ఫ్రైడే నే టీడీపీని ఫిక్స్ చేస్తున్నారు… సెంటిమెంట్ అయిందా?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తనను అవమానించిన వారిని ఎవరినీ వదలిపెట్టరన్న పేరుంది. అదే సమయంలో వైరి పక్షం వారిని ఇబ్బంది పెట్టడానికి ఆయన టార్గెట్ చేస్తున్న తీరు [more]

Update: 2020-08-05 05:00 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తనను అవమానించిన వారిని ఎవరినీ వదలిపెట్టరన్న పేరుంది. అదే సమయంలో వైరి పక్షం వారిని ఇబ్బంది పెట్టడానికి ఆయన టార్గెట్ చేస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. జగన్ విపక్ష నేతగా ఉన్నప్పుడు శుక్రవారం అని తెలుగుదేశం పార్టీ నేతలు గేలి చేసేవారు. శుక్రవారం వస్తే కోర్టు మెట్లు ఎక్కడం జగన్ కు అలవాటుగా మారిందని గతంలో అనేకసార్లు విమర్శలు చేశారు. జగన్ దానిని అప్పుడు తేలిగ్గా తీసుకున్నట్లే కన్పించినా అదే శుక్రవారం ఇప్పుడు ప్రత్యర్థి పార్టీకి చుక్కలు చూపిస్తుండటం విశేషం.

ప్రతి శుక్రవారం కోర్టుకు…..

జగన్ పై సీబీఐ కేసులు ఉన్నాయి. ప్రతి శుక్రవారం జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యేవారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పలుమార్లు కోర్టుకు హాజరయ్యారు. దీన్ని తెలుగుదేశం పార్టీ తమకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నించింది. శుక్రవారం పేరుతో జగన్ ను ఇరిటేట్ చేసింది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అదే శుక్రవారాన్ని తనకు అనుకూలంగా మలచుకుంటున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

అదే రోజు టార్గెట్….

శుక్రవారమే తెలుగుదేశం పార్టీ నేతలకు జగన్ సమాధానమిస్తున్నారు. నాడుశుక్రవారం అంటేనే వైసీపీ నేతల్లో అలజడి రేగేది. కానీ ఇప్పుడు శుక్రవారం సంబరాలు చేసుకుంటున్నాయి. జగన్ టీడీపీని టార్గెట్ చేస్తుంది శుక్రవారమే నన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఇది యాధృచ్ఛికంగా జరుగుతుందో? లేక కావాలని జరుగుతుందో కాని శుక్రవారమే జగన్ ప్రత్యర్థి పార్టీని ఫిక్స్ చేస్తున్నారు. శుక్రవారాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ముఖ్య సంఘటనలన్నీ…..

శుక్రవారమే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు. అదే రోజు మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఒక హత్య కేసులో అరెస్ట్ అయ్యారు. ఇక కీలకమైన మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కూడా గవర్నర్ శుక్రవారమే ఆమోదించారు. తనకు యాంటీ సెంటిమెంట్ గా ఉన్న శుక్రవారాన్ని జగన్ ఇప్పుడు తనకు అనుకూలంగా మార్చుకున్నారన్న కామెంట్స్ ఆ పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. మొత్తం మీద శుక్రవారం వస్తుందంటే టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మొత్తం మీద ప్రత్యర్థి పార్టీని ఫ్రైడే రోజే జగన్ ఫిక్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News