జగన్ కి తిరుమల సెగ ?

వైఎస్ జగన్ వస్తుతహా క్రిస్టియన్. ఆయన దాన్ని ఎక్కడా దాచుకోలేదు కూడా. అయితే ఇంతకు ముందు ఉమ్మడి ఏపీని పాలించిన వారిలో నేదురుమల్లి జనార్ధనరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి [more]

Update: 2020-07-13 06:30 GMT

వైఎస్ జగన్ వస్తుతహా క్రిస్టియన్. ఆయన దాన్ని ఎక్కడా దాచుకోలేదు కూడా. అయితే ఇంతకు ముందు ఉమ్మడి ఏపీని పాలించిన వారిలో నేదురుమల్లి జనార్ధనరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి ఇద్దరూ కూడా క్రిస్టియన్లే. కానీ జగన్ కి సొంత పార్టీ ఉండడం చేత ఆయనకి ఈ మత ముద్ర ఎక్కువగా పడుతోంది. సరే ఇవన్నీ ఎలా ఉన్నా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో జగన్ సర్కార్ గత పాలకున కంటే భిన్నంగానే వెళ్తోంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటోంది. వంశపారంపర్య అర్చకత్వాన్ని పునరుధ్ధరించడమేకాదు , గొల్లలకు కూడా వారి పారంపర్య హక్కులను కాపాడి తిరుమలలో సముచిత స్థానం కల్పించింది.

రాజకీయమేనా …?

ఇంత చేసినా కూడా టీటీడీ బోర్డులో ఉన్న వారు రాజకీయ జీవులు కావడం చేత ఏ చిన్న తప్పు జరిగినా ఆ ప్రభావం నేరుగా ప్రభుత్వం మీద పడుతోంది. ఈ మధ్యనే టీటీడీ ఆస్తులను విక్రయిస్తామని టీటీడీ తీసుకున్న కీలకమైన నిర్ణయం ఎంతటి రభస, రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. నిజానికి అది గత టీడీపీ హయాంలో నాటి చైర్మన్ పుట్టా సుధాకర్ ఆద్వర్యంలోని పాలక మండలి తీసుకున్న నిర్ణయం. అయినా కూడా ముందూ వెనకా చూసుకోకుండా ప్రస్తుత బోర్డు చేసిన తీర్మానంతో ఏకంగా జగన్ కే ఆ సెగ తగిలింది. దాంతో ఉపసంహరించుకోవాల్సివచ్చింది.

ఆయన రివర్స్….

ఇక చంద్రబాబుతో కలసి చదువుకున్న రమణ దీక్షితులను అదే చంద్రబాబు సర్కార్ పదవి నుంచి తొలగించింది. ఆయన్ని జగన్ ఆదుకున్నారు. మళ్ళీ ఆ హక్కును పునరుధ్ధరించారు. అయితే ఇపుడు అదే రమణ దీక్షితులు జగన్ సర్కార్ మీద గుర్రుగా ఉన్నారని ఆయన తాజా ట్వీట్లు స్పష్టం చేస్తున్నాయి. అసలు టీడీపీ ఆస్తుల విక్రయం వేళ కూడా ప్రభుత్వానికి యాంటీగా రమణ దీక్షితులు మాట్లాడారు. ఇపుడు ఆయన ఏకంగా ఒక ట్వీట్ చేస్తూ ప్రభుత్వ కబంధ హస్తాల్లో నుంచి టీటీడీ విముక్తి కావాలని కోరుకుంటున్నారు. ఉత్తరాఖండ్ లో కొన్ని ప్రభుత్వ ఆలయాలను ప్రభుత్వం నుంచి బయటకు తీసుకురావాలన్న దానిపైన న్యాయ పోరాటం జరుగుతోంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీలోని తిరుమల కూడా అలాగే కావాలని రమణ దీక్షితులు కోరుకుంటున్నారు.

మంచిదే కానీ…..

నిజానికి హిందూ దేవాలయాలు పూర్తిగా హిందూ ట్రస్టుల నాయకత్వంలో పనిచేస్తే చాలా మంచిదే. వాటి మీద ప్రభుత్వ పెత్తనం లేకుండా ఉంటే ఇంకా మంచిదే. కానీ స్వతంత్ర భారత దేశంలో అలా జరగడం లేదు. మెజారిటీ హిందూ దేశంగా ఉన్న కారణంగా ఇక్కడ ఆలయాలు కూడా ప్రభుత్వం అజమాయిషీలోకి పోతున్నాయి. దీని మీద చాన్నాళ్ళుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇది అంత సులువుగా తెగే వ్యవహారం కూడా కాదు, ఉత్తరాఖండ్ లోని ఆలయాలకు ఏకంగా అంతర్జాతీయ ఆలయంగా ఉన్న తిరుమలకు పోలిక లేనేలేదు. కానీ ఈ సమయంలో రమణ దీక్షితులు చేసిన ఈ ట్వీట్ ఆయన జగన్ కి వ్యతిరేకంగా ఉన్నారన్న భావనన మాత్రం కలిగిస్తోంది. ఓ విధంగా రమణ దీక్షితులు వంటి వారు తిరుమల అభివ్రుధ్ధి కోసం ముఖ్యమంత్రి జగన్ ని కలసి చర్చింది గైడ్ చేస్తే బాగుండేది. కానీ తనకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం మీదనే కామెంట్స్ పాస్ చేయడం ద్వారా ఈ రాజకీయ రొంపిలోకి దీక్షితులు దిగిపోయారా అనిపిస్తోందని అంటున్నారు.

Tags:    

Similar News