ఫైళ్లు తీశారు… సీట్లు రెడీ అయిపోతున్నాయ్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పదవుల పందేరానికి రెడీ అవుతున్నారు. ఏకంగా 200 మందికి పదవులు ఇచ్చేందుకు జగన్ రెడీ అయిపోయారు. బీసీ కులాలకు చెందిన 54 కార్పొరేషన్ల [more]

Update: 2020-08-24 12:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పదవుల పందేరానికి రెడీ అవుతున్నారు. ఏకంగా 200 మందికి పదవులు ఇచ్చేందుకు జగన్ రెడీ అయిపోయారు. బీసీ కులాలకు చెందిన 54 కార్పొరేషన్ల నియామకానికి త్వరలోనే జగన్ నియామకాలు చేపట్టనున్నారని తెలిసింది. ఒక్కొక్క కార్పొరేషన్ తో ఛైర్మన్ తో పాటు ఏడుగురు నుంచి తొమ్మిది మంది సభ్యులు నియామకం జరగడంతో పెద్దయెత్తున పదవులు భర్తీ కానున్నాయి.

ఒక్కో కులానికి…..

బీసీల్లో అనేక కులాలున్నాయి. ఒక్కొక్క కులానికి ఒక్కో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారు. వీటికి సంబంధించి గ్రౌండ్ వర్క్ పూర్తయింది. నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మంత్రుల అభిప్రాయాలను తీసుకుని కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్ల పేర్ల జాబితాను రూపొందించే పనిలో ఇప్పటికే తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీనియర్ నేత ఒకరు ఉన్నారు. జగన్ ఫైల్ పై సంతకం పెడితే నియామకాలు పూర్తయినట్లే.

కష్టపడి పనిచేసిన వారికే…

పార్టీ కోసం గత ఎనిమిదేళ్ల నుంచి కష్టపడి పనిచేసిన వారికే ఈ పోస్టులు దక్కనున్నాయి. పార్టీ పట్ల వారి అంకిత భావంతో పాటు పనితీరును కూడా బేరీజు వేసి జాబితాను రూపొందించారని తెలిసింది. కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన సిఫార్సుల పేర్లను కూడా పట్టించుకోకుండా పూర్తిగా పార్టీ విధేయులకే వీటిని అప్పగించాలని నిర్ణయించారు. దీంతో ఆశావహులు ఇప్పటి వరకూ ఎమ్మెల్యేలు చుట్టూ తిరిగినా ఫలితం లేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

నిధులు ప్రత్యేకంగా….

ఒక్కొక్క కార్పొరేషన్ కు ఎండీ జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని నియమించనున్నారు. ఈ కార్పొరేషన్లకు విడివిడిగా నిధులు కేటాయించనుండటంతో ఈ పదవులకు ప్రాధాన్యత పెరిగింది. అందుకే గత కొంతకాలంగా ఎమ్మెల్యేల చుట్టూ ఆశావహులు తిరుగుతున్నారు. కానీపూర్తి స్థాయి సమాచారం తెప్పించుకున్న తర్వాతనే ఛైర్మన్ పదవులను ఖరారుచేయాలని జగన్ ఆదేశించడంతో పార్టీ నేతలు సిఫార్సులను పక్కన పెట్టి మరీ జాబితాను రూపొందించారని చెబుతున్నారు.

Tags:    

Similar News