పరుగులు పెట్టిస్తూ కంగారు పుట్టిస్తున్నారే?

ఏడాదిలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీరు ప్రతిపక్షాలకు మింగుడు పడటం లేదు. అన్ని పథకాలను గ్రౌండ్ చేస్తూ వెళుతున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక దాదాపు నెలలో రెండు పథకాలను [more]

Update: 2020-08-23 02:00 GMT

ఏడాదిలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీరు ప్రతిపక్షాలకు మింగుడు పడటం లేదు. అన్ని పథకాలను గ్రౌండ్ చేస్తూ వెళుతున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక దాదాపు నెలలో రెండు పథకాలను జగన్ అమలు చేస్తుండటం కొంత విపక్షాలను కంగారు పుట్టిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో చిక్కుకున్నా పథకాల అమలు విషయంలో జగన్ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇప్పటికే దాదాపు మూడున్నర కోట్ల మందికి వివిధ రూపాల్లో పథకాలను అందచేశారు.

విరివిగా పథకాలతో…..

తాజాగా వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని కూడా అమలు చేశారు. ఈ పథకానికి వచ్చే నాలుగేళ్లలో ఇరవై వేల కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు. మరోవైపు దాదాపు ముప్ఫయి లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయనున్నారు. ఈ కార్యక్రమం కొంతకాలం వాయిదా పడినా త్వరలోనే తేదీని ప్రకటించే అవకాశముంది. న్యాయపరమైన చిక్కులు ఉండటంతో ఆగస్టు 15వ తేదీన జరగాల్సిన పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసింది ప్రభుత్వం.

నగదు పందేరం…..

మరోవైపు ప్రాజెక్టులను పరుగులు తీయిస్తున్నారు. పోతిరెడ్డి ప్రాజెక్టు విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని చెప్పడంతో జగన్ పార్టీకి సీమలో మరింత హైప్ రానుంది. ఏడాదికాలంగా అమలు పరుస్తున్న పథకాలు నిజంగానే విపక్షాలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. జగన్ అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం పందేరానికి దిగుతుండటాన్ని బయటకు విమర్శించలేక, తప్పుపట్టలేక విపక్షాలు ఇబ్బంది పడుతున్నాయి.

అభివృద్ధి ఏదీ అంటున్న…..

అయితే గత ఏడాదికాలంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు పూర్తిగా మందగించాయని, కనీసం గ్రామాల్లో సిమెంట్ రోడ్డు వేసే దిక్కులేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు మందగించాయని చెబుతున్నారు. ఇరవై ఏళ్ల ఏపీ అభివృద్ధిని జగన్ వెనక్కు నెట్టేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొత్తం మీద పైకి విమర్శలు చేస్తున్నా విపక్షాలు మాత్రం జగన్ సంక్షేమ పథకాల దూకుడును నోరెళ్ల బెట్టిచూస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో సంక్షేమ అజెండా మాత్రమే నడుస్తుంది. ఇది నిజంగా విపక్షాలకు మింగుడు పడని అంశమే.

Tags:    

Similar News