జగన్ డెసిషన్ తో ఆయనకు పెద్ద కుర్చీ..?

ఏపీలో ఉన్న జిల్లాలను 26 చేసేందుకు జగన్ సర్కార్ రెడీ అయింది. దానికి సంబంధించి అడుగులు వేగంగా వేస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నాయకత్వంలో [more]

Update: 2020-08-28 15:30 GMT

ఏపీలో ఉన్న జిల్లాలను 26 చేసేందుకు జగన్ సర్కార్ రెడీ అయింది. దానికి సంబంధించి అడుగులు వేగంగా వేస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని నాయకత్వంలో కమిటీని వేశారు. సబ్ కమిటీలు కూడా నాలుగు వేశారు. ఈ కమిటీలు కొత్త జిల్లాల ఎంపికపై సమగ్రమైన అధ్యయనం చేస్తాయి. అభ్యంతరాలను కూడా తీసుకుని పూర్తి నివేదికను ప్రభుత్వానికి ఇస్తాయి. 2021 ఏప్రిల్ 1 తరువాత కొత్త జిల్లాల ఏర్పాటు ఉంటుంది. ఆ తరువాత అంటే వచ్చే ఏడాది నవంబర్ నాటికి జగన్ మంత్రివర్గ విస్తరణ చేస్తారని అంటున్నారు. ఇది జగన్ చెప్పిన మాటే. రెండున్నరేళ్ళు అప్పటికి పూర్తి అవుతాయి కాబట్టి కొత్త వారికి చాన్స్ ఇస్తారు.

జిల్లాకో మంత్రి….

ఇపుడు జగన్ క్యాబినెట్లో ముఖ్యమంత్రి కాక 25 మంది మంత్రులు ఉన్నారు. ఇదే విధంగా రేపటి రోజున కూడా ఇదే సంఖ్యలో కొత్త మంత్రులను తీసుకోవాల్సి ఉంటుంది. సీనియర్లు బాగా పనిచేసేవారు మినహాయిస్తే దాదాపు డెబ్బై శాతం మందిని తొలగించి కొత్తవారిని జగన్ తీసుకుంటాడని వినిపిస్తోంది. ఆ విధంగా చూసుకుంటే కొత్త జిల్లాలకు ప్రాధాన్యత లభిస్తుంది. ఉత్తరాంధ్రాలో ఉన్న మూడు జిల్లాలు ఆరు అవుతాయి. అపుడు ఆరుగురు మంత్రులు వస్తార‌ని చెబుతున్నారు.

అరకు నుంచి ఆయనే …..

ఈ క్రమంలో అరకు కొత్త జిల్లాగా ఏర్పడనుంది. అరకు జిల్లాలో అరకు, పాడేరు, ఉండనున్నాయి. దీంతో అరకు ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణకు మంత్రి అయ్యే చాన్స్ వస్తుందని లెక్కలు వేస్తున్నారు. పాడేరు ఎమ్మెల్యే కొట్టిగళ్ల భాగ్యలక్ష్మి కంటే కూడా ఫల్గుణ జనంలో ఎక్కువగా ఉంటున్నారు. వారి సమస్యల మీద స్పందిస్తూ పేరు తెచ్చుకుంటున్నారు. పైగా పార్టీ హై కమాండ్ కి ఆయన మీద మంచి అభిప్రాయం ఉంది. గతంలో బ్యాంక్ ఉద్యోగిగా ఉన్న ఫల్గుణ దానికి రాజీనామా చేసి పూర్తిగా ప్రజా సేవలోకి వచ్చారు. ఆయనకు అవకాశం ఇస్తే గిరిజన ప్రాంతాల్లో మరింత పట్టు సాధించినట్లుగా ఉంటుందని కూడా అంటున్నారు.

పాలన సులువే…..

ఇంకో వైపు చూసుకుంటే అరకు విశాఖ జిల్లా కేంద్రానికి చాలా దూరంగా ఉంది. పాలనాపరమైన సమస్యలు చాలా ఉన్నాయి. అరకు కొత్త జిల్లా అయితే అక్కడకు కలెక్టర్ కూడా వస్తారు. జిల్లా కేంద్రానికే చెందిన వారిని మంత్రిని చేస్తే మరింత వేగంగా పాలన ఫలాలు జనానికి అందుతాయ‌న్న భావన కూడా వైసీపీ ప్రభుత్వ పెద్దల్లో ఉందిట. మొత్తానికి పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ద్వారా వైసీపీలో చేరిన శెట్టి ఫల్గుణ జగన్ వద్ద నమ్మకం పెంచుకుని పార్టీనే అంటిపెట్టుకున్నందుకు ఆయనకు మంచి ఫలితమే వస్తుందని అంటున్నారు. పార్టీలో కూడా దీని మీద చర్చ సాగుతోంది.

Tags:    

Similar News