ఔట్ డేటెడ్ నేత‌ల‌కు ఓవ‌ర్ ప్రియార్టీ.. జ‌గ‌న్ రివ‌ర్స్ పాలిటిక్స్‌

ఎక్కడైనా రాజ‌కీయాల్లో ప్రజ‌ల్లో మంచి ఊపు ఉన్న నాయ‌కుల‌కు పార్టీలు ప్రాధాన్యం ఇస్తాయి. అవ‌స‌ర‌మైతే.. ప‌క్క పార్టీల నుంచి కూడా ఇలాంటి నాయ‌కుల‌ను తెచ్చుకునేందుకు వెనుకాడ‌రు. గ‌తంలో [more]

Update: 2020-09-05 02:00 GMT

ఎక్కడైనా రాజ‌కీయాల్లో ప్రజ‌ల్లో మంచి ఊపు ఉన్న నాయ‌కుల‌కు పార్టీలు ప్రాధాన్యం ఇస్తాయి. అవ‌స‌ర‌మైతే.. ప‌క్క పార్టీల నుంచి కూడా ఇలాంటి నాయ‌కుల‌ను తెచ్చుకునేందుకు వెనుకాడ‌రు. గ‌తంలో టీడీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో ప్రజామోదం, ప్ర‌జ‌ల నుంచి నెగ్గిన వైసీపీ నాయ‌కుల‌ను చేర్చుకుని రాజ‌కీయం చేశారు. అయితే, దీనికి భిన్నంగా ప్రస్తుత సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ రాజ‌కీయం చేస్తున్నార‌నే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఆయ‌న పార్టీలోకి చేర్చుకుంటున్న వారి జాత‌కాలు ప‌రిశీలిస్తే.. ఎక్కడా వారికి పెద్దగా ప్రాధాన్యం లేని విష‌యం స్పష్టంగా తెలుస్తోంది. పైగా ప్రజ‌లు కూడా వారిని తిరస్కరించారు. అలాంటి వారిని జ‌గ‌న్ ఎందుకు ప్రయార్టీ ఇచ్చి.. పెద్దపీట వేస్తున్నారో.. అర్ధం కావ‌డం లేద‌ని సొంత పార్టీ నేత‌లే చెప్పుకొంటున్నారు.ఉదాహ‌రణ‌కు కొంద‌రిని ప‌రిశీలిద్దాం..

తొట త్రిమూర్తులు :

తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులు టీడీపీలో 2014లో రామ‌చంద్రపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. కాపు సామాజిక వ‌ర్గంలో మంచి ప‌ట్టుంది. అయితే, ఆయ‌న దూకుడు రాజ‌కీయాలు చేస్తార‌న్న పేరు తెచ్చుకున్నారు. పైగా వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో ఆయ‌న సుదీర్ఘకాలంగా వైరం ఉంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. అయిన‌ప్పటికీ.. జ‌గ‌న్ దాదాపు ఎనిమిది నెల‌ల కింద‌టే పార్టీలో చేర్చుకున్నారు. వాస్తవానికి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప్రస్తుత మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ, బోసుల‌కు గ‌ట్టి ప‌ట్టుంది. తోట‌తో పెద్దగా వైసీపీకి ఒరిగేది ఏమీలేదు. పైగా ఆయ‌న‌పై ఉన్న కేసుల మాఫీ కోసం పార్టీలు మార‌తార‌నే పేరు కూడా తోట‌కు ఉంది. అయినా కూడా జ‌గ‌న్ ఆయ‌న‌ను పార్టీలోకి తీసుకున్నారు. పైగా ఆయ‌నకు అమ‌లాపురం పార్లమెంట‌రీ జిల్లా పార్టీ ప‌గ్గాలు ఇవ్వడంతో ఈ పార్లమెంట‌రీ పార్టీ నియోజ‌క‌వ‌ర్గంలో గ్రూపుల గోల ఎక్కువైంది.

రామ‌సుబ్బారెడ్డి :

క‌డ‌ప జిల్లా జ‌మ్మల‌మ‌డుగుకు చెందిన టీడీపీ నాయ‌కుడు రామ‌సుబ్బారెడ్డి. వైసీపీ అంటేనే నిప్పులు చెరిగే నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. అయిన‌ప్పటికీ.. ఈయ‌న‌ను జ‌గ‌న్ ఇటీవ‌ల పార్టీలో చేర్చుకున్నారు. నిజానికి గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్యర్థి సుధీర్‌రెడ్డిని ఓడించేందుకు టీడీపీలో బ‌ద్ధ శ‌త్రువులుగా ఉన్న రామ‌సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డిలు చేతులు క‌లిపారు. అయినా సుధీర్‌రెడ్డి 53 వేల ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. అంటే… రామ‌సుబ్బారెడ్డి, ఆది నారాయ‌ణ రెడ్డిలు క‌లిసినా.. సుదీర్‌రెడ్డి విజ‌యాన్ని ఆప‌లేక పోయిన విష‌యం స్పష్టంగా క‌నిపించింది. అయిన‌ప్పటికీ.. జ‌గ‌న్ రామ‌సుబ్బారెడ్డిని ఎందుకు చేర్చుకున్నారో తెలియ‌దు. పైగా సుధీర్ తీవ్ర అస‌హ‌నం వ్యక్తం చేస్తున్నారు. ఇక రామ‌సుబ్బారెడ్డి పార్టీలోకి వ‌చ్చి జ‌మ్మల‌మ‌డుగులో తాను చెప్పిందే వేదం అని.. త‌న మాటే చెల్లుబాటు కావాలంటూ ఆధిప‌త్య పోరుకు తెర‌దీయ‌డంతో జ‌మ్మల‌మ‌డుగులో పార్టీ నిట్టనిలువునా చీలింది.

చంద‌న ర‌మేష్ :

రాజ‌మండ్రిలో టీడీపీకే చెందిన మాజీ ఎమ్మెల్యే చంద‌న‌ ర‌మేష్ ఫ్యామిలీ అవుట్ డేటెడ్ అయింది. ఆయ‌న‌కు ఆరోగ్యం బాలోదు. అయినా కూడా ఎంపీ భ‌ర‌త్‌రామ్ తీసుకురావ‌డంతో చందన రమేష్ ను పార్టీలో చేర్చుకున్నారు. పైగా ఇక్క‌డ జ‌క్కంపూడి రాజాకు, ఎంపీకి ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి కూడా ఉంది. దీంతో ఎంపీ త‌న వ‌ర్గాన్ని పెంచి పోషించేందుకు బీసీ నేత అయిన చంద‌న ర‌మేష్‌ను జగన్ పార్టీలో చేర్చుకున్నారు. ఇది పార్టీలో వ‌ర్గపోరుకు అప్పుడే బీజ్యం వేసింది. చంద‌న ర‌మేష్ ఫ్యామిలీ అవుట్ డేటెడ్ అయినా వాళ్లను పార్టీలో చేర్చుకున్నార‌ని.. ఇప్పుడు ఆ కుటుంబానికి మేయ‌ర్ ప‌ద‌వి ఇస్తే రాజ‌మండ్రిలో గ్రూపుల గోల తారాస్థాయికి చేరుకుంటుంద‌ని సొంత పార్టీ నేత‌లే వాపోతున్నారు.

పంచ‌క‌ర్ల ర‌మేష్‌బాబు.:

విశాఖ‌కు చెందిన టీడీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే పంచ‌క‌ర్ల ర‌మేష్‌బాబును ఇటీవ‌ల జ‌గ‌న్ పార్టీలో చేర్చుకున్నారు. అయితే, ఆయ‌నకు వ్యక్తిగ‌తంగా ప్రజ‌ల‌ను ప్రభావితం చేసే స‌త్తాలేద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో టాక్‌. పైగా ఆయ‌న గంటా శ్రీనివాస‌రావు గ్యాంగ్ గా పేరుంది. గ‌తంలో పెందుర్తి నుంచి ప్రజారాజ్యం టికెట్‌పై విజ‌యం సాధించారు. త‌ర్వాత పార్టీ మారి.. 2014లో టీడీపీ త‌ర‌ఫున ఎల‌మంచిలి నుంచి విజ‌యం సాదించారు. ఈయ‌న వ‌ల్ల పార్టీకి ఒరిగేది ఏంటో తెలియ‌డం లేద‌ని సీనియ‌ర్లు అంటున్నారు. పైగా ఆయ‌న‌ను ఎక్కడ నుంచి ఎకామ‌డేట్ చేస్తారో కూడా గంద‌ర‌గోళంగా ఉంది. ఇలా.. జ‌గ‌న్ చేస్తున్న రివ‌ర్స్ రాజ‌కీయాల‌తో వైసీపీ నాయ‌కులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

Tags:    

Similar News