జగన్ కి మోడీ మార్క్ షాక్ ?

జగన్ అంటే మోడీకి రాజకీయాలకు అతీతమైన ప్రేమాభిమానాలు ఉన్నాయని అంతా భావిస్తూ వచ్చారు. అయితే రాజకీయాలు అంటే అలాగే ఉంటాయి. ఎవరి స్కిన్ వారు రక్షించుకోవడమే రాజకీయం. [more]

Update: 2020-08-30 13:30 GMT

జగన్ అంటే మోడీకి రాజకీయాలకు అతీతమైన ప్రేమాభిమానాలు ఉన్నాయని అంతా భావిస్తూ వచ్చారు. అయితే రాజకీయాలు అంటే అలాగే ఉంటాయి. ఎవరి స్కిన్ వారు రక్షించుకోవడమే రాజకీయం. అంతే కాదు, వీలుంటే ఎదుటి వారి బలహీనతలు సొమ్ము చేసుకోవడం కూడా రాజకీయమే. విషయానికి వస్తే ఏపీలో పదేళ్ళ పోరాటం తరువాత జగన్ అధికారంలోకి వచ్చారు. ఆయనకు ముఖ్యమంత్రి సీటు అన్నది రక్తమోడ్చితే దక్కింది. రాజకీయ వ్యూహాల కంటే కూడా కష్టాన్నే జగన్ గట్టిగా నమ్ముకున్నారు. ఇపుడు కూడా ఒకటి ఒకటి కలిస్తే రెండు అన్న సాధారణ గణితాన్నే జగన్ రాజకీయాల్లో కూడా అనుసరిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు మాత్రమే అయింది. అంటే పావు వంతు పూర్తి అయిందన్న మాట. మరో మూడు వంతుల అధికారం ఇంకా మిగిలే ఉంది. అయితే దానికి కత్తెర వేయడానికి మోడీ సర్కార్ రెడీ అయిపోవడమే విషాదమూ, విడ్డూరమూనూ.

ఒకే ఎన్నికగా ……

కేంద్రంలోని మోడీ సర్కార్ జమిలి ఎన్నికల మీద చూపు పెట్టినట్లుగా సమాచారం వస్తోంది. అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక అన్న మాట. దేశంలోని 28 రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలే కాదు, స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఈ గూటిలోకి తెచ్చి మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా ఒక్క దెబ్బకు ఫినిష్ చేయాలని మోడీ సర్కార్ భారీ యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లుగా సమాచారం. దీని మీద మళ్ళీ ఫైళ్ళు కదులుతున్నాయి. కసరత్తు కూడా మొదలైంది. వేగంగా పావులు కదుపుతున్నారు. ఇదీ ప్రస్తుతానికి ఢిల్లీ వర్గాల సమాచారం.

ఏణ్ణర్ధంలోనే….

దేశంలో ఇపుడున్న పరిస్థితులు కూడా ఒకే ఎన్నికకు దారితీస్తున్నాయి అంటున్నారు. ఈ ఏడాది నవంబర్లో బీహార్ ఎన్నికలు ఉన్నాయి. వచ్చే ఏడాది , పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా మరి కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఇక 2022 నాటికి అతి పెద్ద రాష్ట్రం యూపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ మరుసటి ఏడాది కర్నాటక, తెలంగాణా ఇలా ఉత్తరాది రాష్ట్రాల్లో పలు ఎన్నికలు ఉన్నాయి. 2024 నాటికి ఏపీతో పాటు కేంద్రంలో ఎన్నికలు జరుగుతాయి. అయితే ఇపుడు కరోనా ఉంది. మరో ఆరు నెలల దాకా దాని ప్రభావం ఉంటుంది. దాంతో బీహర్ ఎన్నికలను వాయిదావేస్తారా అన్న చర్చ ఉంది. ఈసీ బీహార్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఏం జరుగుతుందో చెప్పలేని స్థితి. అలా అనుకుంటే ఈ ఎన్నికలు వచ్చే ఏడాది ఎన్నికలు అన్నీ కలుపుకుని ప్రధాని పీఠానికి రాచబాట అయిన యూపీ ఎన్నికలతో సహా జమిలి ఎన్నికలు జరిపిస్తారా అన్న చర్చ ఉంది. ఇక కేంద్రంలోని మోడీ సర్కార్ రెండేళ్ల తన అధికారాన్ని తగ్గించుకుంటారా అన్నది ఇంకో చర్చ. అలాగే జరిగితే ఏపీలో జగన్ అధికారం కూడా మూడేళ్ల దగ్గరే ఆగిపోతుంది మరి.

బాబుకు ఓకేనా…?

మాట్లాడితే చాలు ఏపీలో ఎన్నికలు పెట్టేయండి అంటూ గర్జించే చంద్రబాబు 2022 లో జమిలి ఎన్నికలు అంటే ఎగిరిగంతేస్తారు. దానికి ఎన్నో రాజకీయ కారణలు. ఎందుకంటే జగన్ ఇంకా పాలన పూర్తిగా ప్రారంభించలేదు. ఆయన ఇంకా పంచుడు దగ్గరే ఆగిపోయారు. అభివ్రుధ్ధి అన్నది లేదు కానీ అమరావతి రాజధాని చిచ్చు మాత్రం బాగానే రగులుకుంది. కరోనా వచ్చి ఏడాది కాలం కొట్టేసింది. ఇక మిగిలినది ఒక్క ఏడాది అనుకుంటే మ్యాజిక్కులు ఏమీ జగన్ చేయలేరు. వెరసి ఆయనను ఏ ఒక్క పనీ చేయని సీఎం అంటూ జనంలోకి బాబు తీసుకెళ్ళి బురద సులువుగా జల్లేందుకు వీలుంటుంది. ఇక ఏపీలో బీజేపీ, జనసేన కూటమి బలపడలేదు, మరో ఏణ్ణర్ధంలో ఎన్నికలు అంటే ఆ కూటమి కూడా గతిలేక టీడీపీతోనే పొత్తుకు రెడీ కావాల్సి ఉంటుంది. ఇక జగన్ కి మాత్రం ఈ పరిణామాలు షాక్ లాంటివే. 2022 లో జమిలి ఎన్నికలు జరిగితే వైసీపీ ఫేట్ ఇటు నుంచి అటు అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. 151 సీట్లు తెచ్చుకున్న జగన్ కి అయిదేళ్ళూ పాలించే అవకాశం లేకపోతే అది ఆయనకే కాదు, అభిమానులకూ రాజకీయ విషాదమే. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News