ఏడు ద‌శాబ్దాల ‘ క‌మ్మ ‘ రాజ‌కీయానికి జ‌గ‌న్ చెక్‌..?

ఏపీలో గ‌త ఎన్నికల‌కు ముందు జ‌గ‌న్ క‌మ్మ వ‌ర్గాన్ని టార్గెట్ చేసి ప‌దే ప‌దే ప్రచారం చేయ‌డంతో పాటు మిగిలిన సామాజిక వ‌ర్గాల్లో ఈ వ‌ర్గంపై వ్యతిరేక‌త [more]

Update: 2020-08-08 05:00 GMT

ఏపీలో గ‌త ఎన్నికల‌కు ముందు జ‌గ‌న్ క‌మ్మ వ‌ర్గాన్ని టార్గెట్ చేసి ప‌దే ప‌దే ప్రచారం చేయ‌డంతో పాటు మిగిలిన సామాజిక వ‌ర్గాల్లో ఈ వ‌ర్గంపై వ్యతిరేక‌త వ‌చ్చేలా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు. జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో తిరుగులేని ఘ‌న‌విజ‌యం సాధించి అధికారంలోకి రావ‌డానికి కార‌ణ‌మైన ఫ్యాక్టర్స్‌లో ఇది కూడా ఒక‌టి అన‌డంలో సందేహం లేదు. బాబు ఐదేళ్ల పాల‌న‌లో అన్నీ క‌మ్మ సామాజిక వర్గానికే అన్న నినాదాన్ని మిగిలిన వ‌ర్గాల ప్రజ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లారు. దీంతో మిగిలిన కులాల్లో చాలా వ‌ర‌కు క‌మ్మకులంపై ద్వేషం ర‌గిలింది. అయితే క‌మ్మ వ‌ర్గం ఆధిప‌త్యం గ‌త ఏడు ద‌శాబ్దాలుగా ఉన్న క‌మ్మ రాజ‌కీయానికి జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక పూర్తిగా చెక్ పెట్టేశారు. కృష్ణా జిల్లాలో ఈ వ‌ర్గం నుంచి కొడాలి నాని మంత్రిగా ఉన్న ఆయ‌న ఆధిప‌త్యం జిల్లాపై లేదు. ఇదే జిల్లా నుంచి పేర్ని నాని, వెల్లంప‌ల్లి శ్రీనివాస్ కూడా మంత్రులుగా ఉన్నారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా….

ఇక గుంటూరు జిల్లా రాజ‌కీయం అంటే గ‌త ఏడు ద‌శాబ్దాలుగా క‌మ్మ రాజ‌కీయ‌మే. ఇక తెలుగుదేశం అధికారంలో ఉంది అంటే ఈ జిల్లా నుంచి క‌మ్మ మంత్రి ఉండాల్సిందే. మాకినేని పెదర‌త్తయ్య, ఆల‌పాటి రాజా, ప్రత్తిపాటి పుల్లారావు, కోడెల శివ‌ప్రసాద‌రావు, అన్నాబ‌త్తుని స‌త్యనారాయ‌ణ‌, ధూళిపాళ్ల వీర‌య్య చౌద‌రి వీళ్లంతా మంత్రులు అయ్యారు. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆల‌పాటి ధ‌ర్మారావు, ఆల‌పాటి వెంక‌ట్రామ‌య్య, చేబ్రోలు హ‌నుమ‌య్య మంత్రులుగా ఇదే క‌మ్మ వ‌ర్గం నుంచి ఉన్నారు. ఇక రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కుటుంబం కాంగ్రెస్‌లో ఐదు ద‌శాబ్దాలుగా చ‌క్రం తిప్పి జిల్లా రాజ‌కీయాల‌ను శాసించి.. ఆ త‌ర్వాత టీడీపీలోకి వ‌చ్చింది.

ప్రయోగం సక్సెస్…..

గుంటూరు జిల్లాలో పార్టీల‌తో సంబంధం లేకుండా కొన‌సాగిన ఈ క‌మ్మ రాజ‌కీయానికి జ‌గ‌న్ పూర్తిగా చెక్ పెట్టేశారు. వాస్తవానికి 2014 ఎన్నిక‌ల్లో కూడా క‌మ్మల‌కు సీట్లు ఇచ్చిన పొన్నూరును గ‌త ఎన్నిక‌ల్లో కాపున‌కు, చిల‌క‌లూరిపేట‌ను బీసీల‌కు ఇచ్చి ప్రయోగం చేసి స‌క్సెస్ అయ్యారు. ఇక ఇప్పుడు జిల్లాలో ముగ్గురు క‌మ్మ ఎమ్మెల్యేలు మాత్రమే వైఎస్సార్‌సీపీ నుంచి ఉన్నారు. అలాగే నరసారావుపేట ఎంపీగా కమ్మ సామాజికవర్గానికి చెందిన లావు శ్రీకృష్ణదేవరాయలు విజయం సాధించగలిగారు. ఈ ముగ్గురు క‌మ్మ ఎమ్మెల్యేల‌తో పాటు ఎంపీ లావు కూడా రాజ‌కీయాల్లో చాలా జూనియ‌ర్లు. వీరంతా తొలిసారే అసెంబ్లీకి, లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఇప్పుడు జిల్లా రాజ‌కీయాల్లో వీరి మాట ఏ మాత్రం చెల్లుబాటు కావ‌డం లేదు. క‌నీసం జిల్లా స్థాయిలో త‌మ వ‌ర్గానికి చెందిన అధికారుల బ‌దిలీల విష‌యంలో కూడా వీరి సిఫార్సుల‌కు ప్రయార్టీ ఉండ‌డం లేద‌ట‌.

హమీ ఇచ్చినా…

ఇక గ‌త ఎన్నిక‌ల్లో సీట్లు త్యాగం చేసిన క‌మ్మ వ‌ర్గం మాజీ ఎమ్మెల్యేలు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, రావి వెంక‌ట‌ర‌మ‌ణ ఏదైనా నామినేటెడ్ ప‌ద‌వులు వ‌స్తాయోమోన‌ని వెయిట్ చేస్తున్నా జ‌గ‌న్ వీరిని పట్టించుకోవ‌డం లేదు. పైగా మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ను ఏకంగా ఎమ్మెల్సీతో పాటు మంత్రిని చేస్తాన‌ని హామీ ఇచ్చినా చివ‌ర‌కు ఎమ్మెల్సీకి కూడా గ‌తి లేదు. జిల్లా స్థాయిలో కీల‌క నామినేటెడ్ పోస్టుల్లో ఒక్క క‌మ్మ నేత కూడా లేరు. జిల్లాలో ప్రస్తుతం న‌లుగురు రెడ్డి ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీ నుంచి ఉన్నారు. వీరి ఆధిప‌త్యమే అక్కడ ఎక్కువుగా ఉంది. మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాలలో కాసు మహేశ్ రెడ్డి, నరసారావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు త‌మ‌దైన ముద్ర వేస్తుండ‌డంతో పాటు త‌మ సిఫార్సుల‌ను నెగ్గించుకుంటున్నారు.

ప్రయారిటీ లేక పోవడంతో…..

అస‌లే జ‌గ‌న్ క‌మ్మ వ‌ర్గానికి పెద్ద ప్రయార్టీ ఇవ్వడం లేద‌న్న ఆరోప‌ణ‌లు ఉంటే ఇప్పుడు జిల్లాలో ఉన్న ఈ న‌లుగురు ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా దూకుడుగా లేక‌పోవ‌డం ఈ వ‌ర్గానికి మ‌రింత మైన‌స్ అయ్యింది. ఇదే అద‌నుగా వైఎస్సార్‌సీపీ క‌మ్మ ఎమ్మెల్యేలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న వినుకొండలో జీవీ ఆంజనేయులు, పెదకూరపాడులో కొమ్మాలపాటి శ్రీధర్, తెనాలిలో ఆలపాటి రాజా పుంజుకుంటోన్న ప‌రిస్థితి. విచిత్రం ఏంటంటే ఈ ముగ్గురు కూడా క‌మ్మ ఎమ్మెల్యేలే.

Tags:    

Similar News