ఉత్తరాంధ్రా దశ తిరిగింది… జగన్ మాస్టర్ ప్లాన్ తో

విశాఖ వస్తే బీచ్ చూసి వెళ్ళిపోవడమే. బస చేసేందుకు స్టార్ హొటళ్ళు ఉన్నా కూడా సాధారణ జనానికి అందుబాటులో ఉండవు, ఇక టూరిజం కాటేజీలు కూడా తక్కువగా [more]

Update: 2020-09-09 08:00 GMT

విశాఖ వస్తే బీచ్ చూసి వెళ్ళిపోవడమే. బస చేసేందుకు స్టార్ హొటళ్ళు ఉన్నా కూడా సాధారణ జనానికి అందుబాటులో ఉండవు, ఇక టూరిజం కాటేజీలు కూడా తక్కువగా ఉన్నాయి. దీంతో పాటు ఒక్క విశాఖ మాత్రమే చూస్తూ గడపాలి. ఇపుడు జగన్ మార్క్ టూరిజంతో అలా కాదు, విశాఖ వస్తే కనీసంగా మూడు రోజుల ట్రిప్ వేయాల్సిందే. ఏజెన్సీ అందాలను కలుపుతూ భారీ టూరిజం సర్క్యూట్ కి ప్రణాళికలను సిధ్ధం చేస్తున్నారు. అదే విధంగా విశాఖ బీచ్ తీరం నుంచి భోగాపురం వరకూ ఎటూ చూసినా టూరిజం స్పాట్స్ వస్తున్నాయి. మొత్తానికి ఇవన్నీ కలుపుకుని ఆరు లైన్ల బీచ్ రోడ్లు రాబోతున్నాయి.

మూడు దశాబ్దాల కల……

విశాఖ బీచ్ రోడ్డును ఉపయోగించుకోవాలన్నది మూడు దశాబ్దాల కల. నాడు జాతీయ రహదారి పూర్తిగా ట్రాఫిక్ తో నిండి ఉందని, దాంతో రెండవ మార్గం కావాలని ఒక ప్రతిపాదన వచ్చింది. అయితే భీమిలీ నుంచి విశాఖ వరకూ రోడ్లు వేశారు తప్ప అంతకు మించి పొడిగించలేదు. ఇపుడు ఆ రోడ్లే ఆరు లైన్లు కాబోతున్నాయి. ఇంతటితో కాకుండా భోగాపురం వరకూ వీటిని తీసుకుపోతున్నారు. అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వస్తున్న సంగతి విదితమే అంటే విదేశీ పర్యాటకులు అక్కడ విమానం దిగితే నేరుగా బీచ్ టూరిజం స్పాట్స్ చేరుకోవచ్చు అన్నమాట. మొత్తం అరవై కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ప్రాంతమంతా హ్యాపీగా టూర్ చేయవచ్చు. దీని కోసం వైసీపీ సర్కార్ ప్రతిపాదలు సిధ్ధం చేస్తోంది.

భావనపాడుకు మోక్షం….

ఇక శ్రీకాకుళం జిల్లాలో పోర్టు కావాలని అర్ధ శతాబ్దంగా ఉన్న డిమాండ్. తమకు పోర్ట్ లేకనే గుజరాత్, ముంబై, చెన్నై వంటి ప్రాంతాలకు వలస‌వెళ్ళిపోతున్నామని అక్కడి మత్య్సకారులు చెబుతారు. ఇపుడు జగన్ సర్కార్ వచ్చి ఏడాది దాటగానే భావనపాడుకు మోక్షం కల్పించింది. ఈ ప్రాజెక్ట్ మొదటి దశను జగన్ సర్కార్ మొదటి దశను మూడేళ్ల కాలపరిమితితో పూర్తి చేయనుంది. 3,600 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ రెడీ అవుతోంది. దీనికి సంబంధింది డీపీఆర్ కి ఆమోద ముద్ర వేసిన జగన్ సర్కార్ భూముల సేకరణకు కూడా నిధులు మంజూర్ కి క్లియరెన్స్ ఇచ్చేసింది. దాంతో సిక్కోలు వాసుల చిరకాల కల నెరవేరనుంది. ఈ ప్రాజెక్ట్ పనులు సకాలంలో పూర్తి చేయడానికి దగ్గరుండి చూసుకునవాడానికి ఆ ప్రాంతానికే చెందిన మంత్రి సీదరి అప్పలరాజుని ముందుగానే జగన్ నియమించడం గొప్ప ముందు చూపుగానే చూడాలి.

అదీ అజెండా…

జగన్ సర్కార్ మాస్టర్ ప్లాన్ లో ఉత్తరాంద్ర్హా నుంచి చెన్నై వరకూ తీర ప్రాంత అభివృద్ధి ఉంది. ఈ ప్రాంతాలను కలుపుకుంటూ జిల్లాకో పోర్టు ని నిర్మించడం ద్వారా సముద్ర రవాణాను రెట్టింపు చేయాలన్నది ముఖ్యమైన ఆలోచన. అదే విధంగా కోస్టల్ కారిడార్ ని పరుగులు పెట్టించి సముద్ర ఉత్పత్తుల ద్వారా ఆదాయాన్ని పెంచాలన్నది కూడా మరో టార్గెట్. ఈ ప్రాంతాలను కలుపుతూ ఆర్ధిక కారిడార్ గా చేయాలన్నది కూడా జగన్ సర్కార్ గట్టి పట్టుదలగా ఉంది. అదే కనుక జరిగితే దాదాపు వేయి కిలోమీటర్లు ఉన్న బీచ్ తీరం ఆర్ధికంగానే కాదు, అభివృధ్ధి పరంగా కూడా పరుగులు తీస్తుంది. మొత్తానికి జగన్ ఆలోచనలతో ఉత్తరాంధ్రాకు ఉచ్చ దశ వచ్చినట్లేనని అంటున్నారు.

Tags:    

Similar News