వైసీపీలో ఆ రెండు అగ్ర కులాల‌కు ప‌ద‌వులు ఇస్తారా?

రాష్ట్ర శాస‌న మండ‌లి. ఎప్పటిక‌ప్పుడు వార్తల్లోకి వ‌స్తున్న ఈ పెద్దల స‌భ‌పై తాజాగా మ‌రో వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. వైసీపీ నుంచి ఇద్దరు మండ‌లి స‌భ్యులు ఇటీవ‌ల [more]

Update: 2020-07-09 02:00 GMT

రాష్ట్ర శాస‌న మండ‌లి. ఎప్పటిక‌ప్పుడు వార్తల్లోకి వ‌స్తున్న ఈ పెద్దల స‌భ‌పై తాజాగా మ‌రో వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. వైసీపీ నుంచి ఇద్దరు మండ‌లి స‌భ్యులు ఇటీవ‌ల రాజ‌నామా చేశారు. ఇద్దరూ కూడా పార్టీలో సీనియ‌ర్లు. మంత్రులుగా ఉన్నారు. అయితే, మండ‌లిని ర‌ద్దు చేయాల‌ని జ‌గ‌న్ ధృఢంగా నిర్ణయించుకు న్న నేప‌థ్యంలో రాజ్యస‌భ కు ద‌క్కిన అవ‌కాశాన్ని వినియోగించుకుని.. మంత్రులుగా ఉన్న మోపిదేవి, బోసుల‌ను రాజీనామా చేయించారు. అయితే, మండ‌లి ర‌ద్దు అనేది జ‌గ‌న్ చేతిలో లేని వ్యవ‌హారం కావ‌డం, ఎప్పుడు జ‌రుగుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నేప‌థ్యంలో ఇప్పుడు శాసనమండ‌లిలో ఖాళీ అయిన స్థానాల ‌కు నిబంధ‌న‌ల మేర‌కు భ‌ర్తీ చేస్తున్నారు.

ఇప్పటికే మండలిలో…..

ప్రస్తుతం రెండు ఎమ్మెల్సీ స్థానాల‌ను భ‌ర్తీ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఖాళీ అయిన ఇద్దరు కూడా బీసీ వ‌ర్గానికి చెందిన వారు. ఇక వీరిద్దరు కూడా మంత్రులుగా ఉండ‌డంతో మ‌రో ఇద్దరు మంత్రుల‌ను కూడా జ‌గ‌న్ కేబినెట్లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ రెండు కేబినెట్ ప‌ద‌వులు ఎవ‌రితో భ‌ర్తీ చేస్తార‌న్నది కూడా స‌స్పెన్స్‌గానే ఉంది. ఇక మండ‌లిలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీల‌తో పాటు మ‌రో రెండు కూడా క‌లిపితే మొత్తం నాలుగు ఎమ్మెల్సీలు ఖాళీ అయిన‌ట్టే. మంత్రులు ఖాళీ చేసిన రెండు స్థానాలు బీసీ వ‌ర్గానికి చెందిన‌వే. అయితే ఇప్పటికే మండ‌లిలో వైసీపీకి బీసీలు చాలా మంది ఉన్నారు.

ఈ రెండు సామాజిక వర్గాలు….

అదేవిధంగా రెడ్డి సామాజిక వ‌ర్గానికి కూడా ప్రాతినిధ్యం ఉంది. కానీ, వైశ్య, క‌మ్మ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వైసీపీ నాయ‌కులు ఇప్పుడు మండలిలో ఎవ‌రూ లేరు. అయితే, మంత్రి వ‌ర్గంలో ఉన్నారు. దీంతో మండ‌లిలో ఈ సామాజి క వ‌ర్గాల ఈక్వేష‌న్‌ను కూడా స‌రిచేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ని అంటున్నారు. ఈ క్రమంలో నే ఇటీవ‌ల పార్టీలోకి వ‌చ్చిన వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన శిద్దా రాఘ‌వ‌రావును మండ‌లికి ప్రమోట్ చేస్తార‌ని అంటున్నారు. గ‌తంలో టీడీపీ ప్రభుత్వంలోనూ శిద్దా మంత్రిగా ఉన్నారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఒంగోలు పార్లమెంటు స్థా నం నుంచి పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు. 2004లో ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిన ఆ త‌ర్వాత ఎమ్మెల్సీ కూడా అయ్యారు.

జగన్ హామీ ఇచ్చి….

త‌ర్వాత రాజ‌కీయ కార‌ణాల నేప‌థ్యంలో శిద్దా.. పార్టీ వైసీపీ గూటికి చేరుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు ఏదైనా ప‌ద‌వి ఇస్తార‌నే ప్రచారం ఉంది. ప్రస్తుతం మండ‌లిలో అయిన ఖాళీని ఆయ‌న‌కు కేటాయించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇక‌, ప్రకాశం జిల్లాకే చెందిన గొట్టిపాటి భ‌ర‌త్‌.. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. 2014లో ఈయ‌న వైసీపీ నుంచి ప‌రుచూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ నుంచి స్వయంగా త‌ప్పుకున్న ఆయ‌న‌కు జ‌గ‌న్ ఎమ్మెల్సీ ఇస్తాన‌ని హామీ ఇచ్చారు.

అదే ఫార్ములా అయితే….

ఇక క‌మ్మ సామాజిక వ‌ర్గంలో అన్నింటిక‌న్నా ముఖ్యంగా గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ పేరు ప్రముఖంగా తెర‌మీద‌కు వ‌స్తోంది. గత ఎన్నిక‌ల్లో సీటు త్యాగం చేసిన రాజ‌శేఖ‌ర్‌కు జ‌గ‌న్ బ‌హిరంగంగానే ఎమ్మెల్సీతో పాటు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని జగన్ ఒప్పుకున్నారు. దీంతో ఇప్పుడు అటు మండ‌లిలో ప‌ద‌వులు ఖాళీ అయ్యాయి.. కేబినెట్లో రెండు ప‌ద‌వులు ఖాళీగా ఉన్నాయి. మ‌రి జ‌గ‌న్ తాను ఇచ్చిన మాట ప్రకారం రాజ‌శేఖ‌ర్ విష‌యంలో ఏం చేస్తారో ? జ‌గ‌న్ ఈ ఫార్ములానే ఎంచుకుంటారా.? లేదా? అనేది చూడాలి.

Tags:    

Similar News