అమరావతి మన ఊపిరి తీయదంటున్న జగన్

వైఎస్సార్ సీపీ నేత‌ల్లో ఆస‌క్తిక‌ర విష‌యం చ‌ర్చగా న‌డుస్తోంది. ఇప్పటి వ‌ర‌కు జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న మూడు రాజ‌ధానుల నిర్ణయం చిన్నదేన‌ని, మున్ముందు ప్రతిప‌క్షాల‌ను ఉక్కిరి బిక్కిరి [more]

Update: 2020-08-14 06:30 GMT

వైఎస్సార్ సీపీ నేత‌ల్లో ఆస‌క్తిక‌ర విష‌యం చ‌ర్చగా న‌డుస్తోంది. ఇప్పటి వ‌ర‌కు జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న మూడు రాజ‌ధానుల నిర్ణయం చిన్నదేన‌ని, మున్ముందు ప్రతిప‌క్షాల‌ను ఉక్కిరి బిక్కిరి చేసే మ‌రిన్ని నిర్ణయాలు వెలువ‌డ‌తాయ‌ని అంటున్నారు. ఈ ప‌రిణామాల‌తో రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చకు అవ‌కాశం ఇచ్చింది. ప్రస్తుతం అమ‌రావ‌తి త‌ర‌లింపు అంశంపై ప్రతిప‌క్షాలు జోరుగా ఉద్యమిస్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై రెఫ‌రెండం పెట్టాల‌ని, ప్రజాతీర్పు కోరాల‌ని టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి డిమాండ్లు వ‌స్తున్నాయి. అయితే, ఈ విష‌యంపై వైఎస్సార్ సీపీ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోంది. కానీ, లోలోన మాత్రం దీనికి పెద్దగా వాల్యూ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు నేత‌లు.

రాబోయే రోజుల్లో….

రాబోయే మూడు నాలుగు మాసాల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు భిన్నంగా ఉండ‌బోతున్నాయ‌ని, అమ‌రావ‌తిని మించిన నిర్ణయాలు వ‌స్తాయ‌ని చెబుతున్నారు. దీనిలో కీల‌క‌మైన జిల్లాల విభ‌జ‌న ఉంద‌ని చెబుతున్నారు. అంత‌కు ముందే రెవెన్యూ డివిజ‌న్లు, మండ‌లాల విభ‌జ‌న కూడా ఉండ‌వ‌చ్చని అంటున్నారు. ఇది తెర‌మీదికి వ‌స్తే.. రాజ‌ధాని రాజ‌కీయం మ‌రుగున ప‌డుతుంద‌ని చెబుతున్నారు. జిల్లాల విభ‌జ‌న అంత తేలిక‌గా సాగ‌ద‌ని, ఇప్పుడున్న కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల స్వరూపం మారుతుంద‌ని, ముఖ్యంగా కీల‌క నేత‌ల‌కు రాజ‌కీయంగా ఇబ్బందులు త‌ప్పవ‌ని, మండ‌లాల విభ‌జ‌న కూడా సాగుతుంది కాబ‌ట్టి.. భారీ రాజ‌కీయ మార్పులకు అవ‌కాశం ఉంటుంద‌ని, దీంతో రాజ‌ధాని విష‌యం చిన్న విష‌యంగా మార‌డంతో పాటు ప‌క్కకు వెళ్లిపోతుంద‌ని అంటున్నారు.

ప్రాంతీయ మండళ్లు కూడా…

ఇక‌, మ‌రో కీల‌క విష‌యంగా ప్రాంతీయ మండ‌ళ్ల ఏర్పాటును చెబుతున్నారు పార్టీ నాయ‌కులు. ప్రాంతీయ మండ‌ళ్లను ఏర్పాటు చేయ‌డం ద్వారా ఆయా ప్రాంతాలను కీల‌క‌మైన అభివృద్ధి దిశ‌గా న‌డిపించేందుకు జ‌గ‌న్ దృష్టి పెడుతున్నార‌ని చెబుతున్నారు. ఇది రాజ‌కీయంగా కూడా పెను మార్పుల‌కు అవ‌కాశం ఇస్తుంద‌ని అంటున్నారు. ఈ రెండు అంశాల్లో ఒక‌టి ఇప్పటికే లైన్‌లో ఉంద‌ని, జిల్లాల ఏర్పాటుపై సీఎస్ నేతృత్వంలో క‌మిటీని కూడా నియ‌మించామ‌ని అంటున్నారు. ప్రాంతీయ మండ‌ళ్ల ఏర్పాటు విష‌యంపై ప్రస్తుతం క‌స‌ర‌త్తు సాగుతోంద‌ని, ఇది కూడా త్వర‌లోనే అమ‌ల్లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని, అప్పుడు రాజ‌ధాని విష‌యం దాదాపు ప‌క్కకు జ‌రిగిపోతుంద‌ని అంటున్నారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి రాజ‌ధాని మార్పును పెద్ద బూచీగా చూపించి ల‌బ్ధి పొందాల‌ని టీడీపీ చూస్తున్నా అప్పటి వ‌ర‌కు ఆ అంశం ఉండ‌ద‌ని.. కేవ‌లం రెండు జిల్లాల్లో టీడీపీ చేసే హ‌డావిడితో రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల‌న్నింటిలోనూ వైసీపీకి ల‌బ్ధి క‌లుగుతుంద‌ని కూడా వైసీపీ ధీమాతో ఉంది.

Tags:    

Similar News