జగన్ ఉండనిచ్చేట్లు లేరే.. అందుకే వారికి ఆ టెన్షన్

ఆంధ్రప్రదేశ్ లో మంత్రి వర్గ విస్తరణ కొందరి మంత్రులను టెన్షన్ పెడుతోంది. మంత్రివర్గంలోకి కొత్తగా ఇద్దరిని తీసుకోవాల్సి రావడంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 22వ [more]

Update: 2020-07-15 12:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో మంత్రి వర్గ విస్తరణ కొందరి మంత్రులను టెన్షన్ పెడుతోంది. మంత్రివర్గంలోకి కొత్తగా ఇద్దరిని తీసుకోవాల్సి రావడంతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 22వ తేదీన తన కేబినెట్ ను విస్తరించనున్నారు. కొత్తవారు ఎవరికి కేబినెట్ లో చోగు దక్కుతుందన్న విషయంలో అనేక ప్రచారాలుఉన్నాయి. పలువురి పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. అయితే జగన్ ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది చివరి క్షణం వరకూ తెలిసే అవకాశం లేదు.

ఇద్దరికే ఛాన్స్……

అయితే రెండు మంత్రి పదవులను భర్తీ చేయడంతో పాటు శాఖలను జగన్ మారుస్తారన్న టాక్ కొందరి మంత్రుల్లో టెన్షన్ పెడుతోంది. నిజానికి రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, కొత్త వారికి ఛాన్స్ ఉంటుందని జగన్ మొదట్లో స్పష్టం చేశారు. దీంతో మంత్రులు రెండున్నరేళ్లు మనకు తిరుగుండదనుకున్నారు. కొందరు మంత్రులు తమ శాఖల విషయంలోనూ లైట్ గా తీసుకుంటున్నారు.

శాఖలను కూడా మార్చేయాలని….

ఏడాది కాలం పూర్తికావడంతో మంత్రుల గ్రాఫ్ ఎలా ఉందన్న దానిపై నివేదికను తెప్పించుకున్న జగన్ శాఖలను మార్చాలని డిసైడ్ అయ్యారని చెబుతున్నారు. దాదాపు పదిశాఖల్లో మార్పులు తప్పవని చెబుతున్నారు. నిజానికి మంత్రుల్లో కొందరు మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు. మిగిలిన వారు పార్టీని కాని, తమకు అప్పగించిన శాఖలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. అంతేకాదు ప్రత్యర్థి పార్టీలు చేసే విమర్శలకు కూడా కౌంటర్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉండటాన్ని కూడా పార్టీ నాయకత్వం తప్పుపడుతోంది.

కీలక శాఖలను ….

కొన్ని కారణాల రీత్యా మంత్రుల శాఖను మార్చేందుకు జగన్ సిద్ధమయ్యారు. రెవెన్యూ శాఖను కొత్తగా తీసుకునే వారికి కాకుండా ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో సమర్థులైన వారికి అప్పగించాలని జగన్ భావిస్తున్నారు. హోంశాఖను కూడా మార్చాలన్న యోచనలో ఉన్నారని తెలిసింది. దీంతో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రులను కూడా మార్చాలన్న యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం డిప్యూటీ సీఎంలుగా ఉన్న వారు, యాక్టివ్ గా లేని మంత్రుల్లో టెన్షన్ మొదలయింది.

Tags:    

Similar News