జగన్ నిర్ణయం మారదట.. అదే ఫైనల్ అట

జగన్ కచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కోసం ఆరుగాలం కష్టపడిన కార్యకర్తలకే కార్పొరేషన్లు అప్పగించాలని జగన్ ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాలోని శ్రీకాకుళానికి బంపర్ [more]

Update: 2020-08-27 08:00 GMT

జగన్ కచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కోసం ఆరుగాలం కష్టపడిన కార్యకర్తలకే కార్పొరేషన్లు అప్పగించాలని జగన్ ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాలోని శ్రీకాకుళానికి బంపర్ ఆఫర్ తగిలింది. బీసీల పేరిట 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే అందులో కనీసం అరడజను పదవులు ఒక్క శ్రీకాకుళం జిల్లాకే దక్కుతున్నాయి. మరో వైపు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన వారికి, ఏ టికెట్టూ దక్కని వారికి కూడా జగన్ తొలి ప్రాధాన్యత ఇచ్చి ఈ పదవుల పందేరం చేపట్టారు.

కాళింగ తిలకుడు ….

టెక్కలిలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మీద పోటీ చేసి ఓడిన పేరాడ తిలక్ ని పిలిచి మరీ జగన్ పెద్ద పీట వేశారు. ఆయనను కాళింగ కార్పొరేషన్ చైర్మన్ ని చేశారు. నిజానికి తనకు టెక్కలి ఇంచార్జి పదవి కావాలని తిలక్ కోరుతున్నారు. కానీ అక్కడ దువ్వాడ శ్రీనును నియమించి అచ్చెన్నని ఓడించేందుకు జగన్ భారీ స్కెచ్ రూపొందించారు. ఈ పరిణామాలతో డీలాపడిన తిలక్ కి ఇపుడు చైర్మన్ పదవి ఇచ్చి సమన్యాయం చేశారు. ఇకపైన తిలక్ దువ్వాడ శ్రీనుకు సహకరించి టెక్కలిలో వైసీపీని బలోపేతం చేయాలని కూడా హై కమాండ్ ఆదేశించింది.

జగనే నేరుగా ….

ఇక అర్హులకు పదవులు ఇవ్వాలి అన్నది జగన్ తీసుకున్న నిర్ణయం. పదేళ్ళుగా పార్టీ జెండా మోసిన వారే ప్రయారిటీ. ఆ విధానం అమలు చేయడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన సిఫార్సులను కూడా బుట్టదాఖలు చేసి మరీ కార్యకర్తలకు జగన్ పట్టం కట్టారని అంటున్నారు. ప్రతీ జిల్లాకు నాలుగు బీసీ కార్పొరేషన్ పదవులు ఇవ్వలని అనుకున్నా శ్రీకాకుళానికి మాత్రం ఆరు దాకా ఇస్తున్నారు, దానికి కారణం ఇక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు. పైగా తూర్పు కాపులు, పోలినాటి వెలమ, పొందర బీసీ కులాలు పెద్ద ఎత్తున జనాభాగా ఉన్నారు. దాంతో జగన్ సిక్కోలు పట్ల మక్కువ పెంచుకున్నారని అంటున్నారు.

ఎమ్మెల్యే హోదాతో ….

బీసీ కార్పోరేషన్ చైర్మన్లకు ఎమ్మెల్యే హోదా ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారం వారికి అధికార మర్యాదలు దక్కుతాయి. దాంతో ఈ పదవుల కోసం మంత్రుల నుంచి ఎమ్మెల్యేల నుంచి కూడా సిఫారులు చాలానే వెళ్లాయి. డిప్యూటీ సీఎం కృష్ణ దాస్ సొంత నియోజకవర్గం నరసన్నపేట నుంచి ముగ్గురుకి చైర్మన్ పదవులు ఇవ్వాలని సిఫార్సులు చేశారట. అయితే ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆద్వర్యంలో కమిటీ సెలెక్ట్ చేసి సీఎం కి అర్హుల పేర్లను పంపుతోందిట. ఆ పేర్లను మరో మారు ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా ధృవీకరించుకుని అసలైన వారికే ఇచ్చేందుకు జగన్ డిసైడ్ అయ్యారని సమాచారం. మొత్తానికి బీసీల కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్రాకు మూడవ వంతు చైర్మన్ పదవులు దక్కేలా కనిపిస్తున్నాయి. దీంతో ఇక్కడ కూడా జగన్ ఉత్తరాంధ్ర పక్షపాతం బయటపడిందని అంటున్నారు.

Tags:    

Similar News