జగన్ పొలిటికల్ లీడరే కాదు… ఫక్తు ఇండ్రస్ట్రియలిస్ట్

జగన్ లో రాజకీయ నాయకుడు ఉన్నాడు, అంతకంటే వ్యాపారవేత్త కూడా ఉన్నారు. ఆయన పూర్వాశ్రమంలో పారిశ్రామికవేత్త కావడంతో అభివృధ్ధిలో జగన్ మార్క్ మీద అందరికీ ఆసక్తి ఎక్కువగానే [more]

Update: 2020-07-30 06:30 GMT

జగన్ లో రాజకీయ నాయకుడు ఉన్నాడు, అంతకంటే వ్యాపారవేత్త కూడా ఉన్నారు. ఆయన పూర్వాశ్రమంలో పారిశ్రామికవేత్త కావడంతో అభివృధ్ధిలో జగన్ మార్క్ మీద అందరికీ ఆసక్తి ఎక్కువగానే ఉంది. ఒక పారిశ్రామికవేత్తకు ఏం కావాలో జగన్ కి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఇక ఆయన మంత్రివర్గ సహచరుడు మేకపాటి గౌతంరెడ్డి కూడా మంచి వ్యాపారవేత్త. వారికి ఏపీ మొత్తం మీద నచ్చిన సిటీ విశాఖ. అందుకే అక్కడే జగన్ రాజధాని అన్నారు. ఇపుడు రాజధాని హంగులతో పాటు అభివృధ్ధిని కూడా విశాఖ కేంద్రంగా చేయాలని మాస్టర్ ప్లాన్ రూపొందించారు.

అన్నీ కలుపుతూ …..

ఉత్త్తరాంధ్ర అంతా పూర్తి వెనకబడి ఉంది. ఇక్కడ ఒక్క విశాఖ సిటీ తప్ప మిగిలినవి అన్నీ కూడా చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. ఆ సంగతి తెలిసినా కూడా గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదు. జగన్ మాత్రం విశాఖనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలనుకుంటున్నారు. దాంతో పాటుగా సరికొత్త నగరాన్నే ఆయన తయారు చేస్తున్నారు. దాని కోసం విశాఖ మెట్రోపాలిటన్ రీజిన డెవలప్మెంట్ అధారిటీ ద్వారా మూడు జిల్లాలకు కలిపే అభివృధ్ధి ప్రణాళికలు ఇపుడు రూపొందిస్తున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం మధ్యలో భోగాపురం ఉంది. అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం వస్తోంది. దాంతో దాన్నే కేంద్రంగా చేసుకుని ప్రగతి గతి మార్చాలన్నది వైసీపీ సర్కార్ ఎత్తుగడగా కనిపిస్తోంది.

కాన్సెప్ట్ సిటీగా…

భోగాపురం లో నిర్మిస్తున్న విమానాశ్రయం మూడేళ్ళ లోపు పూర్తి అవుతుంది. దాన్ని జీఎమ్మార్ కే జగన్ సర్కార్ కూడా అప్పగించింది. అయితే గతంలో మూడు వేల ఎకరాల్లో దీన్ని నిర్మించాలనుకుంటే ఇపుడు అయిదు వందల గజాలు ప్రభుత్వం తగ్గించి తన వద్ద ఉంచుకుంది. దాన్ని కాన్సెప్ట్ సిటీగా అభివృధ్ధి చేయాలన్నది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. దానికి మరో వేయి ఎకరాలు భూములను సేకరించి ఐటీ సహా అన్ని రకాలైన అభివ్రుధ్ధి ప్రాజెక్టులను అక్కడ పోగు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ కాన్సెప్ట్ సిటీని ఇటు విశాఖ తో పాటు, అటు విజయ‌నగరం, శ్రీకాకుళం జిల్లాలకు లింక్ అప్ చేయడం ద్వారా మూడు జిల్లాల్లో దీని ఫలాలు అందాలని కూడా ఆలోచన చేస్తున్నారు.

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా …..

ఇక విశాఖ లో ఖాళీగా ఉన్న భూముల్లో సచివాలయం నిర్మాణం చేపట్టాలని కూడా ప్రతిపాదిస్తున్నారు. అలాగే సచివాలయం సిబ్బందికి నివాసాలు, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్. ఇతర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు సిధ్ధం చేశారు. అదే సమయంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉంచి విశాఖ వరకూ కలుపుతూ 120 కిలోమీటర్ల దూరంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని కూడా తలపెడుతున్నారు. ఈ మొత్తం పనులకు ముఖ్యమంత్రి జగన్ తొందరలోనే శ్రీకారం చుడతారని మంత్రి అవంతి శ్రీనివాస్ చెబుతున్నారు. అన్ని ప్రాంతాలు అభివ్రుధ్ధి చెందాలన్నది తన ఆలోచన అని, ప్రాంతీయ తత్వం చెలరేగకుండా చూడడంతో పాటు ప్రగతి ఫలాలు అంతా అనుభవించలన్నదే జగన్ ఆలోచనగా మంత్రి చెప్పుకొస్తున్నారు. మొత్తానికి మరో నాలుగేళ్ళ వ్యవధిలో విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాల రూపు రేఖలు పూర్తిగా మారుతాయని వైసీపీ మంత్రులు నమ్మకంగా చెబుతున్నారు.

Tags:    

Similar News