జగన్ ను టచ్ చేయడం కూడా కష్టమేనా?

జగన్ ఏపీలో భారీ పారామీటర్ పెట్టేశారు. మరో మాటలో చెప్పాలంటే ఆకాశమే హద్దుగా బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఇపుడు జగన్ కాక మరెవరు ఆ సీట్లో [more]

Update: 2020-07-16 02:00 GMT

జగన్ ఏపీలో భారీ పారామీటర్ పెట్టేశారు. మరో మాటలో చెప్పాలంటే ఆకాశమే హద్దుగా బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఇపుడు జగన్ కాక మరెవరు ఆ సీట్లో ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఇదంతా దేని గురించి అంటే జగన్ స్కీముల గురించే. అడిగిన వారికి కాదనకుండా లేదనకుండా జగన్ మొత్తం ఏపీ బడ్జెట్లో మెజారిటీ వాటా సంక్షేమం అంటూ కేటాయించేశారు. ఇది చాలదు అన్నట్లుగా ఇంకా కొత్త స్కీములు అంటున్నారు. స్కీముల ఉత్సవంగా తొలి ఏడాది గడిచింది. ఇక మిగిలిన నాలుగేళ్ళు ఎలాగో అన్నది ఆర్ధిక శాఖకు టెన్షన్ గా ఉంది.

అయినా సరే….

జగన్ ఇలా స్కీముల పేరిట భారీ ఎత్తున కరెన్సీ పంచడం, అన్ని వర్గాలకు అన్ని రకాల పధకాలు ఇవ్వడం వెనక రాజకీయం ఉంది. అది అందరికీ తెలిసిందే. జగన్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఈ స్కీములే ఆధారం. వాటిని జనంలో చూపించే ఓట్లు అడుగుతారు. అయితే ఇక్కడే మరో మతలబు కూడా ఉంది. జగన్ స్కీముల ఆంధ్రాను చేసి పారేశారు. ఒకసారి నాలుగు వైపుల నుంచి చూస్తే ఏపీలో అమలవుతునన్ని స్కీములు ఎక్కడా లేవు. మిగిలిన వారంతా షాక్ తినేలా జగన్ స్కీములతో ఏపీని చుట్టేశారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఏపీలో స్కీములను మాత్రం తాను వదలను అని జగన్ అంటున్నారు.

రీజనిదేనా ….?

జగన్ తప్ప ఎవరూ కనిపించకూడదు, అఖరుకు వైఎస్సార్ కూడా జగన్ తరువాతే అనుకోవాలి. ఇప్పటికే అది జరుగుతోంది. తండ్రి కంటే నాలుగు అడుగులు ముందుకు జగన్ సాగుతున్నారని వైసీపీ నేతలే కాదు, తటస్థులు మేధావులు కూడా అంటున్నారు. అంతే కాదు, ఇలా స్కీములని ఇంత పెద్ద ఎత్తున చేయగల మొనగాడు కూడా జగన్ ఒక్కడేనన్న సత్యాన్ని కూడా తెలపాలన్నది మరో ఉద్దేశ్యం. ఇక్కడే జగన్ మార్క్ మాస్టర్ ప్లాన్ ఉంది. జగన్ ని కుట్ర చేసి దించాలన్నా, ఆయన్ని పొలిటికల్ గా ఎలాగైనా పక్కకు తప్పించాలని ఎవరు చూసినా గోడకు కొట్టిన బంతిలా వెనక్కే వెళ్తారు. ఎందుకంటే జగన్ లా వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ స్కీములను నడిపించలేరు. ఇక జనమే ఒప్పుకోరు.

అదే శ్రీరామరక్ష….

ఇపుడు జగన్ ఎక్కువ రోజులు అధికారంలో ఉండడు, ఆయన్ని దించేలా ప్లాన్స్ జరుగుతున్నాయి అని కొందరు అంటున్నారు. అది అసంభవం అనుకున్నా రాజకీయాల్లో ఒక్కోసారి ఏదీ చెప్పలేం. అందువల్ల జగన్ కూడా తెలివిగా వ్యవహరిస్తున్నారు. తనని పక్కన పెట్టి ఎవరు వచ్చినా ఒక్క రోజు కూడా జగన్ లా పాలించలేరు అన్నది జనానికి తెలిసిపోవాలన్నదే ప్లాన్. ఇపుడున్న స్థితిలో రోజుకొక స్కీముగా ఏపీని నింపేసిన జగన్ ప్లేస్ ని రీప్లేస్ చేయడం రాజకీయ గండరగండ చంద్రబాబు వల్ల కూడా కాదు, ఇక జగన్ అన్న మాట ప్రకారం ఏడాదిలో అన్ని హామీలు తీర్చడం వెనక గుట్టు అదే. మిగిలిన వారు ఎవరు వచ్చారనుకునా కూడా ఇలా అసలు చేయలేరు. అంతే మళ్ళీ జనం మనసంతా జగన్ మీదకే పోతుంది. అందువల్ల జగన్ తన స్కీములనే శ్రీరామరక్షగా చేసుకుని దూసుకుపోతున్నారు. ఈ నేపధ్యంలో జగన్ ని కనీసం టచ్ చేసేందుకు కూడా ఎవరూ సాహసించలేరు. ఇలాగే జగన్ మరిన్ని ఏళ్ళు సాగితే అసలు టచ్ చేసే అవకాశం కూడా జనం ఇవ్వరు. మొత్తానికి జగన్ తెలివైన ఎత్తుగడలకు అన్ని పార్టీలూ చిత్తే మరి.

Tags:    

Similar News