ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్ అవుతోందా?

అనుకున్నట్లుగానే జరుగుతుంది. పార్టీని బలోపేతం చేసేందుకు, ప్రత్యర్థి పార్టీని బలహీన పర్చేందుకు అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీకే దెబ్బతగిలేలా కన్పిస్తున్నాయి. చంద్రబాబును వీక్ చేయాలన్న [more]

Update: 2020-07-31 02:00 GMT

అనుకున్నట్లుగానే జరుగుతుంది. పార్టీని బలోపేతం చేసేందుకు, ప్రత్యర్థి పార్టీని బలహీన పర్చేందుకు అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీకే దెబ్బతగిలేలా కన్పిస్తున్నాయి. చంద్రబాబును వీక్ చేయాలన్న ప్రయత్నంలో జగన్ తన పార్టీని నియోజకవర్గాల్లో బలహీన పర్చుకుంటున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. పార్టీలోకి వచ్చిన కొత్త నేతలతో పాత నేతలు సర్దుకుపోలేక పోతున్నారు. ఫలితంగా నియోజకవర్గాల్లో గ్రూపులు మొదలయ్యాయి.

బలమైన ప్రభుత్వమైనా….

వైఎస్ జగన్ 151 మంది ఎమ్మెల్యేలతో బలంగా అధికారంలోకి వచ్చారు. తాను ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకోనని, చంద్రబాబులాగా వ్యవహరించనని అసెంబ్లీ సమావేశాల్లోనే చెప్పారు. తన పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాల్సిందేనని శాసనసభ సాక్షిగా చెప్పారు. అయితే ఎన్నికలు ముగిసి ఏడాది కాకముందే మళ్లీ ఎన్నికలకు ఎవరు సిద్దమవుతారు. అందుకే పార్టీకి అనఫిషియల్ గా మద్దతిచ్చేలా జగన్ కొత్త టెక్నిక్ ను కనిపెట్టారు. చంద్రబాబును మానసికంగా దెబ్బకొట్టేలా వ్యవహరించారు.

గన్నవరంలో వంశీకి…..

ఇప్పుడు మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుదారుగా నిలిచిపోయారు. ఆ మూడు నియోజకవర్గాల్లోనూ ఆధిపత్య పోరు నడుస్తుంది. గన్నవరం నుంచి వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీకి మద్దతునిచ్చారు. అయితే వల్లభనేని వంశీని అక్కడి వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు వ్యతిరేకిస్తున్నారు. గన్నవరంలో ఉప ఎన్నిక జరిగితే తనకే టిక్కెట్ ఇవ్వాలని ఆయన అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. దీంతో అక్కడి క్యాడర్ అయోమయంలో పడింది.

ఆ రెండు నియోజకవర్గాల్లోనూ…..

అలాగే చీరాల నియోజకవర్గంలోనూ అంతే. అక్కడ టీడీపీ నుంచి చేరిన కరణం బలరామ్ కు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు పడటం లేదు. వైసీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జి పదవి కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పెద్దలు అనేక సార్లు పంచాయతీ పెట్టినా కొలిక్కి రావడం లేదు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి కూడా అసంతృప్తుల నుంచి మినహాయింపు ఏమీ కాదు. ఆయన రాకను ఇక్కడి వైసీపీ నేతలు అంగీకరించడం లేదు. ఇలా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతో నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు తీవ్రమయ్యాయి. జగన్ పార్టీని బలోపేతం చేద్దామని లీడర్లను తీసుకువస్తే, అక్కడ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడం విశేషం. జగన్ స్వయంగా జోక్యం చేసుకుంటే తప్ప ఈ విభేదాలకు ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదు.

Tags:    

Similar News