జగన్ కెరీర్ ను ఫుల్లుగా స్టడీ చేసిన తర్వాత కూడా?

జగన్ అందుకే బీజేపీ పెద్దలకు నచ్చుతున్నాడు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీకి జగన్ పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంది అంటారు. జగన్ పదేళ్ల పొలిటికల్ కెరీర్ని పూర్తిగా [more]

Update: 2020-08-18 15:30 GMT

జగన్ అందుకే బీజేపీ పెద్దలకు నచ్చుతున్నాడు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీకి జగన్ పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంది అంటారు. జగన్ పదేళ్ల పొలిటికల్ కెరీర్ని పూర్తిగా అధ్యయనం చేసిన బీజేపీ జగన్ ని బ్లాక్ మెయిల్ ద్వారా కాకుండా మంచితనంతోనే దగ్గర చేసుకోవడానికి చూస్తోంది అన్నది నిజం. జగన్ కూడా మంచికే తగ్గుతారు కానీ ఎదురు వస్తే ఎంతకైనా అంటూ ముందుకు వెళ్తారు. దానికి కొండలాంటి కాంగ్రెస్ తో ఆయన‌ ఢీ కొన్న తీరే నిలువెత్తు నిదర్శనం. పదహాలు నెలలు జైలులో అయినా జగన్ కూర్చున్నారు కానీ కాంగ్రెస్ కి సరెండర్ అవలేదు. అలా అతి పెద్ద ఉదాహరణ కళ్ల ముందు ఉండగా బీజేపీ జగన్ తో ఒత్తిడి రాజకీయాలు చేస్తుందా..?

భయపడని నైజం….

ఏపీలో రెండు రకాల క్యారక్టర్లు ఉన్నాయి. చంద్రబాబు సీనియర్ మోస్ట్ లీడరే కానీ ఆయన ఏ వైపు గాలి వీస్తే ఆ వైపునకు బెండ్ అవుతారు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రెండేళ్ళ క్రితం మోడీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఇపుడు భజన చేస్తున్న బాబు పట్ల బీజేపీకి ఎందుకు సదభిప్రాయం ఉంటుంది. మరో వైపు తాను అనుకున్న దాని కోసం తెగించే జగన్ విషయంలో బీజేపీ కూడా ఆచీ తూచే వ్యవహరిస్తుంది. ఇక భయం అన్నదే ఎరగని క్యారక్టర్ జగన్ ది అయినపుడు, ఆయన మొండితనమే మొత్తం పొలిటికల్ కెరీర్ కి ఇంజన్ అయినపుడు దాన్ని టచ్ చేసి బీజేపీ బావుకున్నది ఏముంది. ఏపీలో టీడీపీ అనుకూల మీడియా సరదా తప్ప, జగన్ కి బీజేపీకి ఎందుకు చెడుతుంది. ఎక్కడ చెడుతుంది.

అదే వ్యూహమా…?

జగన్ బీజేపీల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే రెండు పార్టీలు బయటపడవు, ఇదీ అని విప్పి చెప్పవు. కానీ జరుగుతున్న పరిణామాలు గమనిస్తే చాలు కచ్చితమైన అంచనా దొరుకుతుంది. అదెలా అంటే జగన్ ప్రత్యేక హోదా విషయంలో మాట్లాడుతూ ఇపుడు అయితే కేంద్రంలో బీజేపీకి బలం ఉంది రేపు పరిస్థితి మారితే హోదాని అడిగి మరీ ఏపీకి న్యాయం చేస్తామని చెప్పుకొచ్చారు. అంటే జగన్ దృష్టిలో 2024లో మళ్ళీ బీజేపీ, మోడీ అధికారంలోకి వస్తారు, కానీ బీజేపీకి పూర్తి మెజారిటీ రాదు, అపుడు తన మద్దతుతోనే కేంద్రంలో బీజేపీ పవర్ లోకి వస్తుంది అన్నది జగన్ అంచనాగా ఉందంటారు.

బంధం గట్టిదే ….

బీజేపీ విషయంలో పొరుగున వున్న కేసీయార్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఆయన ఫెడరల్ ఫ్రంట్ పెట్టి బీజేపీని నెట్టేయగలమని అనుకుంటున్నారు. ఇక చంద్రబాబు ఇప్పటికైతే బీజేపీ అని బయటకు భజన చేస్తున్నా కాంగ్రెస్ లోకి రేపు దూకర‌ని గ్యారంటీ ఏమీ లేదు, కానీ జగన్ మాత్రం 2024లో కూడా బీజేపీనే వస్తుంది అని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఆయన 2024 ఎన్నికల తరువాత పరిణామాలను కూడా ఊహించగలుగుతున్నారు. ఇక జగన్ ఎపుడూ ఎక్కడా కాంగ్రెస్ విషయం ప్రస్తావించడంలేదు, పైగా ఫెడరల్ ఫ్రంట్ వంటివి కూడా జగన్ ని అంతలా ఆకట్టుకోని రాజకీయ ప్రయోగాలే అంటున్నారు. మొత్తానికి కేంద్రంలో మళ్లీ మోడీ వస్తారని, బీజేపీకి మద్దతు ఇచ్చి ముందుకు సాగాలన్నదే జగన్ ఆలోచనలుగా చెప్పుకోవాలి. మరి ఇవన్నీ బీజేపీకి తెలియకపోవు. అందుకే ఈ బంధం గట్టిది. మధ్యలో ఎవరి ఆనందం కోసం వారు వార్తలు వండి జగన్ కి జైలు, ఏపీలో బీజేపీ ఆపరేషన్ లాంటివి ప్రచారం చేసుకుంటే పోయేది వారి క్రెడిబిలిటీయే తప్ప మరేమీ కాదేమో.

Tags:    

Similar News