వావ్… జగన్ వి కాపీ కొడుతున్నారే

రాష్ట్రంలో సంచ‌ల‌న విజ‌యం సాధించి 151 మంది ఎమ్మెల్యేల‌తో అధికారాన్ని అప్రతిహ‌తంగా చేజిక్కించుకుని అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ అధినేత జ‌గ‌న్ ఒక‌ప‌క్క రాష్ట్రాభివృద్ధి, మ‌రోప‌క్క, ప్ర‌జ‌ల సంక్షేమానికి [more]

Update: 2019-11-30 15:30 GMT

రాష్ట్రంలో సంచ‌ల‌న విజ‌యం సాధించి 151 మంది ఎమ్మెల్యేల‌తో అధికారాన్ని అప్రతిహ‌తంగా చేజిక్కించుకుని అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ అధినేత జ‌గ‌న్ ఒక‌ప‌క్క రాష్ట్రాభివృద్ధి, మ‌రోప‌క్క, ప్ర‌జ‌ల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు దాదాపు రెండేళ్లపాటు నిర్వహించిన పాద‌యాత్ర స‌మ‌యంలో జ‌గ‌న్ ప్రజ‌లకు ఇచ్చిన న‌వ‌ర‌త్నాల హామీల‌ను అమ‌లు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్న విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగానే అమ్మ ఒడి, రైతు భ‌రోసా, వాహ‌న మిత్ర‌, ఆరోగ్య శ్రీ, నాణ్యమైన బియ్యం, పింఛ‌న్ల పెంపు వంటి అంశాల‌పై దృష్టి పెట్టారు. వాటి అమ‌లుకు దీర్ఘకాలిక ప్రణాళిక‌లు వేసుకుని ముందుకు సాగుతున్నారు.

పలు పథకాలతో…..

ఇక‌, వీటితోపాటు హామీ రూపంలో ఇచ్చిన వాటిని కూడా జ‌గ‌న్ నెర‌వేరుస్తున్నారు. గ్రామీణ వ్యవ‌స్థ రూపు రేఖ‌ల‌ను, గ్రామీణ రాజ‌కీయాల గుత్తాధిప‌త్యాన్ని కూడా ఆయ‌న రూపు మాపుతూ.. స‌చివాల‌య వ్యవ‌స్థకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠ‌శాల‌ల‌ను బ‌లోపేతం చేసేందుకు మాధ్యమాన్నే మారుస్తున్నారు. అవినీతిపై పోరాటం చేస్తున్నారు. లంచాల‌కు చెక్ పెడుతున్నారు. దీంతో జ‌గ‌న్ పేరు ఒక్క మ‌న రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని ప‌లు రాష్ట్రాల్లోనూ మార్మోగుతోంది.

తమిళనాడులోనూ….

మ‌రో ఏడాదిలో ఎన్నిక‌ల‌కు వెళ్లనున్న త‌మిళ‌నాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోనూ ఏపీలో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాల‌పై దృష్టి పెడుతున్నారు. నిజానికి త‌మిళ‌నాడు రాష్ట్రంలో అమ‌లవుతున్న అమ్మ కాంటీన్లను అంద‌రూ కాపీ కొట్టారు. ఇది ఒక్కటే కాకుండా అనేక కార్యక్రమాల‌ను కూడా ఇక్క‌డ అమ‌లవుతున్న వాటిని ఇత‌ర రాష్ట్రాల్లో అమ‌లు చేస్తున్నారు. కానీ, ఇప్పుడు జ‌గ‌న్ అమలు చేస్తున్న అమ్మ ఒడి, గ్రామ స‌చివాల‌యాలు, ఆరోగ్య శ్రీ వంటి వాటిపై త‌మిళ‌నాడు అధికార పార్టీ అన్నా డీఎంకే దృష్టి పెట్టింది. వీటిపై అధ్యయ‌నానికి ఇప్పటికే ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన బృందం అమ‌రావ‌తికి వ‌చ్చింది.

పశ్చిమ బెంగాల్ లోనూ…..

వీటి అమ‌లు తీరును ప‌రిశీలించి త‌మిళ‌నాడులోనూ ఎన్నిక‌లకు ముందు ప్రక‌టించాల‌ని చూస్తున్నారు. అదేవిధంగా ప‌శ్చిమ బెంగాల్‌లో వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ క్రమంలో అక్కడి నుంచి కూడా రైతు భ‌రోసా కార్యక్రమం అధ్యయ‌నానికి తృణ‌మూల్ ఎంపీలు న‌లుగురు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. మొత్తంగా జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్యక్ర‌మాలు .. ఒక్క రాష్ట్రంలోనే కాకుండా ప‌క్క రాష్ట్రాల‌పైనా ప్రభావం చూపుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News