వారు ఇలాగే ఉంటే….నిందలు మోయాల్సిందేనా..?

ఎన్నో ఆశ‌లు, ఆశ‌యాలు, ల‌క్ష్యాల‌తో అధికారాన్ని చేప‌ట్టిన సీఎం జ‌గ‌న్‌కు అధికార యంత్రంగా త‌ల‌నొప్పిగా మారిందా? వారు వ్యవ‌హ‌రిస్తున్న తీరుతో ప్రభుత్వం వేస్తున్న అడుగులు వెన‌క్కి తీసుకోవాల్సిన [more]

Update: 2020-08-24 08:00 GMT

ఎన్నో ఆశ‌లు, ఆశ‌యాలు, ల‌క్ష్యాల‌తో అధికారాన్ని చేప‌ట్టిన సీఎం జ‌గ‌న్‌కు అధికార యంత్రంగా త‌ల‌నొప్పిగా మారిందా? వారు వ్యవ‌హ‌రిస్తున్న తీరుతో ప్రభుత్వం వేస్తున్న అడుగులు వెన‌క్కి తీసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్పడుతోందా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్రభుత్వానికి స‌రైన ద‌శ దిశ ఏర్పాటు చేసేది.. స‌రైన దిశ‌లో న‌డిపించేది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే. అయితే, జ‌గ‌న్ చుట్టూ ఉన్న అధికారులు, జిల్లాల్లో ఉన్న క‌లెక్టర్లు కూడా స్వామి భ‌క్తి ప‌రాయ‌ణులు అవుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. సీఎం జ‌గ‌నను మంచి చేసుకునేందుకు, ఆయ‌న మాట‌ను విన‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా పెట్టుకోవ‌డం మంచిదే అయినా.. న్యాయ ప‌ర‌మైన చిక్కులు రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల‌దే.

న్యాయపరమైన చిక్కులు….

అయితే, ఈ విష‌యంలో అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు జ‌గ‌న్‌ను మెప్పిస్తున్నా.. న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు మాత్రం చుట్టుముడుతున్నాయి. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియ మ‌ళ్లీ మొద‌టి వ‌చ్చే ప‌రిస్థితి ఏర్పడింది. దీనికి కార‌ణం ఎవరు? అధికారులే. విద్యాసంస్థల‌కు చెందిన భూముల‌ను, ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల‌కు కేటాయించిన భూముల‌ను కూడా అధికారులు పేద‌ల‌కు ఇళ్ల ప‌థ‌కం కోసం తీసేసుకున్నారు. దీనిపై తాజాగా హైకోర్టు స్టే విధించింది. అదే స‌మ‌యంలో ఎస్సీ వ‌ర్గాల‌పై పోలీసులే అనేక చోట్ల దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారు. దీనిపైనా హైకోర్టు మొట్టికాయ‌లేసింది. ఈ ప‌రిణామాలు నేరుగా సీఎంకు తెలిసి జ‌రిగిన‌వి కాదు.

సీఎంకు తెలిసి జరిగినవి కాకున్నా…..

అయిన‌ప్పటికీ.. ప్రభుత్వం నింద‌లు మోయాల్సి వ‌స్తోంది. పోనీ.. అధికారులు చెప్పింది సీఎం వినిపించుకోవ‌డం లేదా ? అంటే.. అదేమీ క‌నిపించ‌డం లేదు. అధికారులు ఏం చెప్పినా ఆయ‌న వింటున్నారు. నిధులు కావాల‌న్నా కేటాయిస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో ప‌ని ముగించేసి.. జ‌గ‌న్ ద‌గ్గర మెప్పు పొందాల‌ని భావిస్తున్న అధికారులు కొంద‌రు ఇలా న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు వ‌స్తాయ‌ని తెలిసినా.. ప‌నికానించేసి, చేతులు దులుపుకొంటున్నారు. ఫ‌లితంగా ప్రభుత్వానికి త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి. ఆవ భూముల విష‌యం తీసుకున్నా ఇదే ప‌రిస్థితి.

తెలియకుండా గ్యాప్…..

అదేవిధంగా రైతుల వ‌ద్ద ముందుగానే భూములు కొనేసి.. త‌ర్వాత ఇళ్ల ప‌థ‌కానికి అమ్ముకున్న కావ‌లి ఘ‌ట‌న‌లోనూ ఇదే తేలింది. ఇక మూడు నాలుగు జిల్లాల్లో క‌లెక్టర్లు మ‌నం ఈ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చెప్పేది విన‌వ‌స‌రం లేదు… నేరుగా సీఎం పేషీ నుంచి ఏం చేయాలో మ‌న‌కు ఆదేశాలు ఉన్నాయ‌ని ఓపెన్‌గానే చెపుతున్నారంటే ప్రజాప్రతినిధులంటే ఈ అధికారుల‌కు ఎంత చుల‌క‌న భావం ఉందో అర్థమ‌వుతోంది. మొత్తంగా చూస్తే.. అధికారులు వ్యవ‌హ‌రిస్తున్న తీరుతో జగన్ ప్రభుత్వం నింద‌లు మోయాల్సి రావ‌డం గ‌మ‌నార్హం. అదే స‌మ‌యంలో ప్రజ‌ల‌కు ప్రభుత్వానికి జ‌గ‌న్‌కు తెలియ‌కుండానే గ్యాప్ పెరుగుతోంది.

Tags:    

Similar News