కొరగాకుండా పోయారే?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. తనపై నమ్మకం పెట్టుకుని తన వెంట నడిచిన ఆ ఇద్దరికి ఎమ్మెల్సీ పదవి [more]

Update: 2019-11-29 12:30 GMT

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. తనపై నమ్మకం పెట్టుకుని తన వెంట నడిచిన ఆ ఇద్దరికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా వారు ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. ఎమ్మెల్సీ వంటి కీలక పదవి ఇచ్చినా వారు పార్టీకి ఏమాత్రం ఉపయోగ పడటం లేదన్న చర్చ వైసీపీలో నడుస్తుంది. జగన్ వారిపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేసుకుంటున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. జగన్ అపాత్రదానం చేశారని కొందరు వైసీపీ నేతలు ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు.

పార్టీకి ఉపయోగం లేకుండా…..

ఏదైనా పదవి ఇస్తే అది పార్టీకి ఉపయోగపడాలి. ప్రభుత్వానికి సాయపడాలి. కానీ ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు సొంత ప్రయోజనాలకు, సొంత నియోజకవర్గాలకు పరిమితమయ్యారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం కొలువు దీరగానే మూడు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయ్యాయి. అందులో ఒకటి అప్పటికే మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణకు ఇచ్చారు జగన్. ఆయన ఎమ్మెల్యేగా ఓటమి పాలు కావడంతో మోపిదేవి వెంకటరమణకు తప్పనిసరిగా ఎమ్మెల్సీ చేయాల్సి వచ్చింది.

స్పందన ఏదీ?

ఇక మిగిలిన రెండు ఎమ్మెల్సీ పదవులను ఒకరికి మైనారిటీకి ఇచ్చారు. హిందూపురం నియోజకవర్గం నుంచి నందమూరి బాలకృష్ణపై పోటీ చేసి ఓటమి పాలయిన మహ్మద్ ఇక్బాల్ ను జగన్ ఎమ్మెల్సీ చేశారు. మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్న మహ్మద్ ఇక్బాల్ కేవలం నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఇటీవల వివాదం చెలరేగిన ఇంగ్లీష్ మీడియంపై కూడా ఆయన స్పందించలేదు. నియోజకవర్గంలోనూ ఆయన అడపా దడపా కార్యక్రమాల్లోనే పాల్గొంటున్నారు.

నియోజకవర్గానికే పరిమితమై…..

మరో ఎమ్మెల్సీగా చల్లా రామకృష్ణారెడ్డిని జగన్ ఎంపిక చేశారు. చల్లా రామకృష్ణారెడ్డి 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆయన రెడ్డి సామాజికవర్గం కోటాలో ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు. చల్లా రామకృష్ణారెడ్డి రాష్ట్రంలో పేరున్న నేత. అయినా ఆయన ఎమ్మెల్సీ పదవి చేపట్టాక ప్రభుత్వం తరుపున ఏమాత్రం స్పందించడం లేదు. ఆయన కూడా బనగానపల్లె ప్రాంతంలోనే తిరుగుతున్నారు. ఇలా జగన్ కీలక సమయంలో అందరినీ కాదని ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినా వీరు పార్టీకి కొరగాకుండా పోయారన్న టాక్ పార్టీలో నడుస్తుంది.

Tags:    

Similar News