జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా ఇబ్బందేనట

తాజాగా వ‌స్తున్న వార్తలు, విశ్వస‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం వైఎస్సార్ సీపీకి చెందిన కీల‌క నాయకుడు, వైఎస్ కుటుంబానికి స‌న్నిహితుడు, సీనియ‌ర్ నేత‌, గుంటూరు జిల్లా చిల‌కలూరి [more]

Update: 2020-07-20 02:00 GMT

తాజాగా వ‌స్తున్న వార్తలు, విశ్వస‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం వైఎస్సార్ సీపీకి చెందిన కీల‌క నాయకుడు, వైఎస్ కుటుంబానికి స‌న్నిహితుడు, సీనియ‌ర్ నేత‌, గుంటూరు జిల్లా చిల‌కలూరి పేట‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు సీఎం జ‌గ‌న్‌.. ఎమ్మెల్సీ పీఠం ఇస్తున్నార‌ని. ఇక‌, దీనిని వైఎస్సార్ సీపీ అనుకూల వ‌ర్గాలు భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటున్నాయి. పార్టీ నాయ‌కులు కూడా జ‌గ‌న్ విశ్వస‌నీయత త‌కు మారుపేరు.. ఆయ‌న మ‌డ‌మ తిప్పరు అంటూ.. ఊద‌ర‌గొడుతున్నారు. జ‌గ‌న్‌ను ఒక‌ర‌కంగా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మంచిదే.. జ‌గ‌న్ గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు హామీ ఇచ్చారు.

తనను నమ్ముకున్న మర్రిని…..

చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల్సిన మ‌ర్రిని, చివ‌రి నిముషంలో ప‌క్కన పెట్టిన నేప‌థ్యంలో ఆయ‌న‌కు ఎమ్మెల్సీ స‌హా మంత్రి పోస్టు ఇస్తామ‌న్నారు. ఆ సీటును అప్పటిక‌ప్పుడు టీడీపీ నుంచి వ‌చ్చిన విడ‌ద‌ల ర‌జ‌నీకి క‌ట్టబెట్టారు. సీటు త్యాగం చేసిన రాజ‌శేఖ‌ర్‌కు బ‌హిరంగ ఎన్నిక‌ల ప్రచారంలో జ‌గ‌న్ చిల‌క‌లూరిపేట సాక్షిగా ఎమ్మెల్సీతో పాటు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పారు. అయితే, ఇప్పుడు దానిని నెర‌వేరుస్తున్నార‌ని, జ‌గ‌న్ వంటి విశ్వస‌నీయ‌త ఉన్న నాయ‌కుడు లేర‌నే ప్రచారం జ‌రుగుతోంది. ఒక‌వేళ‌.. జ‌గ‌న్ చేస్తున్నది నిజ‌మే అయితే.. అంటే.. మ‌ర్రికి క‌నుక ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తే.. అది త‌న విశ్వస‌నీయ‌త‌ను జ‌గ‌న్ దులి పేసుకోవ‌డ‌మే త‌ప్ప మ‌రొక‌టి కాద‌నే వారు కూడా సొంత పార్టీలోనే ఉన్నారు.

రద్దయ్యే మండలికి….

కేవ‌లం ఇది ఏదో మాట ఇచ్చాను కాబ‌ట్టి.. తీర్చేసుకున్నాను..అనే మొక్కుబ‌డి వ్యవ‌హారం అవుతుంద‌ని చెబుతున్నారు. ఎందుకంటే.. శాస‌న‌మండ‌లిని ర‌ద్దు చేయాల‌ని తీర్మానం చేసింది జ‌గ‌న్ స‌ర్కారే. ఈ అంశం కేంద్రానికి కూడా పంపారు. ఈ క్రమంలోనే మండ‌లి నుంచి మంత్రులుగా ఉన్న బోసు, మోపిదేవిల‌ను తొల‌గించి.. ఎంపీలుగా రాజ్యస‌భ‌కు పంపేశారు. అంటే.. మండ‌లి ర‌ద్దు అనేది ఖాయం. మ‌రి అలాంటి ర‌ద్దయ్యే మండ‌లికి.. త‌న టికెట్‌ను సైతం త్యాగం చేసిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ను పంప‌డం ఏమేర‌కు విశ్వస‌నీయ‌త ‌? అన్న ప్రశ్న ఉత్పన్నమ‌వుతోంది. ఇక‌ ర‌ద్దవుతుందో తెలియ‌ని మండ‌లి సీటును మ‌ర్రి తీసుకున్నా మండ‌లి ర‌ద్దయితే ఆయ‌న‌కు మళ్లీ ఇబ్బందే అవుతుంది.

మంత్రిని చేస్తానని హామీ ఇచ్చి….

ఇక‌, జ‌గ‌న్ ఇచ్చిన మ‌రోహామీ మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు త‌న ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత‌.. మంత్రి ప‌ద‌వి ఇస్తానని, ఇప్పటి వ‌రకు ఆ ఊసు లేదు. ఇక ఇప్పుడు మండ‌లికి పంపిస్తార‌నే ప్రచారం జ‌రుగుతున్న క్రమంలో.. ఆయ‌న‌ను మంత్రిగా తీసుకుంటారా? అనే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. ఇది సాధ్యమ‌య్యే ప‌నికాదు. ఎందుకంటే.. ఇప్పటికే మండ‌లి నుంచి మంత్రులుగా ఉన్న ఇద్దరిని ప‌క్కకు త‌ప్పించి రాజ్యస‌భ‌కు పంపారు. అంటే ర‌ద్దయ్యే మండ‌లి అనే క‌దా! మ‌రి అలాంటిస‌మ‌యంలో మ‌ర్రికి ఎలా ఛాన్స్ ఇస్తారు? ఇప్పుడు మండ‌లికి పంపినా.. మంత్రిగా ఆయ‌న ను ప్రమోట్ చేసే అవ‌కాశం లేదు మొత్తంగా మ‌ర్రి విష‌యంలో జ‌గ‌న్ ఏం చేసినా.. ఆయ‌న‌ను సంతృప్తి ప‌ర‌చ‌గ‌ల‌రేమో కానీ, ఇచ్చిన హామీని సంపూర్ణంగా నెర‌వేర్చుతారా ? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News