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో జగన్ అభివృద్ధి పనులు రాష్ట్రంలో చేయడం కష్టంగా మారింది. ఇప్పటికే నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఎమ్మెల్యేలకు ఇవ్వకపోవడంతో వారిలో అసంతృప్తి స్పష్టంగా కన్పిస్తుంది. ఎమ్మెల్యేలు అయి ఏడాదిన్నర దాటుతున్నా తమ పేరు మీద శిలాఫలకాలు కూడా వేసుకోలేకపోతున్నామని ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉంటే సంక్షేమ పథకాలను మాత్రం జగన్ ఆపడం లేదు.

మద్య నిషేధం చేస్తానని…

ఇక ఎన్నికల నాటికి మద్య నిషేధం ఏపీలో విధిస్తానని జగన్ ప్రకటించారు. తన ఎన్నికల మ్యానిఫేస్టోలోనూ ప్రకటించారు. మద్య నిషేధాన్ని దశలవారీగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా మద్యం దుకణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. దీనివల్ల ఎమ్మెల్యేలు వత్తిడి ఎదుర్కొంటున్నారు. అధికారంలోకి వస్తే తాము మద్యం దుకాణాలను నిర్వహించుకోవచ్చని భావించిన ద్వితీయశ్రేణి నేతలకు జగన్ ఝలక్ ఇచ్చినట్లే అయింది. దీనికి తోడు మద్యనిషేధం విధిస్తే 12 వేల కోట్ల ఆదాయానికి గండి పడుతుంది.

దశలవారీగా చేస్తూ….

సరే మద్య నిషేధం చేస్తానని చెప్పి షాపుల సంఖ్యను కూడా తగ్గించారు. అయితే ఆరు నెలల నుంచి కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఒకటోతేదీకి ప్రభుత్వోద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశాలు కనుచూపు మేరలో కన్పించడం లేదు. ఈ పరిస్థితుల్లో మద్యనిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తే ఆదాయం మరింత క్షీణించే అవకాశముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆర్థిక పరిస్థితులు కూడా…..

అయినా జగన్ మాత్రం సంక్షేమ పథకాల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. మ్యానిఫేస్టోలో ఉన్న మద్యనిషేధాన్ని అమలు చేయాలని జగన్ భావిస్తున్నారు. మద్యనిషేధాన్ిన అమలు చేయడం ఏపీ లాంటి రాష్ట్రాల్లో సాధ్యంకాదని అధికారుల సయితం చెబుతున్నారు. దాదాపు ఐదు రాష్ట్రాలకు సరిహద్దులుగా ఉన్న ఏపీలో మద్య నిషేధం సాధ్యం కాదంటున్నారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తరలి వస్తోంది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల నాటికి మద్యనిషేధం అమలు చేయడం జగన్ కు కష్టమే. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు కూడా మద్య నిషేధం హామీ అమలు సాధ్యం కాదంటున్నారు.

Tags:    

Similar News