కళింగ యుద్ధంలో ప్లాన్ పక్కాగానే ఉంది

కళింగ సీమ అని కూడా శ్రీకాకుళానికి పేరు. ఒడిషా అంచుల్లో ఉన్న జిల్లా కావడంతో పాటు, ఒకపుడు ఆ ప్రాంతాలు అన్నీ కూడా ఇందులోనే ఉండేవి. ఈ [more]

Update: 2020-07-30 00:30 GMT

కళింగ సీమ అని కూడా శ్రీకాకుళానికి పేరు. ఒడిషా అంచుల్లో ఉన్న జిల్లా కావడంతో పాటు, ఒకపుడు ఆ ప్రాంతాలు అన్నీ కూడా ఇందులోనే ఉండేవి. ఈ జిల్లాల్లో కాళింగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. రాజకీయంగా వారు ఆధిపత్యాన్ని ఇపుడు కోరుకుంటున్నారు. బీసీలంటే వెలమలు మాత్రమేనని టీడీపీ అధినేత చంద్రబాబు సొంత రాజ్యాంగం రాశారు. ఆ వెలమల్లోనూ కింజరాపు కుటుంబమే అసలైన వారు అని కూడా బాబు ముద్ర వేశారు. దాంతో చంద్రబాబు హయాంలో బాగుపడింది వారేనని అంటారు. ఇక కాంగ్రెస్ నుంచి కాళింగులకు రాజకీయ ప్రాధ్యాన్యత ఎక్కువగా ఉన్నా బాబు మధ్యలో వచ్చి నెట్టేశారని ఆ వర్గాలకు గుర్రు. ఇపుడు జగన్ వారిని బాగానే చేరేదీస్తున్నారు అంటున్నారు.

కిల్లికి హామీ……

శ్రీకాకుళం నుంచి కాళింగులకు పెద్ద దిక్కుగా ఉన్న ప్రముఖ వైధ్యురాలు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి 2022 నాటికి రాజ్యసభ టికెట్ ఖాయమని జగన్ నుంచి కచ్చితమైన హామీ ఉందిట. ఆమె స్థాయిని తగినట్లుగా గౌరవిస్తానని జగన్ చెప్పారంటున్నారు. అదే సమయంలో 2024 నాటికి శ్రీకాకుళం పార్లమెంట్ సీటుని కచ్చితంగా గెలిపించాలని కూడా ఆమెను ఆదేశించారట. ఆమెని ఇపుడు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలిగానే కాకుండా పార్లమెంట్ ఇంచార్జిని కూడా చేశారు. దాంతో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహననాయుడుకు గట్టి చెక్ పడినట్లేనని చెబుతున్నారు.

బాబాయ్ కి అలా….

మరో వైపు శ్రీకాకుళంలో వరసగా గెలుస్తున్న అచ్చెన్నాయుడుని ఈసారి అసెంబ్లీ గేట్ దగ్గరే ఆపాలని కూడా జగన్ పట్టుదలగా ఉన్నారు. దాంతో నిన్నటివరకూ పార్లమెంట్ ఇంచార్జిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ని తెచ్చి అచ్చెన్న ఎమ్మెల్యే సీటు అయిన టెక్కలికి వైసీపీ ఇంచార్జిని చేశారు. ఇకపైన దువ్వాడ శ్రీని వాస్ టెక్కలి అనధికార ఎమ్మెల్యే అన్న మాట. అభివృధ్ధి పనులన్నీ కూడా ఆయన చేతుల మీదుగానే జరుగుతాయి అన్న మాట. దువ్వాడకే నిజానికి 2019 ఎన్నికల్లో టెక్కలి టికెట్ ఇవ్వాలి. కానీ అక్కడ ఇంచార్జిగా ఉన్న పేడాడ తిలక్ పట్టుబట్టడంతో దువ్వాడనుఎంపీ అభ్యర్ధిగా పంపారు. ఇపుడు ఆయనకే జగన్ 2024 నాటికి టెక్కలి టికెట్ కంఫర్మ్ చేసినట్లే చెబుతున్నారు. అచ్చెన్నను ఓడించడానికి వైసీపీలో ముగ్గురు కీలక కాళింగనేతలు ఒక్కటి కావాలి. అలా కిల్లి, దువ్వాడ, పేడాడల మధ్యన సఖ్యత పెంచుతూ వారికి పదవుల పంపిణీని కూడా జగన్ పూర్తి చేసారని అంటున్నారు.

పేడాడకే పోస్ట్ …

ఇక పేడాడ తిలక్ వైసీపీకి వీర విధేయుడు. ఆస్తులు తగులబెట్టుకుని మరీ పార్టీ కోసం పాటుపడుతున్న నేత. వైసీపీలో కొందరి పెద్దలు దెబ్బేయడంతో ఆయన గెలుపు అంచుల నుంచి చివరి నిముషంలో టెక్కలిలో అచ్చెన్న మీద ఓటమిపాలు అయ్యారు. ఈ విషయాలు అన్నీ జగన్ కి తెలుసు కాబట్టే ఆ వెన్నుపోటు పెద్ద మనుషులకు ఏ పదవీ ఇవ్వకుండా అలా గాలిలో ఉంచారని కూడా అంటున్నారు. ఇపుడు తిలక్ కి కాళింగ కార్పొరేషన్ చైర్మన్ పదవిని జగన్ ఖాయం చేసి పెట్టారని అంటున్నారు. ఎమ్మెల్యే స్థాయి కలిగిన ఈ పోస్టులో తిలక్ కుదురుకుంటే రాజకీయంగా కూడా వైసీపీకి మేలు జరుగుతుంది అంటున్నారు. మొత్తానికి జగన్ పక్కా ప్లాన్ తోనే సిక్కోలు జిల్లా రాజకీయాలను నడిపిస్తున్నారని అంటున్నారు. అటు కింజరాపు కుటుంబం మళ్ళీ తలెత్తి నిలబడకుండా చేయడంతో పాటు, ఇటు సొంత పార్టీలో కొమ్ములు పెంచుకున్న మాజీ మంత్రి ఒకరిని కూడా సైడ్ చేయడం జగన్ మార్క్ పాలిటిక్స్ అంటున్నారు. ఇది కనుక ఫలిస్తే కింజరాపు కుటుంబానికి రాజకీయంగా పెద్ద దెబ్బ పడుతుంది, కళింగ యుధ్ధంలో అసలైన విజేత జగన్ అవుతారని చెబుతున్నారు.

Tags:    

Similar News