వంద సీట్లలో సైకిల్ గాలి తీసేసిన జగన్ ?

జగన్ కి ఏం రాజకీయం తెలుసు. ఇదీ చంద్రబాబు ఆలోచన. నిజంగా ఇదే రకమైన అహంకారంతోనూ చిన్న చూపుతోనే చంద్రబాబు మొదటి నుంచి కూడా జగన్ మీద [more]

Update: 2020-08-07 06:30 GMT

జగన్ కి ఏం రాజకీయం తెలుసు. ఇదీ చంద్రబాబు ఆలోచన. నిజంగా ఇదే రకమైన అహంకారంతోనూ చిన్న చూపుతోనే చంద్రబాబు మొదటి నుంచి కూడా జగన్ మీద రాజకీయం చేస్తూ వచ్చారు. ఫలితమేంటి అంటే బాబు అక్కడే ఉండిపోతే జగన్ మాత్రం ఎక్కడో ఎత్తున కూర్చున్నారు. ఇపుడు ఆయన అజేయుడుగా ఉన్నారు. ఆయన్ని ఓడించడం ఇపుడున్న పరిస్థితుల్లో బాబుకు, టీడీపీకి బహు కష్టమే అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా 2019లో తనకు లభించిన విజయాన్ని శాశ్వతం చేసుకోవడానికి జగన్ ఓ వైపు గట్టిగా కృషి చేస్తున్నారు. ఆ దిశగా ఆయన యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీ గెలవని సీట్లు ఏపీలో వంద వరకూ తయారు చేసేలా జగన్ వ్యూహాలు కొనసాగుతున్నాయి. అందులో నుంచి పుట్టుకొచ్చిందే మూడు రాజధానుల వ్యవహారం.

సీమలో నో ఛాన్స్……

రాయలసీమకు ప్రధాన కేంద్రమైన కర్నూలు కి న్యాయ రాజధానిని జగన్ ప్రకటించారు. అక్కడ 52 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో కూడా 35 దాకా వైసీపీకే అక్కడ వచ్చాయి. ఇక 2019 నాటికి ఆ సంఖ్య 49కి చేరుకుంది. ఇపుడు అక్కడ చంద్రబాబునే ఓడించడానికి జగన్ పధకం సిధ్ధం చేసి ఉంచారు. కుప్పంలో బాబు పార్టీ నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. అదే కనుక జరిగితే చంద్రబాబు వేరే సీటు చూసుకోవాలి. ఆపరేషన్ కుప్పం విషయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెగ బిజీగా ఉన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ద్వితీయ శ్రేణి నేతలను ఆయన వైసీపీ వైపుగా లాగేశారు. ఇక ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కూడా వైసీపీకి గట్టి పట్టు 2014 నుంచి కొనసాగుతోంది. ఇక్కడ కూడా 20కి పైగా సీట్లు ఉన్నాయి. వీటిలో కూడా పాగా వేయడమే కాదు, కంచుకోటలు చేసుకోవడానికి జగన్ పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు.

ఉత్త చేతులేనట…..

ఇపుడు ఉత్తరాంధ్రాకు వస్తే అక్కడ రాజధాని వస్తోంది. ఇక్కడ మూడు జిల్లాల్లో కలుపుకుని 34 సీట్లు ఉన్నాయి. వీటిలో ఆరు తప్ప అన్నీ వైసీపీ ఖాతాలో 2019లో పడ్డాయి. అంటే ఇక్కడ కచ్చితంగా పాతిక సీట్లు ఎప్పటికీ వైసీపీకి ఉండేలా ప్లాన్ చేస్తున్నారన్నమాట. ఈ విధంగా తీసుకుంటే వంద సీట్లో సైకిల్ గాలి పక్కాగా తీసేసే భారీ పొలిటికల్ స్కీం కే జగన్ తెరలేపారనుకోవాలి. ఇక ఉభయగోదావరి,కృష్ణా, గుంటూరు జిల్లాలు మిగిలాయి. ఇక్కడ 70 పైగా సీట్లు ఉన్నాయి. ఇందులో కూడా సగానికి సగం లాగేసేందుకు వైసీపీ వ్యూహం రూపకల్పన చేస్తోంది.

గోదాట్లో కలిపేస్తారా …?

నిజానికి ఈ నాలుగు జిల్లాలే కొంచెం కష్టమైన వ్యవహారం. ఇక్కడ గోదావరిజిల్లాల మీదనే జనసేన, బీజేపీ ఆశలు ఉన్నాయి. ఇక్కడే టీడీపీకి కొంత పట్టు ఉంది. అయితే ఇక్కడ కూడా టీడీపీని మటాష్ చేసే భారీ పధకాన్ని జగన్ రెడీ చేసి ఉంచారు. అంటే ఎపుడు ఎన్నికలు జరిగినా టీడీపీకి మొదట వంద సీట్ల మీద ఆశ ఉండదు, మిగిలిన 75లోనూ గట్టి పోటీతో మెజారిటీ సీట్లు వైసీపీ లాగేస్తే ఎప్పటికీ టీడీపీ పాతిక సీట్లకే పరిమితం అవుతుందన్న మాట. ఈ మాస్టర్ ప్లాన్లో మరో ట్విస్ట్ ఏంటి అంటే ఏపీలో కొత్త జిల్లాలు కూడా రాబోతున్నాయి. టీడీపీ బలమున్న చోటనే చూసి మరీ దెబ్బకొట్టేలా విభజన చేసేందుకు రంగం సిధ్ధం చేసి ఉంచారు. అవి కూడా ఏర్పాటు అయితే జగన్ రాజకీయం ముందు టీడీపీ చిత్తు చిత్తు కావాల్సిందేనని అంటున్నారు. చూడాలి మరి బాబు గారి జాతకమెలా ఉందో?

Tags:    

Similar News