ఒక‌రికి న్యాయం చేస్తే.. మ‌రో నేత వెయిటింగ్‌.. ఎలా?

రాజ‌కీయాల‌న్నాక‌.. ఏదో ఒక స‌మ‌స్య పార్టీల‌కు ఎదుర‌వుతూనే ఉంటుంది. ఇక‌, అధికార పార్టీ అంటే కూడా ఇదే త‌ర‌హా స‌మ‌స్య ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి స‌మ‌స్యే అధికార [more]

Update: 2020-07-22 02:00 GMT

రాజ‌కీయాల‌న్నాక‌.. ఏదో ఒక స‌మ‌స్య పార్టీల‌కు ఎదుర‌వుతూనే ఉంటుంది. ఇక‌, అధికార పార్టీ అంటే కూడా ఇదే త‌ర‌హా స‌మ‌స్య ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి స‌మ‌స్యే అధికార వైఎస్సార్ సీపీలోనూ క‌నిపిస్తోంది. గత ఏడాది ఎన్నికల స‌మ‌యంలో అనేక మంది పార్టీ సీనియ‌ర్లు.. పార్టీ అధినేత జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు పోటీ నుంచి తప్పుకొన్నారు. అయితే, పార్టీ కోసం వారు కొన్ని ద‌శాబ్దాలుగా ప‌ని చేస్తున్నారు. పార్టీ ప‌ట్ల, పార్టీ అధినేత జ‌గ‌న్ ప‌ట్ల వారికి ఎంతో అభిమానం ఉంది. ఆయ‌న గీసిన గీత‌ను జ‌వదాట‌లేదు. ఈ క్రమంలోనే ఆయ‌న ఆదేశంతో పోటీ నుంచి త‌ప్పుకొన్నప్పటికీ.. ఆయా స్థానాల్లో జ‌గ‌న్ అవ‌కాశం ఇచ్చిన వారి గెలుపున‌కు కృషి చేశారు.

ఇద్దరూ జగన్ హామీతో…

ఈ సంద‌ర్భంలోనే అలా త‌మ సీట్లను త్యాగం చేసిన సీనియ‌ర్లకు జ‌గ‌న్ రాజ‌కీయంగా ప‌ద‌వులు ఇస్తాన‌ని, ఎమ్మెల్సీలుగా ప్రమోట్ చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇలాంటి వారిలో గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు నాయ‌కులు ఉన్నారు. ఇద్దరూ ఓసీ వ‌ర్గానికి చెందినవారే. వీరిలో ఒక‌రు జ‌గ‌న్ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌తో పాటు ఆయ‌న‌కు అత్యంత స‌న్నిహితులు. ఇప్పటి వ‌ర‌కు కూడా జ‌గ‌న్ ఈ ఇద్దరికీ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెర‌వేర‌లేదు. అయినా ఎక్కడా అసంతృప్తికి తావు లేకుండా ఇద్దరు నాయ‌కులు ఎదురు చూస్తున్నారు. ఈ ఇద్దరు నేత‌లే చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే క‌మ్మ వ‌ర్గానికి చెందిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌. గుంటూరు జిల్లా వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నేత లేళ్ల అప్పిరెడ్డి. వీరిద్దరిలో మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే జ‌గ‌న్ ఎమ్మెల్సీతో పాటు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని హామీ ఇచ్చారు.

ఆ పదవి ఇస్తానన్నా….

జ‌గ‌న్ సీఎం అయ్యి ప‌దిహేను నెల‌లు అవుతున్నా మ‌ర్రికి ఇప్పటి వ‌ర‌కు ఏ ప‌ద‌వి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీల భ‌ర్తీలో మ‌ర్రికి ప‌ద‌వి ఖాయ‌మైంద‌న్న టాక్ వైసీపీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఇక‌, లేళ్ల అప్పిరెడ్డి విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న‌ను ఎమ్మెల్సీ చేస్తాన‌ని చెప్పారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గుంటూరు వెస్ట్ సీటును బీసీ వ‌ర్గానికి చెందిన చంద్రగిరి యేసుర‌త్నంకు ఇచ్చారు. ఈ క్రమంలోనే అప్పిరెడ్డికి ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పారు. అప్పిరెడ్డి జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడు… కొద్ది రోజుల క్రితం గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ ప‌ద‌వి ఆయ‌న‌కు ఇస్తాన‌ని చెప్పినా త‌న‌కు మాత్రం ఎమ్మెల్సీయే కావాల‌ని అప్పిరెడ్డి ప‌ట్టుబ‌ట్టారు.

పదేళ్ల నిరీక్షణ….

ఇప్పుడు జ‌రుగుతున్న ప్రచారం మేరకు సీనియ‌ర్ నాయ‌కుడు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని తెలుస్తోంది. ఇదే నిజ‌మైతే.. మంచిదే.. ఆయ‌న ఏడాదిన్నర నిరీక్షణ ఫ‌లించింద‌నే చెప్పా లి. ఇక‌, మిగిలింది లేళ్ల అప్పిరెడ్డి ఈయ‌న ప‌రిస్థితి ఏంటి ? చట్టస‌భ‌ల‌కు వెళ్లాల‌న్న అప్పిరెడ్డి ప‌దిహేనేళ్ల కోరిక ఇప్పట‌కి అయినా నెర‌వేరేనా ? జ‌గ‌న్ అప్పిరెడ్డికి ఎప్పట‌కి న్యాయం చేస్తారో ? చూడాలి.

Tags:    

Similar News