జగన్ని అడ్డుకుంటున్నది అందుకేనా ?

జగన్ కొన్ని మంచి పనులు చేస్తే ఇక జనంలో శాశ్వతంగా పేరు తెచ్చుకుంటారు. అంతే కాదు, చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి వాటిలో ముప్పయి లక్షల పట్టాల పంపిణీ [more]

Update: 2020-08-13 13:30 GMT

జగన్ కొన్ని మంచి పనులు చేస్తే ఇక జనంలో శాశ్వతంగా పేరు తెచ్చుకుంటారు. అంతే కాదు, చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి వాటిలో ముప్పయి లక్షల పట్టాల పంపిణీ ఒకటి. ఇది దేశంలోనే అతి పెద్ద కార్యక్రమం. దీన్ని కనుక చేస్తే జగన్ జాతీయ స్థాయిలోనే రికార్డు సృష్టిస్తారు. ఇక దీని వల్ల అన్ని వర్గాలకు చెందిన పేదలు కులం, మతం భేదం లేకుండా లబ్ది పొందుతారు. ఒక పట్టాకు నలుగురు వంతున కుటుంబ సభ్యులను తీసుకున్నా కూడా కోటీ ఇరవై లక్షల‌ మంది జగన్ వైపుగా చాలా సులువుగా మళ్ళుతారు. అందుకే ఈ పధకం విషయంలో ఇపుడు టీడీపీ అడ్డంకులు సృష్టిస్తోంది. ఈ పధకాన్ని జగన్ ఆర్భాటంగా మార్చి 25 అంటే ఉగాది పండుగ వేళ జరిపించాలనుకున్నారు. అయితే అప్పట్లో లోకల్ బాడీ ఎన్నికలు ప్రకటించారు.

అలా అడ్డు ….

ఇక నాడు లోకల్ బాడీ ఎన్నికలకు కరోనా పేరిట అడ్డు పడిపోయింది. నిజానికి అప్పటికి కరోనా లేకపోయినా ఎన్నికల కోడ్ చెప్పి టీడీపీ నేతలు ముందే పట్టాల పధకానికి అడ్డుపడ్డారు. ఆ తరువాత జగన్ అంబేద్కర్ జయంతి వేళ ఏప్రిల్ 14 కి ఈ కార్యక్రమం మార్చారు. కానీ అప్పటికి కరోనా ముమ్మరం కావడంతో అది కాస్తా జూలై 8న వైఎస్సార్ జయంతి వేళకు వెళ్ళిపోయింది. ఈ లోగా కోర్టు కేసులు కూడా పడ్డాయి. ఇక అక్కడ నుంచి ఆగస్ట్ 15 అనుకున్నారు. న్యాయ వివాదాల మూలంగా ఇళ్ళ పట్టాల వ్యవహారం అలాగే ఉండిపోయింది. దాంతో ఎపుడు ఇళ్ళ పట్టాలు ఇస్తారో తెలియడంలేదు. వైసీపీ వచ్చిన తరువాత సంక్షేమ పధకాలు పెద్ద ఎత్తున చేపట్టారు. వాటి విలువ ఇప్పటిదాకా యాభై వేల కోట్ల దాకా ఉంటుందని కూడా ప్రభుత్వం ప్రకటించింది.

మూడున్నర కోట్లు ….

ఈ విధంగా పధకాల ద్వారా లబ్ది పొందిన వారు ఏపీలో మూడున్నర కోట్ల మంది ఉంటారని కూడా సర్కార్ పెద్దలు లెక్కలు చెబుతున్నారు. అయితే సంక్షేమ పధకాల కంటే కూడా శాశ్వతంగా ఉండేలా ఇళ్ళ పట్టాల కార్యక్రమం ఉంది. దీని వల్ల ఎప్పటికీ వైసీపీ సర్కార్ ప్రభుత్వం, జగన్ పేద ప్రజానీకానికి గుర్తుండిపోతారని అంటున్నారు. ఇల్లు పొందిన వారికి జగనే దేవుడిగా కనిపిస్తారు. అందువల్ల ఈ పధకానికి మొదటి నుంచి టీడీపీ మోకాలడ్డుతూ కోర్టులలో కేసులు వేయిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

అదేనా ప్లాన్…….

వైసీపీ సర్కార్ అపుడే చూస్తూండగానే ఏడాదిన్నరకు చేరువ అవుతోంది. ఈ కరోనా వల్ల ఏమీ పనులు కావడంలేదు, ముఖ్యమంత్రి జగన్ సైతం తాడేపల్లి నివాసానికే బందీ అయిపోయారు. ఇలా చూస్తూ ఉంటే మరో ఏడాది కూడా ఇట్టే గడచిపోతుంది. ఈ లోగా వైసీపీ మీద జనాలలో వ్యతిరేకత పెరుగుతుంది. అపుడు ఏ రకమైన పధకాలు ఇచ్చినా పెద్దగా ప్రభావం ఉండదని టీడీపీ మార్క్ వ్యూహరచనకు పదును పెడుతున్నట్లుగా ఉంది. ఇలా కేసులు పెట్టి కొన్నాళ్ళు అడ్డుకుంటే జగన్ ఏమీ చేయలేకపోతున్నాడన్న సంకేతం జనంలోకి వెళ్తుందని, అపుడు యాంటీ ఇంకబెన్సీ పెరిగిన దాన్ని అనువుగా మార్చుకుంటే జగన్ ని ధీటుగా ఎదుర్కోవడం సాధ్యమని టీడీపీ ఆశపడుతోంది. అందుకే జగన్ ఇళ్ల పట్టాలే కాదు, ఇంగ్లీష్ మీడియం అన్నా, మరే కార్యక్రమం చేపట్టినా టీడీపీ తెలివిగా ముందర కాళ్ళకు బంధం వేస్తోంది అని అంటున్నారు, మరి జగన్ వీటిని ఎదుర్కొని ముందుకు సాగాలంటే దూకుడు కాదు, లౌక్యం కూడా ఉండాలి అని మేధావులు సలహా ఇస్తున్నారు.

Tags:    

Similar News