జ‌గ‌న‌న్న షాక్‌ లు… ఈ ప‌థ‌కం కొంద‌రికి మాత్రమే

ఒక‌టా రెండా.. అనేక విష‌యాల్లో వైఎస్సార్ సీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఇస్తున్న షాకుల‌తో ప్రధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అధినేత చంద్రబాబుకు దిమ్మతిరుగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, [more]

Update: 2020-08-06 03:30 GMT

ఒక‌టా రెండా.. అనేక విష‌యాల్లో వైఎస్సార్ సీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఇస్తున్న షాకుల‌తో ప్రధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అధినేత చంద్రబాబుకు దిమ్మతిరుగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ఇదే విష‌యాన్ని అన్యాప‌దేశంగా ఒప్పేసుకుంటున్నారు టీడీపీ నాయ‌కులు కూడా! ఇక‌, వైఎస్సార్ సీపీ నాయ‌కుల‌ను ఈ విష‌యంపై క‌దిలిస్తే.. మేం ప‌లు ప‌థ‌కాల‌తో పాటు 'జ‌గ‌న‌న్న షాక్‌' అనే ప‌థ‌కాన్ని కూడా అమ‌లు చేస్తున్నామ‌ని, అయితే, ఇది కొంద‌రికి మాత్రమే వ‌ర్తిస్తుంద‌ని, ముఖ్యంగా రాజ‌కీయ ప్రత్యర్థుల కోస‌మే ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేప‌స్తున్నామ‌ని వారు చెబుతున్నారు.

వరసగా దెబ్బలు….

విష‌యంలోకి వెళ్తే.. జ‌గ‌న్ అదికారంలోకి వ‌చ్చిన ద‌గ్గర‌నుంచి చంద్రబాబుకు ప్రత్యర్థి పార్టీల‌కు కూడా నిజంగానే షాకిస్తున్నారు. చంద్రబాబు క‌ల‌లో కూడా ఊహించ‌ని విధంగా ప్రభుత్వ పాల‌న‌ను ప్రజ‌ల వ‌ద్దకు చేర‌వేసే వ‌లంటీర్ల వ్యవ‌స్థను తీసుకువ‌చ్చి.. కేంద్రంతోనూ శ‌భాష్ అని అనిపించుకున్నారు. క‌రోనా వైర‌స్ విజృంభిస్తోన్న సమ‌యంలో కేర‌ళ‌తో పాటు బెంగాల్ లాంటి రాష్ట్రాలు సైతం ఈ వ‌లంటీర్ల వ్యవ‌స్థ గురించి ఆరా తీశాయి. అటు త‌ర్వాత భారీ ఎత్తున ల‌క్షల సంఖ్యలో ఉద్యోగాలు క‌ల్పించి.. చంద్రబాబును మ‌రిపించేశారు. ఇక‌, మ‌ద్యం షాపుల‌ను ప్రభుత్వ ప‌రం చేసేసి మ‌రో షాకిచ్చారు. అదేస‌మ‌యంలో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా మ‌హిళ‌ల‌కు అన్ని నామినేటెడ్ ప‌ద‌వుల్లోనూ 50శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించి అంద‌రిని మురిపించారు.

రాజధాని అమరావతితో….

ఇలా ఒక‌దాని త‌ర్వాత ఒక షాక్ కాకుండా ఒక్కసారే షాకిచ్చిన సంద‌ర్భం.. ఏకంగా శాస‌న మండ‌లిని ర‌ద్దు చేయ‌డం. వ‌చ్చే రెండేళ్లలో మండ‌లిలో వైఎస్సార్ సీపీకి భారీ ఎత్తున మెజారిటీ వ‌స్తుంద‌ని తెలిసి కూడా జ‌గ‌న్ ఈ నిర్ణయం తీసుకోవ‌డం రాజ‌కీయ వ‌ర్గాల‌కు ఇచ్చిన భారీ షాక్‌. ఇక‌, అమ‌రావ‌తి విష‌యంలోనూ జ‌గ‌న్ ఇచ్చిన షాక్‌తో ఇప్పటి వ‌ర‌కు కోలుకోని చంద్రబాబుకు ఇప్పుడు గ‌వ‌ర్నర్ విశ్వ‌భూష‌ణ్ తీసుకున్న నిర్ణయంతో చ‌లీ జ్వరం వ‌చ్చేసింది. ఈ ప‌రిణామాల‌తో ఆయ‌న ముందుకు వెళ్లలేక‌.. వెన‌క్కి రాలేక త‌ర్జన భ‌ర్జన ప‌డుతున్నారు.

ఇంకెన్ని షాకులో…..

కానీ, తాను తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి త‌ప్పూలేన‌ప్పుడు తాను ఎందుకు వెనుక‌డుగు వేయాల‌ని భావిస్తున్న సీఎం జ‌గ‌న్‌.. తీసుకుంటున్న నిర్ణయాలు ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తుంటే.. చంద్రబాబు స‌హా కొంద‌రికి మాత్రం షాకిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏడాదిన్నర‌లోనే ఇన్ని షాకులిచ్చిన జ‌గ‌న్‌.. రాబోయే మూడున్నరేళ్లలో బాబుకు ఇంకెన్ని షాకులిస్తారో చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News